Description
ఇస్లాం సర్వలోకాల ప్రభువు యొక్క ధర్మం
ఇతర అనువాదాలు 50
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో,
ఇది ఉనికిలో ఉన్న గొప్ప ప్రశ్న; ఒక వ్యక్తి తప్పనిసరిగా సమాధానం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న
ఆయనే మన ప్రభువు ఎవరైతే భూమ్యాకాశాలను సృష్టించాడో, మరియు ఆకాశం నుంచి నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తద్వారా పండ్లను మరియు చెట్లను మన కొరకు మరియు పశువుల కొరకు ఆహారంగా చేశాడు వేటినైతే మనము ఆహారంగా వినియోగిస్తున్నామో.మరియు ఆయనే మనల్ని సృష్టించాడు మరియు మన పూర్వికులను సృష్టించాడు. మరియు ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. మరియు ఆయనే రేయింబవళ్లను తయారు చేశాడు. మరియు ఆయనే రాత్రిని నిద్ర మరియు విశ్రాంతి సమయంగా మరియు పగటిని ఆహారమును మరియు ఉపాధిని అన్వేషించుట కొరకు చేశాడు.మరియు ఆయనే మనకు సూర్యచంద్రులను, నక్షత్రాలను మరియు సముద్రాలను ఉపయుక్తంగా చేశాడు. మరియు మనకు జంతువులను ఉపయుక్తంగా చేశాడు. మనము వాటి నుంచి తింటున్నాము మరియు వాటి పాల నుంచి మరియు వాటి ఉన్ని నుంచి ప్రయోజనాన్ని పొందుతున్నాము.
ఆయనే ప్రభువు ఎవరైతే సృష్టిని సృష్టించాడో. మరియు ఆయనే వారికి సత్యం మరియు సన్మార్గం వైపు దారి చూపుతునన్నాడు. మరియు ఆయనే సకల సృష్టితాల వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. మరియు ఆయనే వాటికి ఉపాధిని ప్రసాధిస్తున్నాడు. మరియు ఆయనే ఇహపరలోకాల ప్రతి దానికి యజమాని. మరియు ప్రతి వస్తువు ఆయన యాజమాన్యమే మరియు ఆయన తప్ప ప్రతిది ఆయన సొంతమే.మరియు ఆయన సజీవుడు మరణం మరియు నిద్ర లేని వాడు. మరియు ఆయన నిత్యుడు ఎవరి ఆజ్ఞతోనే ప్రతీ జీవి నిలకడగా ఉందో. మరియు ఆయన కారుణ్యమే ప్రతి వస్తువును ఆవరించి ఉన్నది. మరియు భూమ్యాకాశాలలో ఏదీ ఆయనకు గోప్యంగా లేదు.ఆయనను పోలినది ఏదీ లేదు మరియు ఆయన వినేవాడు చూసేవాడు. మరియు ఆయన ఆకాశాలపై ఉన్నాడు. తన సృష్టి అక్కర లేని స్వయంసంవృద్ధుడు. మరియు సృష్టికి ఆయన అవసరం ఉంది. ఆయన తన సృష్టిలో లీనం అవ్వడు మరియు ఆయనలోగాని ఆయన గుణగణాలలో గాని సృష్టి లీనం కాలేదు. ఆయన పవిత్రుడు మరియు మహోన్నతుడుఆయనే ప్రభువు ఎవరైతే ఉనికిలో ఉన్న ఈ లోకాన్ని దాని సమస్త విభాగాలలో సమతుల్యంగా సృష్టించాడో అది విఫలం కాదు. అది మానవ శరీర క్రమమైనా లేదా జంతువుల శరీర క్రమమైనా సరే, లేదా సూర్యుడు నక్షత్రాలు వంటి మనచుట్టూ ఉన్న సౌర్యరాశులైనా ఆయనే వాటిని క్రమబద్దీకరించాడు.
మరియు ఆయన కాకుండా ఏవరైతే ఆరాధింపబడుతున్నారో వారు తమ సొంత లాభ నష్టాల యాజమాన్యం కూడా కలిగి లేరు. మరలాంటప్పుడు వారిని ఆరాధించేవారికి ఎలా లాభాన్ని నష్టాన్ని కలిగించగలరు. లేదా వారి నుంచి చెడును ఎలా దూరం చేయగలరు.
నిస్సందేహంగా సమస్త దాసులపై ఆయన (అల్లాహ్ యొక్క) హక్కు ఏమిటింటే కేవలం ఆయన్నే ఆరాధించాలి మరియు ఆయనకు ఏ భాగస్వామ్యం కల్పించ కూడదు. ఆయనను తప్ప, లేదా ఆయనతో పాటు మనిషినైనా లేదా రాయినైనా, నదినైనా లేదా నిర్జీవమైనదైనా మరియు నక్షత్రమైనా సరే ఆరాధించ కూడదు. వాస్తవానికి తమ ఆరాధనలను సకలలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకోవాలి.
నిస్సందేహంగా అల్లాహ్ పై దాసుల హక్కు ఏమిటంటే ఎప్పుడైతే వారు ఆయన్ని ఆరాధిస్తారో ఆయన వారికి అటువంటి ఉన్నత జీవితాన్ని ప్రసాదించాలి ఎందులోనైతే వారు శాంతి, భద్రత, సంతృప్తి మరియు ప్రశాంతతను పొందుతారో. మరియు పరలోకంలో వారిని స్వర్గంలో ప్రవేశింపజేయాలి ఎందులోనైతే కలకాలం ఉండే అనుగ్రహాలు మరియు శాశ్వత నివాసం ఉంటుందో. మరియు ఒకవేళ వారు ఆయన ఆదేశాన్ని నిరాకరిస్తే ఆయన వారి జీవితాలను కష్టతరం చేస్తాడు వారు తాము సంతోషంలో మరియు ప్రశాంతతలో ఉన్నాము అని అనుకుంటున్నా సరే. మరియు పరలోకంలో వారిని నరకంలో ప్రవేశింపజేస్తాడు దాని నుంచి వారు బయటపడలేరు. మరియు అందులో వారికి నిరంతరాయమైన శిక్ష ఉంటుంది మరియు అదే వారి శాశ్వత నివాసము.
నిస్సందేహంగా గౌరవనీయుడైన ప్రభువు (అల్లాహ్) మనల్ని ఒక ఉన్నత లక్ష్యం కోసం సృష్టించాడని తెలియపరచాడు. అది ఏమిటంటే మనము ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఆయనకు ఏ భాగస్వామ్యం కల్పించకూడదు. మరియు మంచితనాన్ని, సంస్కరణను భూమిలో వ్యాపింపజేసే భాద్యతను అప్పగించాడు. మరెవరైతే తన ప్రభువును కాకుండా ఇతరులను ఆరాధించాడో అతను ఏ లక్ష్యం కోసం సృష్టించబడ్డాడో గుర్తించలేదు. అంతే కాకుండా అతను తన ప్రభువు పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. మరియు ఎవరైతే భూమిపై కల్లోలాన్ని వ్యాపింపజేశాడో అతడు తనకు ఇవ్వబడిన బాధ్యతను తెలుసుకోలేదు.
గౌరవోన్నతుడైన అల్లాహ్ మనల్ని సృష్టించి నిర్లక్ష్యంగా వదలలేదు. మరియు మన జీవితాన్ని వృధాగా చేయలేదు. అయితే ఆయన మనుషులలో నుంచి ప్రవక్తలను తమ జాతుల కొరకు ఎంచుకున్నాడు. వారు ప్రజలలో అత్యంత నైతికతను కలిగిన వారు , మరియు పరిశుద్ధమైన ఆత్మ మరియు మనసు కలిగిన వారు. కాబట్టి వారిపై ఆయన దైవదౌత్యాన్ని అవతరింపజేశాడు. అందులోవారికి తప్పనిసరిగా తమ ప్రభువు గురించి తెలియజేయాల్సిన విషయాలన్నీఇమిడి ఉన్నాయి. మరియు ప్రతిఫల దినం మరియు లెక్కల దినమైన ప్రళయదినాన తిరిగి లేపబడటం గురించి సమస్త విషయాలు పొందుపరచబడి ఉన్నాయి.దైవప్రవక్తలు తమ జాతివారికి తమ ప్రభువును ఎలా ఆరాధించాలో తెలియజేశారు. మరియు ఆరాధనా పద్ధతులను, ఆరాధనా సమయాలను మరియు ఇహపరాలలో వాటి ప్రతిఫలాన్ని వారికి వివరించారు. మరియు వారి ప్రభువు వారికి వేటిని నిషేధించాడో తెలియజేశారు. అన్న పానియాలు, పెళ్ళిల్లు తదితర విషయాలు మరియు వారికి నైతిక విలువలను సూచించారు మరియు చెడు ప్రవర్తన నుండి వారించారు.
అల్లాహ్ దగ్గర స్వీకారయోగ్యమైన ధర్మం ఇస్లాం మాత్రమే. మరియు ఈ ధర్మాన్నే దైవప్రవక్తలందరూ ప్రచారం చేశారు. అల్లాహ్ ప్రళయదినాన ఏ ఇతర ధర్మాన్ని స్వీకరించడు. మరియు ఇస్లాం కాకుండా ప్రజలు ఏదైతే స్వీకరించారో అది అధర్మం మరియు దానిని నమ్మేవారికి అది ఏ విధమైన ప్రయోజనాన్ని కలిగించదు. అంతేకాకుండా ఇహపరాలలో వారికి నష్టం కలిగిస్తుంది.
ఈ ధర్మాన్ని అల్లాహ్ తన దాసుల కొరకు సులభతరం చేశాడు. కనుక దీని మూలాలు ఏమిటంటే, మీరు అల్లాహ్ ను ప్రభువుగా నిజఆరాధ్యదైవంగా విశ్వసించాలి. మరియు ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని మరియు విధివ్రాతను విశ్వసించాలి. మరియు మీరు సాక్ష్యమివ్వాలి అల్లాహ్ తప్ప నిజఆరాధ్యదైవం లేడని మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని, మరియు మీరు నమాజును స్థాపించాలి, ఒకవేళ మీవద్ద జకాత్ విధికి చేరిన ధనం ఉంటే జకాతును చెల్లించాలి, సంవత్సరంలో ఒకసారి రమజాన్ నెల ఉపావాసం ఉండాలి, ఒకవేళ స్థోమత ఉంటే అల్లాహ్ కొరకు ఆయన గృహం వైపు హజ్ చేయాలి దేనినైతే తన ప్రభువు ఆజ్ఞతో ఇబ్రాహీం అలైహిస్సలాం నిర్మించారు.మరియు అల్లాహ్ మీపై వెటినైతే నిషేధించాడో దాని నుంచి దూరంగా ఉండండి. ఉదాహరణకు బహుదైవారాధాన చేయడం, అన్యాయంగా హతమార్చడం, వ్యభిచారం మరియు నిషేధించిన (హరామ్) సొమ్మును తినడం లాంటివి. ఒకవేళ మీరు అల్లాహ్ ను విశ్వసిస్తే, ఈ ఆరాధనలను ఆచరిస్తే, మరియు ఈ నిషేధించబడిన వాటికి దూరంగా ఉంటే అప్పుడు మీరు ఇహలోకంలో వాస్తవ ముస్లిం (విధేయుడు)అవుతారు. మరియు పరలోకంలో మీకు స్వర్గంలో శాశ్వత అనుగ్రహాలు మరియు శాశ్వత నివాసం ప్రసాదించబడుతుంది.
ఇస్లాం అల్లాహ్ యొక్క ధర్మము ఇది మానవులందరి కోసం. ఇందులో ఎవరికీ ఎవరిపై ఆధిక్యత లేదు కానీ అల్లాహ్ యొక్క దైవభీతి మరియు పుణ్య కార్యాలకు తప్ప. మరియు ఇందులో మానవులందరూ సమానమే.
ప్రజలు ప్రవక్తల సత్సీలతను ఎన్నో విధాలుగా గుర్తించ వచ్చు అందులో కొన్ని:
వారు ఏదైతే సత్యాన్ని మరియు ఋజుమార్గాన్ని తీసుకువచ్చారో దానిని బుద్ది స్వీకరిస్తుంది మరియు తెలివి దాని మేలుకు సాక్ష్యమిస్తుంది. మరియు దైవప్రవక్తలు తప్ప మిగతావారు ఎవ్వరూ ఇటువంటి సందేశాన్ని తీసుకురాలేరు.
దైవప్రవక్తలు ఏదైతే తీసుకువచ్చారో అందులో అన్ని ధర్మాల యొక్క ప్రపంచ వాసుల సంక్షేమం మరియు వారి ఐహిక వ్యవహారాల దిద్దుబాటు, వారి సంస్కృతి యొక్క అభివృద్ధి మరియు వారి ధర్మము, వారి తెలివితేటలు, సంపద మరియు గౌరవం యొక్క రక్షణ ఉన్నది.
దైవప్రవక్తలు (వారిపై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక) ప్రజలను మంచి మరియు ఋజుమార్గం వైపు పిలవడానికి వారి నుంచిఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించరు. కాగా వారు తమ ప్రభువు నుంచి ప్రతిఫలాన్ని ఆశిస్తారు.
ప్రవక్తలు ఏదైతే (సందేశాన్ని) తీసుకువచ్చారో అందులో సత్యం మరియు నమ్మకం ఉన్నది. అందులో ఏవిధమైన సందేహం లేదు. అందులో ఏవిధమైన వైరుధ్యము లేదు మరియు ఏ అనుమానమూ లేదు. ప్రతి ప్రవక్త తనకు పూర్వం వచ్చిన ప్రవక్తలను ధృవీకరిస్తారు మరియు తమకంటే ముందువారు దేని వైపు ఆహ్వానించారో దాని వైపే ఆహ్వానిస్తారు.
నిస్సందేహంగా అల్లాహ్ స్పష్టమైన నిదర్శనాలు మరియు అద్భుత మహిమల ద్వారా దైవప్రవక్తలను ధృవీకరిస్తాడు. వాటి ద్వారా వారు అల్లాహ్ తరఫున వచ్చిన సత్యబద్ధమైన దైతప్రవక్తలుగా నిరూపిస్తాడు. మరియు దైవప్రవక్తల అధ్బుతాలలో గొప్ప అద్భుతం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అద్భుతం బహు గొప్పది అదే దివ్య ఖుర్ఆన్.
ఖుర్ఆన్ సకలలోకాల ప్రభువు యొక్క గ్రంధం. అది అల్లాహ్ యొక్క వాక్కు. దానిని అల్లాహ్ దూత జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేశాడు. మరియు అందులో అల్లాహ్ మానవులపై విధించిన సమస్త విషయాల గురించి, అల్లాహ్, ఆయన దూతలు మరియు ఆయన గ్రంధాలు మరియు ఆయన ప్రవక్తలు మరియు అంతిమ దినం మరియు విధి యొక్క మంచి చెడుల గురించి జ్ఞానం ఉంది.మరియు అందులో విధిగావించబడిన ఆరాధనలు, తప్పక దూరంగా ఉండవలసిన నిషేదితాలు , మరియు నైతిక విలువలు మరియు దుర్గుణాలు మరియు ప్రజల ధర్మం వారి ఇహపరాలకు సంబంధిచిన సమస్త వ్యవహారాలు ఉన్నాయి. మరియు ఇది ఒక అద్భుతమైన గ్రంధం. అల్లాహ్ మానవులకు ఇటువంటి దానిని తయారు చేసుకురండి అని ఛాలెంజ్ చేశాడు. మరియు ఇది ప్రళయం వరకు రక్షించబడుతుంది. ఇది అవతరించిన భాషలో ఏ అక్షరమైన తగ్గడం గాని మార్చడం గాని జరుగలేదు.
మీరు జీవం లేనటువంటి మృతభూమిని చూడలేదా మరి ఎప్పుడైతే దానిపై నీరు కురుస్తుందో అది పులకించి అన్నిరకాల పచ్చని వృక్షాలను పుట్టిస్తుంది. నిస్సందేహంగా దానిని ఎవరైతే బ్రతికించాడో ఆయన (అల్లాహ్) మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించగలడు.నిస్సందేహంగా ఎవరైతే మనిషిని వీర్యబిందువు నుంచి ధ్రవపదార్ధపు సారంతో సృష్టించాడో ఆయన ప్రళయదినాన తిరిగి లేపే సామర్ధ్యం కలవాడు. ఆయన వారి లెక్క తీసుకుంటాడు మరియు వారికి పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. వారు మంచిచేస్తే మంచి లేదా చెడు చేస్తే చెడు (ప్రతిఫలం ఇస్తాడు).నిస్సందేహంగా భూమ్యాకాశాలను నక్షత్రాలను సృష్టించినవాడు తిరిగి మనిషిని సృష్టించే సామర్ధ్యం గలడు. ఎందుకంటే మనిషిని మరోసారి సృష్టించడం భూమ్యాకాశాలను సృష్టించడం కన్నా ఎంతో సులువు.
సకల లోకాల ప్రభువు సృష్టిని తమ సమాధుల నుంచి వెలికితీస్తాడు. ఆతరువాత వారి కర్మల లెక్కతీసుకుంటాడు. ఇక ఎవరైతే విశ్వసించారో మరియు ప్రవక్తలను దృవీకరించారో ఆయన వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. అది శాశ్వత అనుగ్రహం దాని గొప్పతనం గురించి ఏ మనసు ఊహించలేదు. మరియు ఎవరైతే తిరస్కరిస్తారో వారిని నరకంలో ప్రవేశింపజేస్తాడు అది నిరంతారయమైన కఠిన శిక్ష దానిని మనిషి ఊహించలేడు. మరియు ఎప్పుడైతే మనిషి స్వర్గంలో లేదా నరకంలో ప్రవేశిస్తాడో నిస్సందేహంగా అతడు ఎన్నటికీ మరణించడు. అతడు నరకశిక్షలో లేదా స్వర్గ అనుగ్రహంలో శాశ్వతంగా నివసిస్తాడు.
ఎప్పుడైతే మనిషి సత్యమైన ధర్మం ఇస్లాం అని, మరియు అది సకలలోకాల ప్రభువు యొక్క ధర్మం అని తెలుసుకుంటాడో ఇక అతను ఇస్లాంలో ప్రవేశించడానికి త్వరపడాలి. ఎందుకంటే తెలితేటలు గలవారికి సత్యం తెలియగానే దాని వైపు త్వరపడాలి. మరియు ఇందులో ఆలస్యం చేయకూడదు.మరియు ఎవరైతే ఇస్లాంలో ప్రవేశించాలనుకుంటారో వారికి ప్రత్యేక ఆచరాలు చేయనవసరం లేదు. మరియు ఒకరి సమక్షంలో స్వీకరించనవసరం లేదు. కానీ అది ఎవరైనా ఒక ముస్లిం లేదా ఇస్లామీయ కేంద్రం సమక్షంలో జరిగితే అది అతనికి మంచిది. లేదా అతను కేవలం ఇలా పలికితే సరిపోతుంది : అష్హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్ (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజఆరాధ్య దైవం లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని) దీని అర్ధాన్ని తెలుసుకుని దానిని విశ్వసిస్తూ పలకాలి. తద్వారా అతను ముస్లిం అవుతాడు. ఆతరువాత అతను అల్లాహ్ విధించిన వాటిని నెరవేర్చడానికి ఇస్లాం యొక్క మిగతా అంశాలను నెమ్మదిగా నేర్చుకోవాలి.
ఇస్లాం సర్వలోకాల ప్రభువు యొక్క ధర్మం
సకల లోకాల ప్రభువు యొక్క గుణగణాలు ఏమిటి?
మనపై మన ప్రభువు యొక్క హక్కు ఏమిటి?
మన ఉనికి లక్ష్యం ఏమిటి? మరియు మనము ఎందుకు సృష్టించబడ్డాము?
మన ప్రభువును మనం ఎలా ఆరాధించాలి?
గౌరవోన్నతుడైన అల్లాహ్ దగ్గర ఏ ధర్మం స్వీకారయోగ్యం అవుతుంది?
ఇస్లాం ధర్మం యొక్క సూత్రాలు మరియు మూలస్తంభాలు ఏమిటి?
ఇస్లాం ఒక ప్రత్యేక జాతి లేదా మతానికి చెందిన ధర్మమా?
ప్రజలు దైవప్రవక్తల (వారిపై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక) సత్సీలతను ఎలా గుర్తిస్తారు?
మరణాంతరం తిరిగి లేపబడటం మరియు లెక్కతీసుకోవడం యొక్క ఆధారం ఏమిటి?