×
جدبد!

تطبيق موسوعة بيان الإسلام

احصل عليه الآن!

صلاة التراويح (تلقو)

الوصف

مقالة قيمة تبين أحكام صلاة التراويح مع ذكر بعض السنن بالدليل من الكتاب والسنة.

تنزيل الكتاب

 తరావిహ్ నమాజ్

﴿ صلاة التراويح ﴾

] తెలుగు – Telugu – تلغو [

http://ipcblogger.net/salimumri/

అనువాదం : -

పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్

2009 - 1430

﴿ صلاة التراويح ﴾

« باللغة التلغو »

http://ipcblogger.net/salimumri/

ترجمة : -

مراجعة : محمد كريم الله

2009 - 1430

 తరావిహ్ నమాజ్

 అసలు ‘తరావిహ్’ అనేది ‘రాహత్’ నుండి వచ్చింది. ‘రాహత్’ అంటే ‘విశ్రాంతి’ అని అర్థం; అంటే విశ్రాంతి తీసుకుని మరీ చేయవలసిన నమాజ్ అని భావం. తరావిహ్ నమాజు రెండేసి రకాతుల చొప్పున విడదీసి చేయమని దైవ ప్రవక్త ఉపదేశించారు. (బుఖారి,ముస్లిం)

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులు కూడా రెండేసి రకాతుల చొప్పున తరావీహ్ చదివేవారు. ప్రతీ 4 రకాతుల తర్వాత విశ్రాంతి తీసుకునేవారు. కాస్సేపు తరువాత మళ్ళీ నమాజ్ చేసేవారు. విశ్రాంతి సమయంలో “తస్బీహ్ “చేయవచ్చు. ”దుఆ” చేయవచ్చు. అయితే తస్బీహ్ సామూహికంగా బిగ్గరగా పాటించటం మక్రూహ్.

మొత్తం రమదాన్ నెలలో జరిగే తరావీహ్ నమాజులలో కనీసం ఒకసారి పూర్తి ఖుర్ఆన్ పఠించటం సున్నత్. ఒకవేళ హాఫిజే ఖుర్ఆన్ (ఖుర్ఆన్ కంఠస్థం చేసినవారు) ఆందుబాటులో లేకపోతే సూరహ్ అలమ్తర వంటి చిన్న సూరాలతోనే తరావీహ్ నమాజు పూర్తి చేసుకోవచ్చు.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమదాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత ఒకసారి తరావీహ్ నమాజ్ చేస్తే చాలా మంది అనుచరులు ఆయనతో కలిసి నమాజ్ చేసారు. రెండో రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరల తరావీహ్ నమాజ్ చేస్తే దానిలో ఇంకా ఎక్కువమంది పాల్గొన్నారు. అలాగే మూడో రోజు, నాల్గో రోజు రాత్రులలో కూడా సహచరులు విపరీతంగా గుమిగూడారు. పరిస్థితిని గమనించి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రాత్రి తరవావీహ్ నమాజు కొరకు ఇంటి నుండి బయటికి రాలేదు. తెల్లవారిన తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులతో ఇలా పలికారు: ‘రాత్రి ఎక్కువమంది ప్రజలు ఇక్కడ గుమికూడి ఉండటాన్ని నేను చూశాను. అయితే ఈ తరావీహ్ నమాజ్ మీపై ఎక్కడ ఫర్జ్ గా నిర్ణయించబడుతుందోనన్న సందేహం నన్ను ఇంటి నుండి బయటకు రాకుండా చేసింది.’ (బుఖారి, ముస్లిం )

హజ్రత్ అరఫజ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు “హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) రమదాన్ రాత్రుల్లో తరావీహ్ నమాజ్ చేయమని ఆదేశించేవారు. పురుషుల కోసం వేరుగా, స్త్రీల కోసం వేరుగా ఇమాంలను నిర్ధారించేవారు. నేను స్త్రీల సామూహిక నమాజుకు నాయకత్వం వహించేవాడిని.”

తరావీహ్ ప్రాధాన్యత:

రమదాన్ నెలలో తరావీహ్ నమాజు చేయటం, దైవారాధనలో ఎక్కువ సేపు గడపటం శుభప్రదం. రమదాన్ రాత్రుల్లో నమాజ్ చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు ప్రబోధించేవారు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు మాత్రం లేవు. ఎవరయితే నిష్కల్మషమైన విశ్వాసంతో దైవప్రసన్నతా లక్ష్యంతో రమదాన్ రాత్రుల్లో దైవారాధనలో గడిపారో వారి గత అపరాధాలు, జరగబోయే అపరాధాలు క్షమించబడతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినారు.

తరావీహ్ నమాజు: జమఆత్

తరావీహ్ నమాజు ఇంట్లో ఒంటరిగా చేయవచ్చు లేదా సామూహికంగా చేయవచ్చు, అయితే జమఆత్ తో మస్జిదులో సామూహికంగా చేయటం ఉత్తమం. తన ఆరోగ్య పరిస్థితిని బట్టి, తరావీహ్ నమాజు కూర్చుని కూడా చేయవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమవదించిన తరువాత ప్రజలు మస్జిదులలోనూ, తమ ఇండ్లలోనూ వ్యక్తిగతంగా, సామూహికంగా తమకు తోచిన విధంగా తరావీహ్ నమాజు చేసేవారు. అయితే ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు, తన హయాములో ముస్లింలందరినీ మస్జిదులో సమీకరించి, తరావీహ్ నమాజును సామూహికంగా చేయించినారు.

తరావీహ్ నమాజు జరుగుతున్నప్పుడు, ఒకవేళ ఎవరయినా మస్జిద్ కు ఆలస్యంగా వస్తే, ముందుగా వారు తమ ఫర్జ్ నమాజ్ చేశాకనే తరావీహ్ నమాజ్ లో పాల్గొనాలి. అందుకోలేకపోయిన తరావీహ్ నమాజును ఆఖరిలో గాని, వీలుంటే మధ్య మధ్యలో గాని పూర్తి చేసుకోవాలి .

తరావీహ్ నమాజులో ఖిరఆత్ గురించి అంటే ఒక్కో రకాతులో ఖుర్ఆన్ లోని ఎంతభాగం లేక ఎన్ని సూరహ్ లు విధిగా పఠించాలనే విషయమై తప్పనిసరి నియమాలేమీ లేవు. ఇమాం మరియు ప్రజలు తమ అనుకూలతను బట్టి ఈ విషయాన్ని నిర్ణయించుకోవచ్చు.

معلومات المادة باللغة الأصلية