Description
నవ ముస్లింకు ఉపయోగకరమైన సంక్షిప్త నామం
Other Translations 48
తయారీ
ముహమ్మద్ అష్షహరీ
2020 - 1441
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం)
దీని తరువాత
అల్లాహ్ తఆలా ఆదమ్ సంతతికి గౌరవం ప్రసాదించాడు. మరయు తన సృష్టిలోంచి చాలా వాటిపై వారికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మేము ఆదం సంతతికి గౌరవం వొసగాము}
అర్రహ్మాను'కరుణామయుడు:సమస్తాన్ని ఆవరించి ఉన్నమహోన్నత,విశాల,కరుణామయుడు.
అల్ ఖదీరు:-ఆయన సంపూర్ణ శక్తిసామర్థ్యాలను కలిగినవాడు,దానికి (ఆ సామర్థ్యానికి) ఎటువంటి అసమర్థత, బలహీనత, దరిచేరదు.
అల్-మలికు:- ఇది గొప్పతనం,ఆధిక్యత మరియు ప్రణాళిక వంటి లక్షణాలతో వివరించబడింది, సమస్త వస్తువులకు యజమాని,మరియు ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అమలుపర్చే అధికారి.
అస్సలాము: సమస్త లోపాలకు,బలహీనతలకు మరియు దోషాలకు అతీతుడు.
అల్-బసీరు:-ప్రతి దానిని'అది ఎంత చిన్నదైన,రేణువైన కంటి చూపుతో చుట్టుముట్టినవాడు,విషయాలపై అంతర్దృష్టి కలవాడు,సర్వ విషయాలకు నిపుణుడు,అంతర్గత పరిజ్ఞానం కలవాడు.
అల్ వకీలు:- తన సృష్టిజీవనోపాధికి సంరక్షకుడు,వారి ప్రయోజనాలకు బాధ్యుడు,మరియు ఆయనే తన మిత్రులను నియమిస్తాడు వారికి సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు,కష్టకారకాల నుండి రక్షిస్తాడు, వారి వ్యవహారాలకు సరిపోతాడు.
అల్ ఖాలిఖు:-వస్తువులకు ఉనికిని ప్రసాదించువాడు,ఎటువంటి పూర్వప్రణాళిక,నమూనా లేకుండా ఆవిష్కరించువాడు.
అల్లతీఫ్ : ఆయనే తన దాసులను గౌరవిస్తాడు మరియు వారిపై దయ చూపుతాడు మరియు వారు అర్ధించిన వాటిని వారికి ప్రసాదిస్తాడు.
అల్ కాఫీ:- తన సమస్త దాసులకు మరియు వారికి అవసరమైన అన్నిటికీ సరిపోయేవాడు,మరియు ఆయన సహాయంతో ఇతరులకు సరిపోతాడు మరియు ఇతరులు సంతృప్తి చెందుతారు.
అల్ గఫూరు:-ఆయన తన దాసులను వారి పాపాల నుండి రక్షిస్తాడు మరియు ఆ చర్యలపై వారిని శిక్షించడు.
ఒక ముస్లిం అల్లాహ్ సృష్టి అద్భుతములో మరియు ఆయన సులభతరం చేయటంలో యోచన చేస్తాడు. సృష్టి తమ చిన్న(పిల్లలను) లను చూసుకోవటం వారిని తినిపించటం పై అత్యాస కలిగి ఉండటం దీనిలో నుంచే మరియు వారిని చూసుకోవటం అనేది వారు తమ కాళ్ళపై నిలబడే వరకు. కావున వారి సృష్టికర్త పరిశుద్ధుడు మరియు వారి సూక్ష్మాంశాలను తెలుసుకునేవాడు. మరియు వారి పూర్తి బలహీనత ఉన్నప్పటికి ఆయన వారికి సహాయపడే,వారి పరిస్థితులను చక్కదిద్దే కారకాలను వారికి అందించడం ఆయన సూక్ష్మాంశాలను తెలుసుకోవటంలో నుంచే.
నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యముర్తిగా పంపించబడినవారు.
ఆయన ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల,సందేశహరుల పరిసమాప్తకులు. ఆయనను అల్లాహ్ తఆలా ఇస్లాం ధర్మమునిచ్చి ప్రజలందరి వద్దకు పంపించాడు. వారిని మేలు గురించి తెలపటానికి అందులో గొప్పదైనది తౌహీదు (ఏక దైవోపాసన). మరియు వారిని చెడు నుండి వారించటానికి అందులో అత్యంత చెడ్డది షిర్కు.
దివ్యఖుర్ఆన్ మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు. దాన్ని ఆయన ప్రజలను చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీయటానికి మరియు వారిని సన్మార్గము వైపునకు మార్గదర్శకం చేయటానికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు.
దాన్ని చదివేవారికి గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుంది. దాని మార్గనిర్దేశం పై ఆచరించే వారు సరైన మార్గం పై నడుస్తారు.
ఇస్లాం మౌలికంశాలను నేను తెలుసుకుంటాను.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఇస్లాం ఐదు విషయములపై నిర్మితమై ఉన్నది : అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం,నమాజు నెలకొల్పటం,జకాత్ ఇవ్వటం,రమజాన్ ఉపవాసములుండటం,దైవ గృహము హజ్ చేయటం.
మొదటి మౌలికాంశము : అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:- {అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నీవు తెలుసుకో} [ముహమ్మద్ : 19]
అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని సాక్ష్యమివ్వటం యొక్క అర్థం : అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్యదైవం లేడు.
నమాజును నెలకొల్పటం అనేది దాన్ని అల్లాహ్ ధర్మబద్ధం చేసిన విధంగా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు నేర్పించిన విధంగా నిర్వర్తించటంతో అవుతుంది.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:- {మరియు మీరు జకాత్ చెల్లించండి}. [అల్ బఖ్రా : 110]
అది ధనం నిర్ణీత పరిమాణమునకు చేరినప్పుడు అందులో (ధనంలో) విధిగావించబడిన హక్కు. అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో ప్రస్తావించిన ఎనిమిది రకములకు అది ఇవ్వబడుతుంది. వారిలో నిరుపేదలు మరియు అగత్యపరులు ఉన్నారు.
నిధి చేయబడ్డ సంపద అయిన బంగారం,వెండి మరియు కరెన్సీ నోట్లు మరియు లాభం పొందే ఉద్దేశముతో అమ్మకానికి,కొనుగోలు చేయటానికి సిద్ధం చేయబడ్డ వ్యాపార సామగ్రి వంటి సంపదల జకాత్ పరిమాణం 2.5% అది కూడా వాటి వెల నిర్ణీత పరిమాణమునకు చేరి వాటిపై పూర్తి ఒక సంవత్సరం గడిచిపోయినప్పుడు.
మరియు అదేవిధంగా భూ ఉత్పత్తులైన ధాన్యములు,పండ్లు,గనులు,నిధులలో అవి నిర్ణీత పరిమాణమునకు చేరినప్పుడు వాటిలో జకాత్ విధి అవుతుంది.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:- {ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వికులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!} [అల్ బఖ్రా : 110]
రమజాన్ : అది హిజ్రీ క్యాలండరు ప్రకారం సంవత్సరపు తొమ్మిదో నెల. అది ముస్లిముల వద్ద గొప్ప నెల. మరియు దానికి సంవత్సరపు మిగితా నెలల కన్న ప్రత్యేక స్థానం ఉంది. మరియు దాని పూర్తి ఉపవాసములు ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభముల్లో ఒకటి.
రమజాన్ మాసపు ఉపవాసముండటం అది : పవిత్ర రమజాన్ మాసం రోజులంతా ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు తినటం,త్రాగటం,సంభోగము మరియు ఉపవాసమును భంగపరిచే వాటి నుండి ఆగి ఉండి అల్లాహ్ తఆలా కొరకు ఆరాధన చేయటం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:- అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి ఆ గృహ హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. [ఆలే ఇమ్రాన్:97] హజ్ అనేది దాని వైపునకు వెళ్ళే స్థోమత కలిగిన వారి కొరకు జీవితకాలంలో ఒకసారి చేయవలసి ఉంటుంది. మరియు అది ఎలాగంటే నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట ఆరాధనలు నిర్వర్తించటం కొరకు మక్కా ముకర్రమాలో ఉన్న పరిశుద్ధ గృహమును మరియు పవిత్ర స్థానాల ఉద్దేశ్యంతో( హజ్ చేయడం). మరియు నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్ చేశారు. మరియు ఆయన కన్న మునుపటి ప్రవక్తలు హజ్ చేశారు. మరియు అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ప్రజల్లో హజ్ గురించి ప్రకటించమని ఆదేశించాడు. దాని గురించి అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో తెలియపరచాడు. మరియు ఇలా పలికాడు : మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు : "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు. [ అల్ హజ్జ్ :27]
ఇస్లాం మౌలికంశాలను నేను తెలుసుకుంటాను.
మరియు బాహ్య అవయవములతో ఆచరించేవి. ఉదాహరణకు : నమాజ్,హజ్జ్,ఉపవాసములు. మరియు హృదయంతో సంబంధం ఉన్న అంతర్గత అవయవములతో ఆచరించేవి. ఉదాహరణకు : అల్లాహ్ ను ప్రేమించడం,ఆయనకు భయపడటం, ఆయనపై నమ్మకం ఉంచటం,ఆయన కొరకు చిత్తశుద్ధి.
అల్లాహ్ పై విశ్వాసమునకు ఆయన రుబూబియత్ లో,ఆయన ఉలీహియత్ లో ఆయన నామములు,గుణముల్లో ఆయన ఏకత్వము అవసరం. మరియు అది ఈ క్రింది వచ్చే వాటిలో ఉంటుంది :
పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన ఆయన ఉనికిపై విశ్వాసం ఉంచడం.
పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన ఆయన రుబూబియత్ (ప్రభువు అవటం) పై విశ్వాసం ఉంచడం. మరియు ప్రతీ దాని యజమాని, దాని సృష్టికర్త,దాని ఆహారోపాధకుడు మరియు దాని వ్యవహారమును నడిపేవాడు ఆయనే అని విశ్వసించడం.
పరిశుద్ధుడైన ఆయన ఉలూహియత్ పై విశ్వాసం ఉంచడం. మరియు ఆయన ఒక్కడే ఆరాధనకు హక్కుదారుడని నమాజు,అర్ధన,మొక్కుబడి,జుబాహ్ చేయటం,సహాయం కోరటం,శరణువేడుకోవటం మరియు ఇతర ఆరాధనలు లాంటి దేనిలోను ఆయనకు సాటి ఎవరూ లేరని విశ్వసించడం.
ఆయన స్వయంగా తనకోసం నిరూపించుకున్న లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కొరకు నిరూపించిన ఆయన మంచి పేర్లను,ఆయన ఉన్నత గుణములను విశ్వసించడం మరియు ఆయన స్వయంగా నిరాకరించిన లేదా ఆయన ప్రవక్త ఆయన నుండి నిరాకరించిన నామములను,గుణములను నిరాకరించడం. మరియు ఆయన నామములు,ఆయన గుణములు పరిపూర్ణతలో,అందంలో అత్యంత స్థానమునకు చేరినవి. మరియు ఆయనను పోలినది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు,చూసేవాడు.
రెండవ మూలస్తంభం : దైవదూతలపై విశ్వాసం ఉంచడం.
మరియు వారు ఒక గొప్ప సృష్టి,వారి శక్తిని మరియు వారి సంఖ్యను మహోన్నతుడైన అల్లాహ్ మాత్రమే చుట్టుముట్టి ఉన్నాడు. మరియు వారిలో నుంచి ప్రతి ఒక్కరికి అల్లాహ్ కేటాయించిన వర్ణాలు,పేర్లు మరియు విధులున్నాయి. వారిలో నుంచి దైవవాణి బాధ్యత ఇవ్వబడిన జిబ్రయీల్ అలైహిస్సలాం ఉన్నారు. ఆయన దానిని అల్లాహ్ వద్ద నుండి తీసుకుని ఆయన ప్రవక్తల వద్దకు దిగుతారు.
మూడవ మూలస్తంభం : గ్రంధములను విశ్వసించడం.
మరియు మహోన్నతుడైన అల్లాహ్ తన పుస్తకంలో ప్రస్తావించిన దివ్యగ్రంధాలు. అవి :
నాల్గవ మూలస్తంభం ప్రవక్తల పై విశ్వాసం ఉంచడం.
అల్లాహ్ తఆలా ప్రతీ సమాజంలో ఒక ప్రవక్తను ఎటువంటి సాటి లేని ఒక్కడైన అల్లాహ్ ఆరాధన చేయటం వైపునకు మరియు మహోన్నతుడైన ఆయనను వదిలి ఆరాధించబడే వాటిని తిరస్కరించటం వైపునకు వారిని పిలిచేవాడిగా పంపించాడని దృఢంగా నమ్మటం.
మరియు వారందరు మానువులు,అల్లాహ్ దాసులని మరియు వారు సత్యవంతులు,దృవీకరించేవారు,భయభీతి కలవారు,నీతిమంతులు,సన్మార్గం చూపేవారు,సన్మార్గం పొందేవారు అని,అల్లాహ్ వారి నిజాయితీపై సూచించే మహిమలతో వారికి మద్దతు కలిగించాడని మరియు వారు దేనినైతే అల్లాహ్ వారికిచ్చి పంపించాడో వాటన్నిటిని చేరవేశారని మరియు వారందరు స్పష్టమైన సత్యముపై,స్పష్టమైన సన్మార్గం పై ఉన్నారని విశ్వసించడం.
ధర్మ మూలం విషయంలో వారిలో (ప్రవక్తలలో) మొదటి వారి నుండి చివరి వారి వరకు వారి పిలుపు ఏకీభవిస్తుంది. మరియు అది ఆరాధన విషయంలో,ఆయనతో పాటు సాటి లేకపోవటంలో అల్లాహ్ అజ్జవజల్ల యొక్క తౌహీదు.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:- {అల్లాహ్! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్నందరినీ పునరుత్థాన దినమున సమావేశ పరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది?}. [నిసా : 87]
అంతిమ దినమునకు సంబంధించిన వాటన్నిటిని,మన ప్రభువు అజ్జవజల్ల దాని గురించి తన దివ్యగ్రంధములో తెలియపరచిన దాన్ని లేదా మనప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి మనకు తెలియపరచిన దాన్ని దృఢంగా విశ్వసించడం. ఉదాహరణకు : మనిషి మరణం,మరణాంతరం లేపబడటం,మరలి వెళ్ళటం,సిఫారసు చేయటం,త్రాసు,లెక్కతీసుకోవటం,స్వర్గము,నరకము మరియు అంతిమ దినమునకు సంబంధించిన ఇతరత్రా విషయాలు.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:- {నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధి (నిర్ణీత,ఖద్ర్) తో సృష్టించాము}. [అల్ ఖమర్ : 49]
ఇహలోకంలో సృష్టిరాసులపై జరిగే సంఘటనలన్ని అల్లాహ్ జ్ఞానముతో మరియు పరిశుద్ధుడైన,మహోన్నతుడైన ఆయన విధివ్రాతతో మరియు ఎటువంటి సాటి లేని ఒక్కడైన పర్యాలోచనతో అని మరియు ఈ విధివ్రాతలన్ని మానవుని సృష్టికి ముందే వ్రాయబడినవని మరియు మానవునికి కోరిక,ఇచ్చ కలదని మరియు వాస్తవానికి అతడు తన కర్మలను చేసేవాడు. కానీ అవన్ని అల్లాహ్ జ్ఞానము నుండి,ఆయన కోరిక నుండి,ఆయన ఇచ్చ నుండి తొలగిపోవని నమ్మకం కలిగి ఉండటం.
విధివ్రాతపై విశ్వాసం నాలుగు స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. అవి :
రెండవది : ప్రళయదినం వరకు జరిగే వాటిని అల్లాహ్ వ్రాయటమును విశ్వసించడం.
మూడవది : శాసనమగు అల్లాహ్ చిత్తాన్ని మరియు ఆయన పూర్తి సామర్ధ్యమును విశ్వసించడం. ఆయన కోరుకున్నది జరిగినది.ఆయన కోరనిది జరగలేదు.
నాల్గవది : అల్లాహ్ ప్రతిదానికి సృష్టికర్త అని విశ్వసించడం. అతని సృష్టించడంలో అతనికి భాగస్వామి ఎవడూ లేడు.
నేను వుజూ చేయటమును నేర్చుకుంటాను.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే ఉత్తమ రీతిలో వుజూ చేస్తారో అతని పాపాలు అతని శరీరం నుండి వైదొలగిపోతాయి.
కావున దాసుడు వుజూ ద్వారా ఇంద్రియ స్వచ్ఛతను మరియు ఈ ఆరాధనను మహోన్నతుడైన అల్లాహ్ కొరకు ప్రత్యేకిస్తూ,ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గమును అవలంభిస్తూ నిర్వర్తించి నైతిక స్వచ్ఛతను పొందుతూ తన ప్రభువు వైపునకు ముందడుగు వేస్తాడు.
వీటికి వుజూ తప్పనిసరి :
1- నమాజుకి అది ఫర్జ్ నమాజ్ అయినా నఫిల్ నమాజ్ అయినా సమానమే.
నేను పరిశుభ్రమైన నీటితో వుజూ చేస్తాను మరియు గుసుల్ చేస్తాను.
దశ 1 : సంకల్పము, దాని స్థలము హృదయము. మరియు సంకల్పము యొక్క అర్థం : మహోన్నతుడైన అల్లాహ్ సన్నిహితమునకు ఆరాధన చేయటానికి హృదయ దృఢనిర్ణయం.
దశ 2 : రెండు అరచేతులను కడగటం.
దశ 3 : పుక్కిలించటం.
పుక్కిలించటం ఎలాగంటే అది : నీటిని నోటిలోకి తీసుకుని దాన్ని లోపల త్రిప్పి మరల దాన్ని బయటకు తీయటం.
దశ 4 : ముక్కును ఛీదరించటం.
ముక్కును ఛీదరించటం ఎలాగంటే నీటిని ముక్కులో చివరి వరకు శ్వాస ద్వారా లోపలికి పీల్చటం.
తెల్లదనం (అంటే) ఇజార్ మరియు చెవి క్రింద భాగమునకు మధ్య భాగము.
మరియు ఇజార్ అంటే పొంగి వచ్చిన ఎముకపై ఉన్న వెంట్రుకలు,చెవి రంద్రము ఉన్న ప్రదేశమునకు సమాంతరంగా తల వరకు ఉన్న భాగము.
మరియు అలాగే గడ్డము యొక్క దట్టమైన వెంట్రుకలు దాని నుండి వ్రేలాడేవి కూడా ముఖమును కడగటంలోకి వస్తాయి.
దశ 6 : రెండు చేతుల వేళ్ళ తల భాగముల నుండి రెండు మోచేతుల వరకు రెండు చేతులను కడగటం.
మరియు రెండు మోచేతులు రెండు చేతులను కడిగే విధిలో వస్తాయి.
దశ 7 : రెండు చెవులతో సహా పూర్తి తలను ఒకసారి రెండు చేతులతో మసహ్ చేయటం.
తల ముందు భాగం నుండి మొదలు చేసి దాని వెనుక భాగము వరకు వాటిని (రెండు చేతులు) తీసుకుని పోవాలి. ఆ తరువాత వాటిని మరల్చాలి.
మరియు తన రెండు బొటన వేళ్ళను తన రెండు చెవుల బాహ్య భాగముపై పోనిచ్చి వాటితో చెవుల బాహ్య భాగముపై మసహ్ చేయాలి.
దశ 8 : రెండు కాళ్ళను వేళ్ళ మొదలు నుండి రెండు కాళ్ళ గిలకల వరకు కడగటం. రెండు కాళ్ళ గిలకలను కడగటం రెండు కాళ్ళను కడిగే విధిలోకి వస్తుంది.
గిలకలు అంటే కాలి పిక్క క్రింది భాగములో వెలుపలికి పొంగిన రెండు ఎముకలు.
ఈ విషయాలు వుజూను భంగపరుస్తాయి.
1 -మూత్రం,మలము,గాలి,మనీ (వీర్యం),మజీ (పురుషాంగము నుండి వెలువడే పలుచటి జిగురు పదార్థం) లాంటివి రెండు మార్గముల నుండి వెలువడేవి.
2 - గాఢ నిద్ర వలన లేదా స్ప్రహ కోల్పోవటం వలన లేదా మత్తు వలన లేదా పిచ్చితనం వలన బుద్ధిని కోల్పోవటం.
3- జనాబత్ (సంభోగము వలన వీర్య స్ఖలనం అయిన పరిస్థితి),రుతుస్రావం,పురిటి రక్తం లాంటి గుసుల్ ను అనివార్యం చేసే ప్రతీది.
మనిషి కాలకృత్యములు తీర్చుకున్న తరువాత మలినమును పరిశుభ్రమైన నీటితో తొలగించటం అతని పై తప్పనిసరి. ఇది మంచిది. లేదా పరిశుభ్రమైన నీరు కాకుండా రాళ్ళు,ఆకులు,వస్త్రం లాంటివి మరియు అలాంటివే ఇతర మలినమును తొలగించే వాటితో మాలిన్యమును తొలగించుకోవాలి. అది మూడు తుడిచే పరిశుభ్రమైనవి లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మరియు పరిశుభ్రమైన దానితో (మలినమును తొలగించటం) మంచిది.
మేజోళ్లపై,పాదకూసములపై మసహ్ చేయటం
మేజోళ్ళను లేదా పాదకూసములను తొడిగినప్పుడు రెండు కాళ్ళను కడిగే అవసరం లేకుండా కొన్ని షరతులతో వాటిపై మసహ్ చేసుకోవచ్చు. అవి :
1- చిన్న మాలిన్యము,పెద్ద మాలిన్యము నుండి ఎందులోనైతే కాళ్ళు కడగబడుతాయో పూర్తి శుభ్రత తరువాత వాటిని (మేజోళ్ళను) తొడిగి ఉండటం.
2- అవి రెండు పరిశుభ్రంగా ఉండాలి. వాటికి మలినము ఉండకూడదు.
మసహ్ అన్నది దాని నిర్ణీత కాలములో అయి ఉండాలి.
4- అవి హలాల్ అయినవి ఉండాలి. అవి దొంగలించబడిన లేదా బలవంతాన లాక్కున్నటువంటివి కాకూడదు.
రెండు ఖుఫ్ లు (మేజోళ్ళు) అంటే పల్చటి చర్మం,అలాంటి వాటితో చేయబడి కాళ్ళలో తొడగబడేవి. రండు కాళ్ళను కప్పే బూట్లు వాటి లాంటివే.
రెండు జవ్రబ్ లు (పాదకూసములు) అంటే వస్త్రంతో,అటువంటి వాటితో చేయబడినవి ఏవైతే మనిషి తన రెండు కాళ్ళలో తొడుగుతాడో. మరియు అవి అష్షరాబ్ (పానియం) పేరుతో పిలవబడుతాయి.
రెండు మేజోళ్ళపై మసహ్ చేయటం యొక్క ధర్మబద్ధత యొక్క విజ్ఞత
మేజోళ్ళపై మరియు పాదకూసములపై మసహ్ చేయటం యొక్క విజ్ఞత ఏమిటంటే ముస్లిములపై సులభతరం చేయటం మరియు తేలిక చేయటం. ఎవరికైతే మేజోళ్ళను,పాదకూసములను తీసి రెండు కాళ్ళను కడగటం కష్టమవుతుందో ముఖ్యంగా శీతాకాలం,తీవ్ర చలి సమయాల్లో మరియు ప్రయాణంలో.
మసహ్ యొక్క కాలం (కాలవ్యవధి)
స్థానికుడికి ఒక పగలు,ఒక రేయి (24 గంటలు)
ప్రయాణికుడికి మూడు పగలులు,వాటి రాత్రులు (72 గంటలు)
మేజోళ్ళపై లేదా పాదకూసములపై వుజూ భంగమై వుజూ చేసి మొదట మసహ్ చేసినప్పటి నుండి మసహ్ కాలవ్యవధి లెక్కింపు ప్రారంభమవుతుంది.
మేజోళ్ళపై లేదా పాదకూసములపై మసహ్ చేసే పధ్ధతి :
2- చెయ్యి పాదము యొక్క పై భాగముపై తీసుకుపోవాలి (కాలి వేళ్ళ కొనల నుంచి పిక్క మొదలు వరకు).
కుడి కాలును కుడి చేతితో మరియు ఎడమ కాలును ఎడమ చేతితో మసహ్ చేయాలి.
మసహ్ ను భంగపరిచేవి :
1- గుసుల్ ను అనివార్యం చేసేవి.
2- మసహ్ కాలం ముగియటం
పురుషుడు లేదా స్త్రీ సంభోగం చేసినట్లయితే లేదా మేల్కొన్న స్థితిలో లేదా నిద్ర స్థితిలో కామ కోరికతో వారి నుండి వీర్యస్ఖలనమైనప్పుడు వారు నమాజు నెరవేర్చడానికి నిర్ణయించుకుంటే లేదా దేనికోసమైన పరిశుద్ధతను పాటించటం తప్పనిసరి అయినప్పుడు వారిపై గుసుల్ తప్పనిసరి అవుతుంది. మరియు ఇదే విధంగా స్త్రీ ఋతుస్రావం,పురుటిరక్తం నుండి పరిశుద్ధత పొందినప్పుడు ఆమె నమాజును నెరవేర్చే నిర్ణయం తీసుకొనక ముందు లేదా దేనికైనా పరిశుద్ధత పాటించటం తప్పనిసరి అవకముందే ఆమెపై గుసుల్ అనివార్యమవుతుంది.
గుసుల్ యొక్క పధ్ధతి క్రింద వచ్చిన విధంగా (ఉండాలి).
ముస్లిం తన శరీరం మొత్తాన్ని ఏ విధంగానైనా నీటితో సాధారణీకరించాలి. అందులో నుంచి పుక్కిలించటం,ముక్కులో నీటిని పీల్చటం. తన శరీరమును నీటితో సాధారణీకరించుకున్నప్పుడు అతని నుండి పెద్ద అశుద్ధత తొలగిపోతుంది. మరియు అతని పరిశుభ్రత పూర్తవుతుంది.
అశుద్ధావస్తలో ఉన్న వారి పై గుసుల్ చేయనంతవరకు ఈ క్రిందివి చేయటం నిషేధము.
01- నమాజు
02- కాబా యొక్క తవాఫ్ (ప్రధక్షణకి)
03- మస్జిద్ లో బస చేయడం. మరియు బస చేయకుండా కేవలం దాటివెళ్ళటము అతనకి సమ్మతము.
04- ఖుర్ఆన్ ను ముట్టుకోవటం
05- ఖుర్ఆన్ చదవటం
తయమ్ముమ్
ముస్లిం పరిశుద్ధతను పొందే నీటిని పొందనప్పుడు లేదా అనారోగ్యం వలన లేదా అటువంటిదే ఏదైన కారణం చేత నీటిని వాడలేకపోయినప్పుడు అతనికి నమాజు కోల్పోయే భయం ఉంటే అతడు పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోవాలి.
అదెలాగంటే రెండు చేతులను ఒక సారి మట్టిపై కొట్టి వాటితో ముఖముపై మరియు చేతులపై మసహ్ చేసుకోవాలి. మట్టి పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరి.
ఈ విషయాలు తయమ్ముమును భంగపరుస్తాయి.
1- దేనితోనైతే వుజూ భంగమవుతుందో దానితో తయమ్ముమ్ భంగమవుతుంది.
అల్లాహ్ ముస్లిం పై రేయింబవళ్లలో ఐదు నమాజులను విధి చేశాడు. మరియు అవి ఫజర్,జుహర్,అసర్,మగ్రిబ్ మరియు ఇషా.
నేను నమాజు చేయటానికి సిద్ధమవుతున్నాను.
నమాజు సమయం ఆసన్నమైనప్పుడు ముస్లిం చిన్న అశుద్ధత నుండి మరియు పెద్ద అశుద్ధత నుండి పరిశుభ్రతను పాటించాలి. ఒక వేళ అశుద్ధావస్తకు గురైన వ్యక్తి పెద్ద అశుద్ధతకు గురైనా.
పెద్ద అశుద్ధత ఏమిటంటే ముస్లింపై గుసుల్ ను తప్పనిసరి చేసేది.
చిన్న అశుద్ధత ఏమిటంటే ముస్లింపై వుజూను తప్పనిసరి చేసేది.
ముస్లిం పరిశుభ్రమైన బట్టలు వేసుకుని,అశుద్ధతల నుండి(దూరంగా ఉంటూ) పరిశుభ్రమైన స్థలంలో తన మర్మావయవాలను కప్పుకుని నమాజు చేస్తాడు.
నమాజ్ వేళ ముస్లిం సరైన మంచి దుస్తులను ధరిస్తాడు. మరియు వాటితో తన శరీరమును కప్పుకుంటాడు. నమాజ్ లో నాబికి మరియు మోకాళ్ళకి మధ్య ఉన్న దేనిని బయటకు కనబడేటట్లు ఉంచటం పురుషునికి సమ్మతం కాదు.
స్త్రీ ముఖము,అరచేతులు తప్ప తన పూర్తి శరీరమును నమాజులో కప్పుకోవటం తప్పనిసరి.
ఒక ముస్లిం నమాజులో దానికి ప్రత్యేకించిన సూక్తులు తప్ప వేరేవి మాట్లాడకూడదు. మరియు ఇమామ్ చదివేది అతను శ్రద్ధగా వినాలి. మరియు ఒక వేళ అతనికి నమాజుకు ప్రత్యేకించిన సూక్తులు గుర్తుండకపోతే అతడు నమాజు ముగించే వరకు అల్లాహ్ స్మరణ చేయాలి మరియు ఆయన పరిశుద్ధతను కొనియాడాలి. అతను నమాజు మరియు దాని సూక్తులను నేర్చుకోవటానికి చొరవతీసుకోవాలి.
నేను నమాజు చేయటమును నేర్చుకుంటాను.
దశ 1 : నేను నిర్వర్తించాలని కోరుకుంటున్న విధి కొరకు సంకల్పము అవసరం. దాని స్థానం హృదయం.
నేను వుజూ చేసుకున్న తరువాత ఖిబ్లాకి అభిముఖమై నిలబడాలి. మరియు నేను నిలబడగలిగితే నమాజును నిలబడి చదవాలి.
దశ 2 : నేను నా రెండు చేతులను ముండెములకు సమాంతరంగా ఎత్తి నమాజులో ప్రవేశమును సంకల్పించుకుంటూ అల్లాహు అక్బర్ అని పలకాలి.
ఫాతిహా తరువాత ఖుర్ఆన్ నుండి అందుబాటులో ఉన్నదాన్ని ప్రతి నమాజులో మొదటి రెండు రకాతులలో మాత్రమే చదవాలి. మరియు ఇది తప్పనిసరి కాదు. కాని అలా చేయటంలో గొప్ప ప్రతిఫలం కలదు.
దశ 6 : అల్లాహు అక్బర్ అని పలికి ఆ తరువాత వీపును సమాంతరంగా ఉంచుతూ మరియు రెండు చేతులను వేళ్ళను ఎడంగా ఉంచుతూ రెండు మోకాళ్ళపై ఉండేటట్లు ఉంచుతూ రుకూ చేయాలి. ఆ తరువాత రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ పఠించాలి.
దశ 7 : సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అని పలుకుతూ రెండు చేతులను రెండు మొండెములకు సమాంతరంగా ఎత్తుతూ రుకూ నుండి లెగాలి. శరీరం నిటారుగా నిలబడినప్పుడు రబ్బనా వలకల్ హమ్ద్ అని పలకాలి.
దశ 8 : అల్లాహు అక్బర్ అని పలికి రెండు చేతుల పై,రెండు మోకాళ్ళపై,నుదుటిపై,ముక్కుపై సజ్దా చేయాలి. మరియు సజ్దాలో సుబ్హాన రబ్బియల్ అఅ్ లా అని పలకాలి.
దశ 10 : అల్లాహు అక్బర్ అని పలికి మొదటి సజ్దా వలే ఇంకొకసారి సజ్దా చేయాలి.
దశ 12 : దీని తరువాత నమాజు నుండి బయటకు వచ్చే సంకల్పము చేసుకుని అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడి వైపునకు సలాం తిరగాలి. మరియు అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అని పలుకుతూ ఎడమ వైపునకు సలాం తిరగాలి.
ముస్లిం మహిళ పరదా
ముస్లిం స్త్రీ తన దుస్తుల విషయంలో చాలా నియమాలను లక్ష్యపెట్టాలి.
మొదటిది : పూర్తి శరీరమును కప్పాలి.
రెండవది : స్త్రీ ధరించేది అలంకరణ కొరకు కాకూడదు.
మూడవది : అవి శరీరం బయటకు కనబడే విధంగా పల్చగా ఉండకూడదు.
నాల్గవది : శరీరం కనబడే విధంగా బిగుతువుగా కాకుండా వదులుగా ఉండాలి.
విశ్వాసపరుని లక్షణాలు
తను మాట్లాడటంలో సత్యవంతుడై ఉంటాడు మరియు అబద్దం పలకడు.
ప్రమాణమును మరియు వాగ్దానమును పూర్తిచేస్తాడు.
తగువులాటలో బూతులాడడు,అబద్దం పలకడు.
అమానత్ ను నెరవేరుస్తాడు.
తన కొరకు ఏదైతే ఇష్టపడుతాడో దానినే తన ముస్లిం సోదరుని కొరకు ఇష్టపడుతాడు.
ఉదార స్వభావుడై ఉంటాడు.
అల్లాహ్ విధివ్రాత పట్ల సంతుష్టపడుతాడు. మరియు కలిమిలో ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటాడు మరియు లేమిలో సహనం చూపుతాడు.
అతని హృదయం ద్వేష వైరముల నుండి నిర్మలమై ఉంటుంది మరియు అతని అవయవములు ఇతరులపై దాడి చేయటం నుండి సురక్షితంగా ఉంటాయి.
ప్రజలను క్షమించివేస్తాడు.
అతను వడ్డీ సొమ్ము తినడు మరియు దానితో వ్యవహరించడు.
వ్యభిచరించడు.
మద్యం సేవించడు.
తన పొరుగువారితో మంచిగా మెలుగుతాడు.
అతను అన్యాయం చేయడు మరియు ద్రోహానికి పాల్పడడు.
అతను దొంగలించడు మరియు మోసం చేయడు.
తన తల్లిదండ్రులు ముస్లిమేతరులైనప్పటికి వారితో మంచిగా మెలుగుతాడు. మరియు మంచి కార్యములలో వారికి విధేయత చూపుతాడు.
తన సంతానమును మంచి నడవడికపై పోషిస్తాడు. మరియు వారికి ధర్మబద్ధమైన విధుల గురించి ఆదేశిస్తాడు. మరియు వారిని దుర్గుణాల నుండి,నిషేధాల నుండి వారిస్తాడు.
మరియు అల్లాహ్ తఆలా ఒక గొప్ప విజ్ఞత కొరకు ఈ విశ్వంలో మమ్మల్ని సృష్టించాడు. మరియు మమ్మల్ని వృధాగా సృష్టించ లేదు. అదేమిటంటే ఎటువంటి సాటి లేని ఒక్కడైన ఆయన ఆరాధన. మరియు ఆయన మన జీవితము యొక్క ప్రత్యేక,సార్వజనిక వ్వవహారాలన్నింటిని నియంత్రించే సమగ్రమైన దైవిక ధర్మమును మా కొరకు ధర్మంగా నియమించాడు. మరియు ఆయన ఈ న్యాయపూరితమైన ధర్మము ద్వారా జీవిత అవసరాలైన మన ధర్మమును,ప్రాణములను,మన మానములను,మన బుద్దులను,మన సంపదలను పరిరక్షించాడు. మరియు ఎవరైతే ధర్మ ఆదేశాలను అనుసరిస్తూ,నిషేధితాల నుండి దూరంగా ఉంటూ జీవితం గడుపుతాడో అతడు ఈ అవసరాలను పరిరక్షించాడు. మరియు తన జీవితంలో ఎటువంటి సందేహం లేకుండా మనశ్శాంతితో సంతోషముగా జీవించాడు.
ఇది గొప్ప అనుబంధము అది భావోద్వేగ పరిస్థితి. అది కరుణామయుడి ఆరాధనను మంచిగా చేయటంపై మరియు ఆయనను కలసుకునే ఆసక్తిపై ప్రేరేపిస్తుంది. మరియు అది అతని హృదయమును విశ్వాసము యొక్క మాధుర్యము యొక్క అతని భావనతో శుభము యొక్క ఆకాశములో త్రిప్పుతుంది.
అవును మనిషి తన సృష్టికర్త ముందట తన శాశ్వత సమక్షికమును భావించినప్పుడు మరియు ఆయన మంచి పేర్లతో,గుణాలతో ఆయనను గుర్తించినప్పుడు మరియు ఆయనను ఆరాధించినప్పుడు ఆయనను చూస్తున్నట్లు మరియు తన ఆరాధన చేయటమును అల్లాహ్ కొరకు ప్రత్యేకించినప్పుడు మరియు అల్లాహ్ తప్ప ఇతరులను దానిలో భావించకుండా ఉన్నప్పుడు అతను ఇహలోకంలో ఆనందపూరితమైన,మంచి జీవితాన్ని జీవించాడు. మరియు పరలోకంలో అతని పరిణామము మంచిగా ఉంటుంది.
చివరికి ఇహలోకంలో విశ్వాసపరునిపై వచ్చిపడే విపత్తులు కూడా. నిశ్ఛయంగా వాటి వేడి నమ్మకము యొక్క చల్లదనముతో మరియు అల్లాహ్ యొక్క విధివ్రాత పట్ల సంతుష్టపడటంతో మరియు ఆయన మంచి,చెడు విధివ్రాతలన్నిటిపై ఆయన స్థుతులను పలకటంతో మరియు వాటి పట్ల పరిపూర్ణ సంతృప్తితో తొలగిపోవును.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై,ఆయన కుటుంబముపై,ఆయన సహచరులందరిపై శుభాలను,శాంతిని కలిగించుగాక.
ముగిసినది.
విషయ సూచిక
సంఖ్య
అంశము
పేజీ
కవర్ పేజీకి మరలటం
అంశముల సూచికకు మరలండి
పుస్తకంతో మీకున్న అనుభవాన్ని మేము యాడ్ చేశాం.
వెబ్ సైట్ ను సందర్శించండి
ఇంటరాక్టివ్ మొబైల్ బుక్
టాపిక్ కు వెళ్ళడం కొరకు క్లిక్ చేయండి.
కవర్ పేజ్ కి తిరిగి రావటం కొరకు ఇమేజ్ పై క్లిక్ చేయండి
ఎడ్యుకేషనల్ ఆఫర్ (పవర్ పాయింట్)
ప్రాజెక్ట్ ఉత్పత్తులు
ముద్రిత పుస్తకం
మొబైల్ పుస్తకం (ఫోన్ బుక్)
వెబ్ సైట్
పవర్ పాయింట్ షో
స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేక వెర్షన్.
నవ ముస్లింకు ఉపయోగకరమైన సంక్షిప్త నామం
సర్వం వినేవాడు : ఆయనే వినబడే వాటన్నింటిని వాటి గోప్యములను,బాహ్యములను తెలుసుకుంటాడు.
దివ్యఖుర్ఆన్ నా ప్రభువు వాక్కు
మూడవ మూలస్తంభము : జకాత్ చెల్లించడం.
నాల్గవ మూలస్తంభం : రమజాను మాసపు ఉపవాసములు ఉండటం.
ఐదవ మూలస్తంభం : అల్లాహ్ పవిత్ర గృహం యొక్క హజ్ చేయటం.
దివ్యఖుర్ఆన్ : అల్లాహ్ దీనిని తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేశాడు.
జబూర్ : అల్లాహ్ దీనిని తన ప్రవక్త అయిన దావూద్ అలైహిస్సలాం పై అవతరింపజేశాడు.
ఐదవ మూలస్తంభం : అంతిమ దినమును విశ్వాసించడం
ఆరవ మూలస్తంభం : మంచి,చెడు విధివ్రాతను విశ్వసించడం.
2-కాబా యొక్క తవాఫ్ కి (ప్రదక్షణకి)
ఆ తరువాత ఛీదరించటం ఎలాగంటే ముక్కులో ఉన్న శ్లేష్మం మరియు ఇతరవాటిని శ్వాస ద్వారా బయటకు తీయటం.
మరియు తన చూపుడు వేలును తన రెండు చెవులలోకి దూర్చాలి.
1- రెండు చేతులను తడి చేసుకోవాలి.
అల్ గుసుల్ -షరీఅతు బద్దమైన స్నానం.
2- ఏ ఆరాధన కొరకు తయమ్ముమ్ చేయబడినదో ఆ ఆరాధన ఆరంభం చేయక ముందే నీరు లభించినప్పుడు.
అతను ముస్లిమేతరుల వారి మతపరమైన లక్షణాలలో లేదా వారి ప్రత్యేకత,చిహ్నంగా మారిన అలవాట్లలో పోలి ఉండడు.