×
New!

Bayan Al Islam Encyclopedia Mobile Application

Get it now!

ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం (తెలుగు)

Pípèsè: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ శాలెహ్ అస్సహీం

Description

ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం

Download Book

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం)

ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం.

ఇస్లాం ప్రవక్త ,సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క సంక్షిప్త పరిచయం.ఇందులో నేను ఆయన పేరు వంశం,దేశం,వివాహం,దైవదౌత్యం,ఆయన ఆహ్వానం,దైవదౌత్యపు సూచనలు,షరీఅతు చట్టాలు,మరియు ఆయనను విభేదించినవారి గురించి క్లుప్తంగా స్పష్టపరుస్తాను.

1-ఆయన పేరు,వంశం మరియు పుట్టిపెరిగిన పట్టణం.

ఇస్లాం యొక్క సందేశహరులు 'ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్' వీరు దైవప్రవక్త ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిముస్సలాం సంతతికి చెందినవారు. ఎందుకంటే అల్లాహ్ యొక్క ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం షామ్ పట్టణం నుంచి మక్కాకు వచ్చారు, అప్పుడు ఆయనతో తన భార్య హాజిరా మరియు కుమారుడు ఇస్మాయీల్ కూడా ఉన్నారు. అతను తల్లి ఒడిలో ఉన్నారు,అల్లాహ్ ప్రవక్త దైవాజ్ఞతో వారిరువురిని అక్కడే జీవనం సాగించడానికి వదిలి వెళ్లిపోయారు,ఆ పిదప కుమారుడు పెద్దయ్యాక ఇబ్రాహీం అలైహిస్సలాం తిరిగి మక్కాకు వచ్చారు,తదుపరి తండ్రి కుమారులు ఇరువురు కలిసి పవిత్రదైవగృహం అల్'కాబా'ను నిర్మించారు,ప్రజలు ఆ గృహానికి తండోపాతండాలుగా రావడం జరిగింది,ఆపై అది రబ్బుల్ ఆలమీన్ ను కొలిచే ఆరాధకులకు,హజ్జ్ యాత్రికులకు కేంద్రంగా మారింది,మరియు ప్రజలు శతాబ్దాలుగా ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మానుసారంగా అల్లాహ్ ఏకేశ్వరోపాసనను,ఆయనను ఆరాధన చేయడం కొనసాగించారు. ఆ తరువాత మార్పు సంభవించింది,ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా అరేబియా ద్వీపకల్పం స్థితిగతులు కూడా మారిపోయాయి,అక్కడ బహుదైవారాధక వ్యవహారాలు బాహాటంగా జరుగసాగాయి : విగ్రహాలను ఆరాధించడం, ఆడపిల్లలను సమాధిచేయడం,ఆడవాళ్లపై అత్యాచారాలు, అబద్దపు ప్రమాణాలు, మద్యపానం, నగ్నత్వం, అనైతిక కార్యకలాపాలు,అనాధల సొమ్మును ఆక్రమించడం,వడ్డీకార్యకలాపాలు నిర్వర్తించడం. . మొదలైనవి సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి తరుణంలో క్రీ.శ 571 లో ఇస్లాం సందేశహరులు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం వంశస్టులైన ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ (సల్లల్లాహు అలైహివ సల్లం) ఈ ప్రాంతంలో జన్మించారు. ప్రవక్త పుట్టుకకు ముందే ఆయన తండ్రి మరణించారు,ఆరు సంవత్సరాల వయసులో తల్లి మరణించింది,అప్పుడు బాబాయి అబూ తాలిబ్ ఆయనను చేరదీసి ఆలనా పాలనా చూసుకున్నారు,ఆయన అనాధగా,పేదవాడిగా జీవనం సాగించారు,ఆయన స్వయంగా శ్రమించి చేతులారా కష్టపడి సంపాదించి తినేవారు.

2-గౌరవంతురాలైన,శుభవంతురాలితో శుభవివాహం.

ఆయన ఇరవై ఐదు సంవత్సరాల వయసుకు చేరినప్పుడు మక్కాకు చెందిన గౌరవప్రద మహిళలలో ఒకరైన ఖువైలిద్ కూతురైన ఖదీజా'రజియల్లాహు అన్హా ను వివాహమాడారు,ఆమె ద్వారా నలుగురు కుమార్తెలు,ఇద్దరు కుమారులు సంతానం కలిగింది కానీ శైశవ దశలోనే కుమారులు ఇద్దరూ మరణించారు,ఆయన తన భార్యతో కుటుంబీకులతో సౌమ్యంగా మెలుగుతూ అశేషమైన ప్రేమాభిమానాలు కనబర్చేవారు,అంచేత ఆయన సతీమణి హజ్రత్ ఖదీజా కూడా ఆయనను చాలా ప్రేమించేవారు. బదులుగా ఆయన కూడా ఆమెపై అదే విధంగా ప్రేమను చూపించేవారు,ఆమె చనిపోయి సంవత్సరాలు గడిచినప్పటికి ఆమెను ఎన్నడూ మరిచిపోలేదు, గొర్రెలను జుబాహ్ చేసి దానిని ఖదీజా రజియల్లాహు అన్హా స్నేహితురాళ్లకు గౌరవార్ధం,ఆమె మంచిని,ఆమె ప్రేమ ఆప్యాయతను కాపాడుతూ పంచేవారు.

3-వహీ(దైవదౌత్యం) ఆరంభం.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం చిన్నతనం నుంచి అద్భుతమైన నైతికతను కలిగి ఉన్నారు, ఆ జాతిప్రజలు ఆయనను 'సాదిఖుల్ అమీను'పేరుతో పిలిచేవారు, గొప్పగొప్ప కార్యక్రమాలలో వారితో పాల్గొనేవారు కానీ వారు చేసే బహుదైవారాధక మిథ్యా వ్యవహారాలను అసహ్యించుకునేవారు అందులో వారితో పాల్గొనేవారు కాదు.

మక్కా నగరంలో జీవిస్తూ నలభై సంవత్సరాల వయసుకు చేరాక అల్లాహ్ ఆయనను సందేశహరుడిగా ఎంచుకున్నాడు,అప్పుడు దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం ఖుర్ఆను యొక్క మొట్టమొదటి సూరా ఆరంభ ఆయతులు ఆయన యొక్క హృదయకవాటాలపై అవతరింపచేశారు,అల్లాహ్ తఆలా వాక్కు:- చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే సృష్టించాడు! ఆయన మానవుడిని రక్తపుముద్దతో సృష్టించాడు చదువు మరియు నీ ప్రభువు పరమదాత. ఆయనే కలము తో జ్ఞానభోదన చేశాడు. ఆయన మానవుడికి తెలియని విషయాలను బోధించాడు [సూరతుల్ అలఖ్ : 1-5] వెంటనే తన సతీమణి ఖదీజా రజియల్లాహు అన్హా వద్దకి వణుకుతున్నహృదయంతో వచ్చారు,ఆమెకు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు,ఆమె మీకు ఏమీకాదు అని భరోసాను కలిగించింది,వెంటనే ఆయనను తీసుకుని తన బాబాయి కుమారుడైన వరఖా బిన్ నౌఫెల్ వద్దకు వెళ్ళింది,అతను క్రైస్తవుడు తౌరాతు,ఇంజీలు జ్ఞానం తెలిసినవాడు,అతనితో ఖదీజా ఇలా అడిగింది: ఓ సహొదరా! నువ్వు కాస్త నీ సహోదరుడి కుమారుడు చెప్పే విషయాలను విను!అతను ప్రవక్త తో 'ఓ నా సోదర కుమార నువ్వు ఏమి చూసావు? చెప్పు అని అడిగాడు ప్రవక్త అతనికి తనతో జరిగిన సంగతంతా వివరించారు అప్పుడు వరఖా ఆయనతో ఇలా చెప్పాడు :- (అల్లాహ్ మూసా అలైహిస్సలాం పై అవతరింప చేసిన దూతయే ఇతను,బహుశా ఆ విషయమే మళ్ళీ ఒకసారి జరిగింది. నీ జాతి ప్రజలు నిన్ను బహిష్కరించినప్పుడు నేను ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను,అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:((వారు నన్ను బహిష్కరిస్తారా)) అతను'అవును' నువ్వు తెచ్చిన సందేశాన్ని తెచ్చిన ప్రతీ ఒక్కరితో శతృత్వం చూపబడింది'ఒకవేళ నేను ఆ రోజు నీతో ఉన్నట్లైతే నీకు నేను పూర్తిగా సహాయం చేస్తాను'అని చెప్పాడు.

మక్కాలో ఆయనపై క్రమంగా ఖుర్ఆను అవతరించింది,జిబ్రీల్ అలైహిస్సలాం సర్వలోకాల ప్రభువు తరుపు నుంచి దానిని దైవదౌత్యకానికి చెందిన వివరాలను తెచ్చినట్లు తీసుకుని ఆయన పై అవతరించేవారు,

ఆయన తన జాతిప్రజలను నిర్విరామంగా ఇస్లాం వైపుకు ఆహ్వానించేవారు,అతని జాతీయులు ఆయనను తిరస్కరించారు మరియు గొడవపడ్డారు,దైవదౌత్యకాన్ని ప్రవక్తతను వదులుకోవడానికి బదులుగా ధనాన్ని,రాజ్యాన్ని ఆయన ముందు ఉంచారు కానీ ఆయన ప్రతీదీ తిరస్కరించారు,మునుపటి ప్రజలు నాయకులు సర్దారులు ప్రవక్తలతో చెప్పినట్లుగానే వీరు కూడా ఆయనను ఇలా అన్నారు: మాంత్రికుడు,అబద్దాలకోరు,కల్పితప్రచారకుడు,మరియు వారంతా ఆయనను కష్టపెట్టారు,గౌరవప్రదమైన ఆయన శరీరాన్ని గాయపర్చారు,మరియు ఆయన అనుయాయులను అనుచరులను హింసించారు. అయితే మక్కాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిర్విరామంగా ప్రజలను అల్లాహ్ ఏకత్వం వైపుకు ఆహ్వానించసాగారు,హజ్జ్'సమయంలో మరియు అరబ్బుల్లో సమయానుకూలంగా జరిగే పెద్దపెద్ద బజారుల్లో ప్రజలను కలిసి వారికి ఇస్లాం సందేశాన్ని ఇచ్చేవారు,ఈ క్రమంలో ఆయన ప్రపంచాన్ని ఆశించలేదు, అధికారాన్ని కోరుకోలేదు,ఖడ్గంతో బెదిరించలేదు,ఆయనకు రాజ్యం లేదు,రాజు కూడా కాదు,తనతొలి ఆహ్వానంలోనే ఆయన తెచ్చిన మహోన్నత గొప్ప పవిత్ర ఖుర్ఆను గ్రంధంను పోలినది తీసుకుని రావాలని ప్రజలతో సవాలు ప్రకటించారు,ఆయన తన ప్రత్యర్ధులకు క్రమంగా ఈ సవాలును ప్రకటిస్తూ ఉండేవారు,ఆ పై గౌరవనీయ సహాబాలందరూ (రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్') ఆయనను విశ్వసించారు.

మరియు మక్కా నగరంలోనే అల్లాహ్ తఆలా ఆయనకు ఒక గొప్ప అద్భుతమైన కానుకతో సత్కరించాడు అదియే అల్ ఇస్రా'మేరాజ్ గగనయాత్ర (మక్కా నుంచి బైతుల్ మఖ్దిస్ వరకు పిదప అక్కడి నుండి ఆకాశంలోకి గగన యాత్ర చేశారు), అయితే అల్లాహ్ తఆలా ఇల్యాస్ మరియు ఈసా అలైహిముస్సలాం ను ఇంతకుముందు ఆకాశంలోకి ఎత్తు కున్నాడనే విషయం తెలుసు.ఈ విషయం ముస్లిములు మరియు క్రైస్తవులవద్ద ప్రస్తావించబడి ఉంది. అల్లాహ్ తఆలా నుండి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆకాశంలో నమాజు ఆదేశమును పొందారు,ఆ నమాజుయే నేడు ముస్లిములు ఐదు వేళల ఆచరిస్తున్నారు,అంతేకాదు మక్కాలోనే ఆయనకు మరొక గొప్పఅద్భుతం కూడా ప్రసాదించబడింది 'అదియే చంద్రుడిని రెండు ముక్కలుగా చేయడం (ఇన్షిఖాకుల్ ఖమర్) చివరికి దానిని బహుదైవారాధకులు కూడా ప్రత్యేక్షంగా వీక్షించారు.

ఖురైష్ యొక్క అవిశ్వాసులు సందేశ ప్రచారం నుండి ప్రవక్తను ఆపడానికి ప్రతీ మార్గాన్ని ఉపయోగించారు,ఆయనకు వ్యతిరేఖంగా పన్నాగాలు పన్నారు,ఆయనను అసహ్యించుకునేలా చేశారు,దైవసూచనలు అడుగుతూ మొండివైఖరిని అవలంభించారు ,ప్రజలను సందేశం నుండి ఆపడానికి,ఆయనతో వాదించడానికి ఆధారాలకోసం యూదులను సహాయం కోరారు.

ఇక ముస్లిములపై ఖురైష్ అవిశ్వాసుల హింసలు మితిమీరి హద్దుమీరినప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారిని అబీసీనియా(హబ్షా)వైపుకు హిజ్రతు చేయడానికి అనుమతి ఇచ్చారు,అప్పుడు ప్రవక్త వారితో ఇలా అన్నారు:-నిశ్చయంగా అక్కడ ఒక న్యాయశీలైన రాజు పాలిస్తున్నాడు ఆయన వద్ద ఎవరు అన్యాయానికి గురికారు,అతను ఒక క్రైస్తవరాజు,పిమ్మట విశ్వాసుల్లో రెండు సముదాయాలు అబీసీనియా వైపుకు వలస వెళ్లాయి,మూహాజీరీనులు వలస వెళ్ళి అక్కడికి చేరిన తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన దైవధర్మాన్ని ఆ హబ్షా రాజు నజాషీ'కు తెలియజేశారు,అతను ఇస్లాం స్వీకరించాడు,మరియు ఇలా చెప్పాడు: అల్లాహ్ సాక్షిగా ఇది మరియు మూసా అలైహిస్సలాం తెచ్చిన సందేశము ఒకే దీపం నుండి వెలువడినాయి'మరియు అతని జాతీయులు అతనికి మరియు అతని సహచరులకు హాని తలపెట్టారు.

మదీనా నుంచి ప్రత్యేక రుతువుల్లో(నెలల్లో)వచ్చినవారు దైవప్రవక్తను విశ్వసించారు మరియు ఇస్లాం పట్ల ప్రమాణం మరియు మదీనా కు వలస వచ్చినప్పుడు(దానికి యస్రిబ్ అని పేరు) సహాయం అందిస్తామని వాగ్ధానం చేశారు ఆ పై దైవప్రవక్త మక్కాలో మిగిలిన విశ్వాసులకు మదీనా (ప్రవక్త పట్టణం) నగరానికి హిజ్రతు చేసి వలస వెళ్లడానికి అనుమతించారు,ప్రజలు మదీనా పట్టణానికి హిజ్రతు చేసి వెళ్లారు మరియు అక్కడ ఇస్లాం వ్యాపించింది చివరికి ఆ పట్టణంలో ఒక్క ఇల్లు కూడా మిగలకుండా ప్రతి ఇంటిలో ఇస్లాం ప్రవేశించింది.

ఈ విధంగా మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పదమూడు సంవత్సరాలు అల్లాహ్ ఆరాధన వైపుకు ప్రజలను నిర్విరామంగా ఆహ్వానిస్తూ ధర్మప్రచారం చేసిన తరువాత అల్లాహ్ తఆలా ప్రవక్తకు మదీనా పట్టణానికి వలస వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు,పిదప దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం హిజ్రతు చేశారు,అక్కడ అల్లాహ్ వైపుకు ఆహ్వానిస్తూ ఉండేవారు,తరువాత క్రమంగా ఒక్కొక్కటిగా ఇస్లామీయ చట్టాలు అవతరించసాగాయి,మరియు దైవప్రవక్త దైవసందేశాన్ని తెగలనాయకులకు,రాజులకు దూతలద్వారా పంపించి వారిని ఇస్లాం వైపుకు ఆహ్వానించడం ప్రారంభించారు,ఆయన పంపిన వారిలో ముఖ్యులు : రోమ్ రాజు,పర్షియన్ రాజు,ఈజిఫ్టు రాజు .

ఒక సారి మదీనా పట్టణంలో సూర్యగ్రహణం ఏర్పడింది అది చూసి ప్రజలు ఆందోళన చెందారు,యాదృచ్ఛికంగా అదే రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కుమారుడైన ఇబ్రాహీం చనిపోయారు,అప్పుడు ప్రజలు పరస్పరం చెప్పుకున్నారు:సూర్యుడికి ఇబ్రాహీం మరణం వల్ల గ్రహణం పట్టింది,అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ఉపదేశించారు:- (నిశ్చయంగా సూర్యచంద్రులు ఒకరి మరణం వల్లగాని,లేక ఒకరి పుట్టుక వల్ల కానీ గ్రహణానికి గురికావు,అవి రెండు అల్లాహ్ యొక్క సూచనలు,వాటి ద్వారా అల్లాహ్ తన దాసులను హెచ్చరిస్తాడు) ఒకవేళ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అసత్యులై ఉంటే తన తిరస్కారం నుండి ప్రజలను భయపెట్టడంలో తొందర పడేవారు మరియు ఇలా చెప్పేవారు : నిశ్చయంగా సూర్యుడు నా కొడుకు మరణం వల్ల గ్రహణానికి గురయ్యాడు అలాంటప్పుడు నన్ను తిరస్కరించేవాడి పరిస్థితి ఏమిటి ?.

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ను తన ప్రభువు సంపూర్ణనైతికతతో అందంగా మలిచాడు,అల్లాహ్ ప్రవక్త గురించి ఇలా వర్ణించాడు: (మరియు నిశ్చయంగా నువ్వు అత్యున్నతమైన నైతికతను కలిగియున్నావు) [సూరతుల్ ఖలం : 4 ] అంతేకాదు ఆయన ప్రతీ ఉత్తమ నడవడికను తనలో ఇముడ్చుకుని ఉన్నాడు : సత్యం, చిత్తశుద్ది, ధైర్యం, న్యాయం,ఇచ్చినమాటను నిలబెట్టుకోవడం అది శత్రువుల తోనైనా సరే,ఔదార్యం,మరియు పేదలకు, అగత్యపరులకు, వితంతువులకు,అవసరార్ధులకు దానం చేయడానికి ఇష్టపడేవారు.ప్రజల మార్గదర్శకత్వం పట్ల ఆసక్తి కనబర్చేవారు,దయజాలి,అణుకువ ప్రదర్శించేవారు, ఒక అపరిచితుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను వెతుకుతూ వచ్చాడు,సహచరులతో(రజియల్లాహు అన్హుమ్) ప్రవక్త గురించి అడుగుతూ అక్కడే ఉన్న ప్రవక్తను గుర్తించకుండా 'మీలో ముహమ్మద్ అంటే ఎవరు?అని అడిగాడు.

మరియు ప్రవక్త యొక్క జీవితచరిత్ర ప్రతీ ఒక్కరితో 'అది మిత్రువు,శత్రువు,దగ్గర,దూరం,పెద్ద చిన్న,ఆడ మగ,పశు పక్షాదులతో సైతం వ్యవహారాలలో పరిపూర్ణతకు మరియు నిజాయితీకి మారుపేరుగా ఉండింది.

అల్లాహ్ తఆలా ధర్మాన్ని సంపూర్ణపరిచాడు ప్రవక్త ఆ సందేశాన్ని సంపూర్తిగా ప్రచారం చేశారు, అరవై మూడు సంవత్సరాల వయసులో కాలం చేశారు,అందులో దైవదౌత్యానికి 40 సంవత్సరాలు ముందు జీవితం ఇరవై మూడు సంవత్సరాలు దైవప్రవక్త మరియు సందేశహరులుగా జీవించారు. ప్రవక్త పట్టణమైన మదీనా లో ఆయన(సల్లల్లాహు అలైహివసల్లం) ను సమాధి చేయడం జరిగింది,ఆయన ఎలాంటి ఆస్తిపాస్తులు సంపదను వారసత్వంగా వదలలేదు,ఆయన స్వారీ చేసే ఒక తెల్లని కంచరగాడిద,మరియు భూమి ఉంటే దానిని ప్రయాణికులకోసం దానం చేశారు.

ఆయన ద్వారా ఇస్లాం స్వీకరించినవారు,విధేయత చూపినవారు అనుసరించిన వారు అనేక సంఖ్యలో ఉన్నారు,మరియు హజ్జతుల్ విదా సందర్భంలో ఆయనతో పాటు లక్షకు పైగా సహచరులు హజ్జ్ కార్యాన్ని ఆచరించారు,ఇది ప్రవక్త మరణానికి సుమారుగా మూడు నెలల ముందు జరిగింది.బహుశా ధర్మ పరిరక్షణ కోసం మరియు దాని ప్రచారవ్యాప్తికై ఇందులో మర్మం దాగి ఉంది,మరియు ఇస్లామీయ విలువలు, సూత్రాలతో పెరిగిన తన అనుయాయులు న్యాయంగా,దైవభక్తి,భయంతో, విధేయతతో,వారు విశ్వసించిన ఈ గొప్ప ధర్మాన్ని ఆచరిస్తూ అత్యుత్తమ సహాబాలుగా అంకితభావాన్ని చూపారు.

మరియు దైవప్రవక్త యొక్క సహచరులంతా విశ్వాసం, జ్ఞానం, ఆచరణ, చిత్తశుద్ధి,స్వీకరణ,దానం,ధైర్యం,ఔదార్యం పరంగా మహాగొప్పవారు : అందులో అబూబకర్ సిద్దీఖ్,ఉమర్ బిన్ ఖత్తాబ్,ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్,అలీ బిన్ అబూ తాలిబ్,రజియల్లాహు అన్హుమ్ ముఖ్యులు, వీరు ప్రథమంగా ఇస్లాంను విశ్వసించి ప్రవక్తను సత్యమని నమ్మారు,ఆ తరువాత వీరు ఇస్లాం ధర్మ జెండాను పట్టుకుని నడిపించే ఖలీఫాలుగా నియమితులయ్యారు,వీరికి ప్రవక్తతలో గానీ దైవదౌత్యంలో గానీ ఎలాంటి భాగం లేదు,మరియు ఇతర సహచరులను(రజియల్లాహు అన్హుం ) మినహాయించి ప్రత్యేకపరిచే ఎలాంటి ప్రాముఖ్యత వీరికి నొసగలేదు.

అల్లాహ్ తఆలా తన ప్రవక్తకు ఇచ్చిన పవిత్ర గ్రంధాన్ని,సాంప్రదాయాన్ని,ఆయన జీవిత చరిత్రను, వచనాలను,ఆచరణలను ఆయన మాట్లాడిన భాషలోనే సంరక్షించాడు. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క జీవిత చరిత్రను సంరక్షించినట్లుగా చరిత్రలో మరే జీవిత చరిత్ర కూడా సంరక్షించబడి భద్రపర్చబడలేదు. అంతేకాదు దైవప్రవక్త ఎలా నిద్రించేవారు,ఎలా తినేవారు,ఎలా త్రాగేవారు,ఎలా నవ్వేవారు'అనే చిన్నచిన్న విషయాలు కూడా సంరక్షించబడ్డాయి. దైవప్రవక్త తన కుటుంబికులతో ఇంట్లో ఎలా వ్యవహరించేవారు అనే విషయాలు కూడా సంరక్షించబడ్డాయి. ఆయన యొక్క పరిపూర్ణ స్థితిగతులు తన జీవిత చరిత్రలో భద్రంగా పొందుపర్చబడ్డాయి. ఆయన ఒక మానవుడు,సందేశహరుడు మాత్రమే. దైవత్వానికి చెందిన ఎటువంటి లక్షణాలు ఆయనలో లేవు. ఆయన తన స్వయానికి లాభాన్ని గానీ నష్టాన్ని గానీ చేకూర్చుకునే శక్తి కూడా లేనివారు.

4-ఆయన దైవదౌత్యం.

భూ మండలం నలువైపుల బహుదైవారాధన, అవిశ్వాసం, అజ్ఞానం,వ్యాపించిన తరువాత అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ను ప్రభవింపచేశాడు. అప్పుడు భూ ప్రపంచంలో కొంతమంది గ్రంధవహుల తప్ప, ఇతరులను సాటికల్పించకుండా అల్లాహ్'ను ఆరాధించేవారు ఉండేవారు కాదు. అప్పుడు ఆ అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం'ను ప్రవక్తల్లో,సందేశహరుల్లో చిట్టచివరి ప్రవక్తగా చేసి పంపించాడు. అల్లాహ్ సమస్తలోకాల కోసం మార్గదర్శకత్వాన్ని,సత్యధర్మాన్ని పంపించాడు తద్వారా దీనిని మతాలన్నింటి పై స్పష్టపర్చడానికి మరియు ప్రజలను విగ్రహారాధన, బహుదైవారాధన,అవిశ్వాసం, అంధకారాల నుంచి తొలగించి తౌహీదు, ఈమాను యొక్క కాంతి వైపుకు మార్గదర్శనం చేయడానికి మరియు ఆయన యొక్క ప్రవక్తత మునుపటి దైవప్రవక్తల (అలైహిముస్సలాం) దైవదౌత్యాన్ని సంపూర్ణం చేస్తుంది.

మరియు గత ప్రవక్తలు సందేశహరులు ఇచ్చిన ప్రతీ సందేశం వైపునకు ఆయన ఆహ్వానించారు : నూహ్, ఇబ్రాహీం,మూసా, సులైమాన్, దావూద్, ఈసా అలైహిముస్సలాం తదితరులు.ఈమాను కు చెందిన ఒక విషయం అల్లాహ్'యే ప్రభువు,ఆయనే సృష్టికర్త,ఆహార ప్రధాత,జీవం పోసేవాడు,జీవం తీసేవాడు, విశ్వసామ్రాజ్యాధినేత మరియు ఆయనే వ్యవహారాలను ప్రణాళికరించువాడు,మరియు ఆయన దయామయుడు కృపాశీలుడు,మరియు నిశ్చయంగా ఈ విశ్వంలో మనం చూస్తున్నది,చూడనిది ప్రతీది అల్లాహ్ యే సృష్టిస్తున్నాడు. మరియు అల్లాహ్ తప్ప మిగతాదంతా ఆయన యొక్క సృష్టియే!

కేవలం ఏకైకుడైన అల్లాహ్ ఆరాధన చేయాలని మరియు ఆయన తప్ప మిగతా మిథ్యాల ఆరాధనను వదలమని పిలుపునిచ్చారు. మరియు యదార్థంగా తన ఆరాధనలో,లేక సామ్రాజ్యంలో,లేక సృష్టిలో లేక వ్యవహార ప్రణాళికల్లో అల్లాహ్ ఏకైకుడు ఆయనకు ఇతరులెవ్వరు సాటి లేరు అని వివరించారు. మరియు అల్లాహ్ సుబ్'హానహు వ తఆలా ఎవరిని కనలేదు. మరియు ఆయన ఎవరికి పుట్టలేదు మరియు ఆయనకు సరిసమానమైనది,పోలినది ఏదీ లేదు. ఆయన తన సృష్టిలోని ఏ జీవిలో లీనమవ్వడు మరియు వారి రూపంలో ఎన్నటికీ మూర్తీభవించడు.

మరియు ఆయన మునుపటి దైవగ్రంధాల పట్ల కూడా అంటే ఇబ్రాహీం మరియు మూసా అలైహిముస్సలాం యొక్క పత్రాలు,తౌరాతు,జబూరు,ఇంజీలు,పట్ల ఎలాగైతే దైవప్రవక్తలందరిని విశ్వసించాలని పిలుపునిచ్చారో అలాగే వీటినీ విశ్వసించాలని ప్రజలను ఆహ్వానించారు. మరియు ఇందులో ఏ ఒక్క ప్రవక్తను ధిక్కరించినా అతను సమస్త ప్రవక్తలను ధిక్కరించినట్లుగా భావించబడతాడు.

దైవప్రవక్త ప్రజలకు అల్లాహ్ యొక్క దయా కరుణాల శుభవార్తను అందించారు. మరియు నిశ్చయంగా అల్లాహ్ యే వారికి ఈ ప్రపంచంలో సరిపోతాడు. మరియు ఆయనే ప్రభువు దయామయుడు,మరియు ఆయన ఒక్కడే రేపు పరలోక దినాన ప్రజలందరిని వారి సమాధుల నుండి తిరిగి లేపిన తర్వాత లెక్కలు తీసుకుంటాడు. మరియు ఆయనే విశ్వసించిన ముమినులకు వారి సత్కార్యాలకు ప్రతిఫలంగా పది వంతుల పుణ్యాన్ని మరియు పాపానికి బదులుగా ఒక పాపాన్ని మాత్రమే లెక్కిస్తాడు,మరియు వారి కోసం పరలోకంలో శాశ్వత అనుగ్రహాలు సిద్దంగా ఉన్నాయి. ఎవరైతే అల్లాహ్'ను ధిక్కరించి పాపకార్యాలు ఒడిగడతాడో ఇహపరలోకాల్లో తగ్గ ప్రతిఫలాన్ని పొందుతాడు.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ -సల్లల్లాహు అలైహివ సల్లం- తన దైవదౌత్యంలో తన తెగకుగానీ,పట్టణానికిగానీ,తన స్వయానికి గానీ ఎటువంటి ప్రత్యేక గౌరవాన్నిఒసగలేదు. బదులుగా పవిత్ర ఖుర్ఆను గ్రంధంలో దైవప్రవక్తల పేర్లు-నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా అలైహిముస్సలాం యొక్క పేర్లు తన పేరు కన్నాఎక్కువ సార్లు ప్రస్తావించబడ్డాయి. ఆయన తల్లి పేరుగానీ,భార్యల పేర్లు గానీ ఖుర్ఆనులో ప్రస్తావించబడలేదు. బదులుగా ఖుర్ఆనులో మూసా అలైహిస్సలాం తల్లి ప్రస్తావన చాలా సార్లు వచ్చింది. మరియు మర్యం అలైహస్సలాం పేరు ముప్పై ఐదు సార్లు ప్రస్తావించబడింది.

మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం షరీఅతు చట్టం,బుద్ది,స్వభావమునకు విరుద్దమైన లేక నైతికతకు విరుద్దమైన ప్రతీ విషయం నుండి (మాసూమ్) దూరంగా స్వచ్ఛంగా ఉండేవారు. ఎందుకంటే దైవప్రవక్తలు అల్లాహ్ ఆదేశాలను సందేశాలను ప్రచారం చేయడంలో స్వచ్ఛంగా ఉంటారు. కాబట్టి అల్లాహ్ వారికి ధర్మ ప్రచార బాధ్యతను విధిగా అప్పగించాడు. తన ఆరాధన చేయమని వారికి ఆజ్ఞాపించాడు. దైవప్రవక్తలకు మరియు సందేశహరులకు రుబూబియ్యతులో (పోషకత్వంలో) కానీ ఉలూహియ్యతు దైవత్వం యొక్క లక్షణాలలో కానీ ఎటువంటి లక్షణం లేదు. వారు మిగతా మనుషుల వలె కేవలం మానవులు మాత్రమే కానీ అల్లాహ్ వారికి దైవవాణి ద్వారా తన సందేశాలను పంపిస్తాడు.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం యొక్క దైవదౌత్యానికి గల సాక్ష్యాలలో అతి గొప్పది అల్లాహ్ తరపున వచ్చిన దైవవాణి (వహీ)ఇది దైవప్రవక్త జీవితంలో ఏ విధంగా ఉండేదో ఈ రోజు వరకు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. దీనిని ఒక బిలియనుకు పైగా ముస్లిములు అనుసరిస్తున్నారు. షరీఅతు కు చెందిన నమాజు, జకాతు, ఉపవాసం,హజ్జ్,లాంటి తదితర విధులను ఎలాంటి మార్పు లేకుండా వక్రీకరించకుండా అమలుచేస్తున్నారు.

5-దైవదౌత్య సూచనలు,సంకేతాలు మరియు సాక్ష్యాధారాలు

అల్లాహ్ తఆలా ప్రవక్తలకు దైవదౌత్య నిరూపణకై మరియు వాటిని దైవదౌత్యానికి సాకులుగా సాక్ష్యాధారాలుగా,ప్రమాణాలుగా నిలబెట్టడానికి తన అద్భుతసూచనల ద్వారా మద్దతు తెలిపాడు. అల్లాహ్ ప్రతీ ప్రవక్తకు వారికి సరిపోయే విధంగా అద్భుతాలను ఒసిగాడు. దైవప్రవక్తలకు ఇవ్వబడిన అద్భుతాలలో మహాగొప్పది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం కు ఇవ్వబడింది. నిశ్చయంగా అల్లాహ్ పవిత్ర ఖుర్ఆను గ్రంధాన్ని అనుగ్రహించాడు. ప్రవక్తలకు ఇవ్వబడిన అద్భుతాలలో ప్రళయం వరకు మిగిలి ఉండే అద్భుతం. అల్లాహ్ ప్రవక్తకు ఇతర గొప్ప అద్భుతాల ద్వారా కూడా సహాయాన్ని మద్దతును తెలిపాడు. మహనీయ దైవప్రవక్తకు అనేక అద్భుతాలు ఇవ్వబడ్డాయి అందులో కొన్ని ఇవి:-

మేరాజ్ గగన యాత్ర(అల్ ఇస్రా వల్ మేరాజ్),చంద్రుడిని రెండు ముక్కలు చేయడం,కరువు సమయాల్లో ప్రజల నీటి అవసరం తీర్చడానికి వర్షం కోసం వివిధ సంధర్భాల్లో దుఆ చేసినప్పుడు వర్షం కురిసింది.

ఆహారం మరియు తక్కువ నీరు చాలా ఎక్కువగా పెరగటం,అప్పుడు అనేక మంది దాని ద్వారా భోజనం చేయడం లేదా త్రాగడం సంభవించింది.

మరియు ఎవరికి వివరాలు తెలియని గతకాలపు అగోచర విషయాల గురించి చెప్పడం. అంటే అల్లాహ్ తఆల గడిచిన దైవప్రవక్తల జీవిత కోణాలను మరియు వారి జాతీయుల వృత్తాంతాలను గురించి మరియు అస్'హాబుల్ కహఫ్'కు చెందిన అగోచరగాధను తెలియజేశాడు.

మరియు అలాగే ప్రవక్తకు భవిష్యత్తులో జరగబోయే కొన్ని అగోచర విషయాలను కూడా అల్లాహ్ తెలియజేశాడు. అవి-హిజాజ్ నుండి అగ్ని లేస్తుంది. దానిని షామ్ పట్టణంలో ఉన్నవారు చూస్తారు. మరియు ప్రజలు ఎత్తైన భవనాలు కట్టడంలో పోటీపడతారు.

ప్రజల కీడు నుంచి ఆయనకు అల్లాహ్ సహాయం మరియు రక్షణ ఉంది.

మరియు తన సహచరులకు ఆయన చేసిన వాగ్ధానాలు నిజమయ్యాయి. ఉదాహరణకు వారితో చెప్పిన ఆయన మాట : అతి త్వరలో ఫారస్ మరియు రూమ్ పై మీకు విజయం చేకూర్చబడుతుంది. మరియు వాటి ఖజానాలు దైవమార్గంలో మీరు ఖర్చు చేస్తారు.

అల్లాహ్ ఆయనకు దైవదూతల ద్వారా మద్దతు తెలిపాడు.

మరియు దైవప్రవక్తలు (అలైహిముస్సలాతు వస్సలాం) తమ జాతి ప్రజలకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం యొక్క దైవదౌత్య శుభవార్తను అందించారు. మరియు ఆయన గురించి శుభవార్త అందించిన వారిలో' ఇస్రాయీలీ వంశీయులైన మూసా, దావూదు, సులైమాన్, ఈసా, అలైహిముస్సలాం మొదలగు ప్రవక్తలు ఉన్నారు.

సరైన బుద్ది అంగీకరించే హేతుబద్ధమైన సాక్ష్యాలు మరియు ఉదాహరణలు .

మరియు ఇలాంటి అద్భుతాలు సూచనలు,రుజువులు, తార్కిక ఉదాహరణలు,పవిత్ర ఖుర్ఆను మరియు ప్రవక్త సున్నతులో వ్యాపించి ఉన్నాయి. మరియు మీరు లెక్కపెట్టలేని అపరిమితమైన ఆయతులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలనుకునేవారు పవిత్ర ఖుర్ఆను గ్రంధాన్ని మరియు సున్నతు పుస్తకాలను,దైవప్రవక్త జీవిత చరిత్ర,సీరతు పుస్తకాలను అద్యాయనం చేయాలి. ఇందులో ఈ విషయాలకు సంబంధించిన నమ్మకమైన ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది.

ఈ గొప్ప సూచనలు అద్భుతాలు ఒకవేళ జరగకపోయినట్లైతే అరబ్బు దేశంలో ఆయనకు శత్రువులైన ఖురైష్ యొక్క అవిశ్వాసులు,యూదులు,క్రైస్తవులు ఆయనను ధిక్కరించేవారు మరియు ప్రజలను ఆయన నుండి చెదరగొట్టి హెచ్చరించేవారు.

ఆ అల్లాహ్ తఆలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం వైపుకు వహీ ద్వారా ఖుర్ఆను కరీంను పంపించాడు. ఇది సమస్తలోకాలకు ప్రభువు వాక్కు. అల్లాహ్ మనుషులకు జిన్నాతులకు ఇలాంటి గ్రంధాన్ని లేదా ఇందులోని ఒక సూరాను,రచించమని సవాళు(ఛాలెంజ్) చేశాడు. ఆ సవాలు ఈ రోజు వరకు అలాగే ఉంది. ఖుర్ఆను కరీం ఎన్నో అతిముఖ్యమైన ప్రశ్నలకు జవాబు ఇస్తుంది. మిలియన్ల మందిని ఇది అబ్బురపరుస్తుంది. ఏ అరబీ భాషలో ఖుర్ఆను కరీం అవతరించినదో అలాగే ఈ రోజువరకు అదే భాషలో ఒక్క అక్షరం పొల్లుపోకుండా భద్రంగా ఉంది. మరియు ఇది ప్రచురితమై వ్యాపించింది. ఇది ఒక గొప్ప అద్భుతమైన పవిత్ర గ్రంధం. ఇది ప్రజలకు లభించిన మహా గొప్ప దివ్యగ్రంధం. ఇది పారాయణం చేయబడుతుంది లేదా అనువాద అర్ధం చదువబడుతుంది. ఎవరైతే దీనిని చదివే భాగ్యాన్ని మరియు విశ్వసించే భాగ్యాన్ని నోచుకోలేకపోతాడో నిశ్చయంగా అతను పరిపూర్ణ మేలును, మంచిని కోల్పోయాడు. మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం యొక్క మార్గదర్శకత్వం మరియు ఆయన సీరతు (జీవిత చరిత్ర) భద్రపర్చబడినది. మరియు విశ్వసనీయ ఉల్లేఖఖుల శ్రేణి ద్వారా లిఖించబడింది. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం మాట్లాడే అరబీ భాషలో ఇది ప్రచురించబడింది-బహుశా ఆయన మన మధ్యలో జీవిస్తున్నట్లుగా ఉంది. మరియు అనేక భాషల్లో అనువాదం జరిగింది. పవిత్ర ఖుర్ఆను గ్రంధం మరియు దైవప్రవక్త సున్నతులు –సల్లల్లాహు అలైహివసల్లం –ఇవి రెండు ఇస్లామీయ షరీఅతు(చట్టాలకు)కు మరియు ఆదేశాల కొరకు గల ముఖ్య మూలాలు.

6-మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ -సల్లల్లాహు అలైహివసల్లం-తెచ్చిన షరీఅతు చట్టం.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన షరీఅతు చట్టమే 'ఇస్లామీయ షరీఅతు శాసనాలు-మరియు ఇది దైవిక శాసనాలను మరియు దైవదౌత్యాలను ముగించింది. ఇది మునుపటి ప్రవక్తల చట్టాలకు,శాసనాలకు భిన్నంగా ఉన్నప్పటికీ,మూలవిషయాల్లో మాత్రం ఇది సమానంగా ఉంటుంది.

ఇది పరిపూర్ణమైన చట్టం,అంతే కాదు ప్రతీ కాలానికి,ప్రతీ సమయానికి తగ్గట్టుగా ఉంటుంది. ఇందులో ప్రజల ధార్మిక,ప్రాపంచిక విషయాల కొరకు సంస్కరణలు,మేలు ఉన్నాయి. అల్లాహ్ యొక్క దాసులు తప్పనిసరిగా ఆచరించవలసిన ఆరాధనలు నమాజు,జకాతు తదితర విషయాలు ఇందులో నిక్షిప్తపర్చబడ్డాయి. మరియు ఆర్థిక,సామాజిక,రాజకీయ,సైనిక మరియు పర్యావరణానికి చెందిన హలాలు,హరాము వ్యవహారాలు,లావాదేవీలు మరియు ప్రజల జీవితానికి మరియు వారి భవిష్యత్తుకు అవసరమైన ఇతర విషయాలను తెలియపరిచింది.

ఈ షరీఅతు ప్రజల ధర్మాలను, ప్రాణాలను,గౌరవాన్ని, సంపదను, బుద్దిని మరియు సంతానాన్నివంశాన్ని రక్షిస్తుంది. మరియు ఇది అత్యుత్తమ నైతికతను,మంచి లక్షణాలను ప్రస్తావించింది. మరియు చెడు లక్షణాలను,అనైతికత విషయాల నుండి హెచ్చరించింది. ఇది మానవ గౌరవం, మితవాదం,న్యాయం, చిత్తశుద్ధి, పరిశుభ్రత, సామర్ద్య పరిపూర్ణత,ప్రేమ, ప్రజల మంచి కోసం తాపత్రయపడటం,రక్తపాత నియంత్రణ,దేశాల భద్రత వైపుకు పిలుపునిచ్చింది. మరియు ప్రజలను బెదిరించడం వారిని అన్యాయంగా భయపెట్టడం వంటివి నిషేదించింది. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం దౌర్జన్యానికి అన్యాయానికి అవినీతికి వ్యతిరేఖంగా పోరాటం చేశారు. మరియు మూడనమ్మకాలను, బ్రహ్మచర్యాన్ని, సన్యాసత్వాన్ని ఖండించారు.

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వివరించి తెలియజేశారు నిశ్చయంగా అల్లాహ్ మానవుడికి: స్త్రీ పురుషులకు గౌరవం ప్రసాదించాడు. మరియు వారి హక్కులను పరిరక్షించే బాధ్యత తీసుకున్నాడు. మనిషి యొక్క అధికారాలకు,ఆచరణలకు మరియు వ్యవహార లావాదేవీలకు జవాబుదారీగా చేశాడు. అంటే తనకు లేదా ఇతరులకు హాని కలిగించే ఏ చర్యకైనా అల్లాహ్ కు జవాబుదారీగా ఉంటాడు. అల్లాహ్ తఆలా విశ్వాసం, జవాబుదారీతనం,శిక్షా ప్రతిఫలాలలో స్త్రీ పురుషుల ఇరువురిని సమానుడిగా చేశాడు, ఈ షరీఅతులో ముఖ్యంగా మహిళలకు తల్లి,భార్య,కుమార్తె మరియు సోదరిగా ప్రత్యేక గుర్తింపు అనుగ్రహించబడింది.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం తెచ్చిన ఈ షరీఅతు మనిషి బుద్దిని పరిరక్షించడానికి,దానికి హాని కలిగించే ప్రతీ హానికారకాన్ని నిషేదించడానికి వచ్చింది, అంటే మద్యపానసేవనం వంటివి,మరియు ధర్మం మనసు,బుద్దిని ప్రకాశింపజేసే కాంతిగా ఇస్లాం భావించింది. తద్వారా మానవుడు తన ప్రభువును అంతర్దృష్టి మరియు జ్ఞానంతో ఆరాధిస్తాడు. ఇస్లామీయ షరీఅతు మెదడుకు,బుద్దికు గొప్పస్థానాన్ని కల్పించింది. దాన్ని జవాబుదారీతనానికి,బాధ్యతకు ముఖ్య కారణంగా నిర్దేశించింది. మరియు మూఢనమ్మకాల,మిథ్యాదైవాల సంకెళ్ళ నుండి విముక్తి చేసింది.

ఇస్లామీయ షరీఅతు సరైన విజ్ఞానశాస్త్రాన్ని కీర్తిస్తుంది మరియు మనోవాంఛలకు అతీతంగా ఉన్నశాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. మరియు మనిషిలో మరియు విశ్వంలో దీర్ఘాలోచన చేయాలని పరిశోధనలు జరపమని పిలుపునిస్తుంది. విజ్ఞానశాస్త్రం యొక్క సరైన ఫలితాలు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన షరీఅతుకు విరుద్ధంగా ఉండదు.

మరియు ఒక లింగానికి వ్యక్తుల యొక్క నిర్దిష్ట లింగానికి ఇస్లామీయ షరీఅతులో ఎటువంటి వివక్ష లేదు, మరియు ఒక జాతికి మరొక జాతి పై ప్రాధాన్యత లేదు. బదులుగా షరీఅతు ఆదేశాల,తీర్పుల ముందు అందరూ సమానంగా ఉంటారు. ఎందుకంటే వాస్తవానికి ప్రజలందరి మూలం సమానం. దైవభీతి ఆధారంగా తప్ప ఒకరి పై మరొకరికి గానీ,లేదా ఒక జాతికి మరొక జాతి పై గానీ ఎలాంటి ప్రాధాన్యత లేదు. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తెలిపారు :-ప్రతీ శిశువు తన సహజ స్వభావం పై జన్మిస్తుంది. మానవుల్లో ఏ వ్యక్తి పాపిగా కానీ లేదా ఇతరుల పాపాలకు వారసత్వ పాపం పొంది జన్మించడు.

ఇస్లామీయ షరీఅతులో అల్లాహ్ తఆలా'తౌబా'ను ధర్మబద్ధంగా చేశాడు,అంటే -మనిషి తన ప్రభువు వైపుకు మరలడం మరియు తప్పులను పాపాలను వదలడం.ఇస్లాం మునుపటి పాపాలను పూర్తిగా ప్రక్షాలిస్తుంది,అలాగే తౌబా కూడా మునుపటి పాపాలను పూర్తిగా తొలగిస్తుంది,ఒక వ్యక్తి ఎదుట మనిషి తప్పులను ఒప్పుకోవలిసిన అవసరం లేదు,మరియు ఇస్లాంలో మనిషికి మరియు అల్లాహ్ కు మధ్య ప్రత్యేక్ష సంబంధం ఉంది మీకు మరియు అల్లాహ్'కు మధ్యలో ఏ మధ్యవర్తి అవసరం లేదు,ఇస్లాం ఒక మనిషిని దైవంగా చేసుకోవడాన్ని లేదా అల్లాహ్ పోషకత్వంలో,దైవత్వంలో ఇతరులకు సాటి కల్పించడాన్ని పూర్తిగా ఖండిస్తుంది.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన షరీఅతు శాసనం మునుపటి శాసనాలను షరీఅతును చట్టాలను రద్దుపరుస్తుంది. ఎందుకంటే మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన ఇస్లాం షరీఅతు అల్లాహ్ వద్ద నుండి వచ్చింది ఇది ప్రళయం వరకు ఉండే అంతిమ షరీఅతు శాసనం. ఇది సమస్త లోకాల కోసం వచ్చింది. అంచేత మునుపటి శాసనాలను శరీఅతును రద్దు చేసింది. ఇలా పూర్వం మునుపటి శాసనాలు కూడా పరస్పరం రద్దుపర్చుకున్నాయి, అల్లాహ్ తఆలా ఇస్లాం షరీఅతును తప్ప మరే ఇతర షరీఅతును ఆమోదించడు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన ఇస్లాం ధర్మాన్ని తప్ప మరొక ధర్మాన్ని ఆమోదించడు. ఇస్లాం ధర్మం మినహా ఇతర ధర్మాన్ని ఆచరించినవాడి ధర్మం స్వీకరించబడదు. మరియు ఇస్లాం కాకుండా వేరే మతాన్ని ఎవరు స్వీకరిస్తారో,అది అతని నుండి అంగీకరించబడదు.ఎవరైతే ఈ షరీఅతు కు సంబంధించిన ఆదేశాల వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారో, అతను ఇస్లాంను పరిచయం చేసే పుస్తకాలలో నమ్మకమైన పుస్తకాలను చదవాలి.

ఇస్లామీయ షరీఅతు లక్ష్యం–మునుపటి దైవిక దైవదౌత్యాలకు గల లక్ష్యం మాదిరిగా-స్వచ్చమైన న్యాయమైన ధర్మం మనిషికి అందాలి తద్వారా అతను సమస్తలోకాల ప్రభువైన అల్లాహ్'కు చిత్తశుద్దిగల దాసుడిగా మారగలడు. మరియు మనిషి,వస్తువుల లేదా మూఢనమ్మకాల బానిసత్వం నుండి అతన్ని విముక్తి చేయడం.

నిశ్చయంగా ఇస్లాం షరీఅతు ప్రతీ కాలానికి ప్రతీ సమయానికి అనుగుణంగా వర్తిస్తుంది. ఇందులో మనిషికి అవసరమయ్యే వాస్తవ ప్రయోజనాలకు విరుద్దమైన భంగకాలు లేవు. ఎందుకంటే ఇది మనిషి అక్కరలు అవసరాలు తెలిసిన ప్రభువు అయిన అల్లాహ్ తరపు నుండి అవతరించినది,స్వయంగా ప్రజలకు కూడా పరస్పరం విభిన్నంగా విరుద్ధంగా లేనిది. మానవాళి ప్రయోజనాలను అమలుపరిచేది. ఏ మానవుడు నష్టపర్చలేని అణచివేయలేని నిజమైన షరీఅతు చట్టం అవసరం ఉంది. అంతేకాదు అల్లాహ్ వైపు నుండి లభించినది ప్రజలను మంచి వైపు ఋజుమార్గం వైపుకు మార్గదర్శకం చేసి నడిపించేది అయి ఉండాలి. మరియు దానిని తీర్పుకోసం ఆశ్రయించినప్పుడు వారి వ్యవహారాలను సక్రమంగా న్యాయంగా తీర్పుచేయాలి. ఒకరికి అన్యాయం చేయకుండా దౌర్జన్యం చేయకుండా వారిని సంరక్షించాలి.

దైవప్రవక్త గురించి తన ప్రత్యర్ధుల అభిప్రాయం మరియు ఆయన కోసం వారి సాక్ష్యం.

నిస్సందేహంగా,ప్రతి ప్రవక్తకు తనను వ్యతిరేకించే ప్రత్యర్ధులు, దైవప్రచారంలో, దైవమార్గంలో అడ్డుగోడలుగా నిలబడేవారు. మరియు ప్రజలు తనను నమ్మకుండా నిరోధించే శత్రువులు ద్వేషించేవారు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం కు తన జీవిత కాలంలో మరియు మరణాంతరం అనేక మంది శత్రువులు,అసూయపరులు, వ్యతిరేఖులు,ఉన్నారు. కానీ అల్లాహ్ తఆలా వారందరి నుండి దైవప్రవక్తను కాపాడి సహాయం అందించాడు. మరియు వారిలో చాలా మంది –గతంలో, నేడు- ఆయన దైవప్రవక్తయే అని ఇచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. మరియు మునుపటి దైవప్రవక్తలు (అలైహిముస్సలాం) తెచ్చిన సందేశాన్ని ఆయన కూడా ప్రవక్తగా తీసుకొచ్చారు. మరియు వారికి ఆయన 'సత్యవంతుడు'అనే నిజం తెలుసు. అయినప్పటికీ వారిలో చాలా మంది అధికార కాంక్షతో,లేక తమ జాతీయుల భయానికి లేదా పదవి వల్ల సంపాదించిన సంపద ఆవిరైపోతుందనే భయంతో ప్రజలు ఆయనను విశ్వసించకుండా ఆపారు.

మరియు సర్వస్తోత్రాలు ప్రశంసలు అల్లాహ్ కు మాత్రమే అంకితం ఆయనే సమస్త లోకాలకు ప్రభువు!

ప్రొఫేసర్ డాక్టర్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అస్సుహైం 'దీన్ని రచించారు.

ఇస్లామిక్ పరిశోధనల విభాగంలో 'అఖీదా ప్రొఫెసర్'(మాజీ)

ట్రైనింగ్ కళాశాల,కింగ్ సౌద్ విశ్వవిద్యాలయం.

రియాద్,సౌదీ అరేబియా దేశం

ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం.

1-ఆయన పేరు,వంశం మరియు పుట్టిపెరిగిన పట్టణం.

2-గౌరవంతురాలైన,శుభవంతురాలితో శుభవివాహం.

3-వహీ(దైవదౌత్యం) ఆరంభం.

4-ఆయన దైవదౌత్యం.

5-దైవదౌత్య సూచనలు,సంకేతాలు మరియు సాక్ష్యాధారాలు

6-మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ -సల్లల్లాహు అలైహివసల్లం-తెచ్చిన షరీఅతు చట్టం.

దైవప్రవక్త గురించి తన ప్రత్యర్ధుల అభిప్రాయం మరియు ఆయన కోసం వారి సాక్ష్యం.

معلومات المادة باللغة العربية