×
جدبد!

تطبيق موسوعة بيان الإسلام

احصل عليه الآن!

شهادة التوحيد (تلقو)

إعداد: ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్

الوصف

في هذا الكتاب: - معنى شهادة أن لا إله إلا الله وأن محمدا عبده ورسوله - محاسن الإسلام -كيفية الدعوة إلى الإسلام على علم -كل من يريد أن يطلع على تعاليم الإسلام عليه أن يقرأ هذا الكتاب.

تنزيل الكتاب

    షహాదహ్ – ఒక ముస్లిం యొక్క ధృవీకరణ

    CONFESSION OF A MUSLIM

    لا إلــه إلاالله محمد رسول الله

    లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్

    (అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ యొక్క సందేశహరుడు)

    ఇస్లాం స్వీకరించిన అనేక మంది ప్రజలు ఇస్లాం యొక్క మొట్టమొదటి మూలస్థంభమైన - లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ యొక్క అసలు భావం గ్రహించటం లేదని తెలుస్తున్నది. కాబట్టి ఈ యొక్క మహోన్నత వచనం యొక్క భావాన్ని స్పష్టంగా తెలుసుకోవటం చాలా అవసరం:

    لا إلاه إالله محمد رسول الله

    లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్

    అనే పవిత్ర వాక్యాన్ని మూడు భాగాలలో అర్థం చేసుకోవచ్చును: a (మొదటి నియమం, రెండవ నియమం, మూడవ నియమం, నాలుగవ నియమం), b & c

    a) క్రింద తెలిపిన నాలుగు నియమాల పై సర్వలోకాల సృష్టకర్త, ఉనికిలో ఉన్న ప్రతి దానికి ప్రభువు, ఏకైక మహోన్నతుడు మరియు తీర్పుదిన న్యాయాధిపతి అయిన అల్లాహ్ కు మీరు వాగ్దానం చేయవలసి ఉన్నది.

    మొదటి నియమం: “కేవలం అల్లాహ్ మాత్రమే ప్రతిదాని సృష్టికర్త” అని హృదయపూర్వకంగా అంగీకరించటం. A confession with your heart that the Creator (of everything) is Allah; దీని కోసం మీరు ఇలా ధృవీకరించ వలసి ఉంటుంది: “నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, స్వర్గలోకాలు, ప్రపంచానికి తెలిసిన మరియు తెలియని అన్ని రకాల జీవరాశులతో నిండి ఉన్న భూలోకం మొదలైన సకల లోకాలను సృష్టించిన, సర్వలోక సమర్థుడు కేవలం అల్లాహ్ మాత్రమే” అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే ఈ విశాల విశ్వపు ప్రతిదీ నడిపేవాడు మరియు ప్లానింగ్ చేసేవాడు. ఆయనే జీవితాన్ని మరియు మరణాన్ని ఇస్తాడు, మరియు కేవలం ఆయనే పోషిస్తాడు, సంరక్షిస్తాడు” దీనిని “అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వం” – తౌహీదుర్రుబూబియ్యహ్ అని అంటారు.

    రెండవ నియమం: “ఇతరులెవ్వరూ ఆరాధ్యులు కారు, కాని ఒక్క అల్లాహ్ తప్ప” అని హృదయపూర్వకంగా సాక్ష్యమివ్వటం: ఇస్లామీయ భాషలో ఆరాధన అనే పదం అనేక విసృతార్థాలను ఇస్తుంది: అన్ని రకాల ఆరాధనలు కేవలం అల్లాహ్ కే చెందును అనే విషయాన్ని ఇది నొక్కి చెబుతున్నది. (అంటే ఇతరులెవ్వరూ - వారు దైవదూతలైనా, ప్రవక్తలైనా, సందేశహరులైనా, మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా-జీసస్ అలైహిస్సలాం అయినా, ఉజైర్, ముహమ్మద్, సూర్యుడు, చంద్రుడు, విగ్రహాలు, సన్యాసులు అయినా, ఇంకా వేరే ఇతర అసత్యపు ఆరాధ్య దైవాలన్నీ ఆరాధించటానికి అస్సలు అర్హులు కారు) కాబట్టి కేవలం అల్లాహ్ నే ఆరాధించవలెను, అల్లాహ్ ను కాకుండా వేరే ఇతరులెవ్వరినీ వేడుకోరాదు, అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరులెవ్వరి పేరు మీదా పశువులను బలివ్వరాదు, … etc, మరియు దీని అర్థం ఏమిటంటే – ఖుర్ఆన్ లో మరియు సున్నహ్ (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు) లలో వేటినైతే ఆచరించమని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారో వాటిని మనం తప్పక ఆచరించ వలెను. మరియు ఏదైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేయవద్దని నిషేధించారో, వాటిని మనం అస్సలు చేయకూడదు. దీనినే “అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఏకైకత్వం” - తౌహీదుల్ ఉలూహియ్యహ్ అని అంటారు. కాబట్టి మనం అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ ను వదిలి ఇతరులెవ్వరినీ ఆరాధించరాదు.

    మూడవ నియమం: “అత్యుత్తమైన నామాలు, మహోన్నతమైన సుగుణాలు మరియు విశిష్ఠ లక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును” అని హృదయపూర్వకంగా ధృవీకరించటం: “ఓ అల్లాహ్! నీ గ్రంథం (ఖుర్ఆన్) లో స్వయంగా నీకు నీవే పెట్టుకున్న లేక యోగ్యుడిగా ప్రకటించుకున్న అత్యుత్తమమైన పేర్లన్నీ మరియు మహోన్నతమైన సుగుణాలు, లక్షణాలన్నీ లేదా నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రకటనలలో తెలిపిన నీ యొక్క అత్యుత్తమ పేర్లు, మహోన్నతమై లక్షణాలన్నింటినీ నేను ధృవీకరస్తున్నాను. ఇంకా అవన్నీ అసలు రూపంలో వాటి అర్థాలు లేక భావాలలో ఎటువంటి మార్పులు, చేర్పులు లేకుండా, వాటిని నిర్లక్ష్యానికి గురిచేయకుండా, వేరే వాటితో పోల్చకుండా కేవలం ఆయనకే శోభిస్తాయని నేను నమ్ముతున్నాను.” ఖుర్ఆన్ (V.42:11) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ చూచేవాడూను”

    సృష్టితాలతో అస్సలు పోల్చలేని ఆయన దివ్యస్వరూపం, దివ్యవినికిడి శక్తి మరియు దివ్యదృష్టి యొక్క ప్రత్యేకతలను పై పవిత్ర ఆయత్ ధృవీకరిస్తున్నది. అంతే కాక ఖుర్ఆన్ (V.38:75) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఎవరినైతే నా రెండు చేతులతో సృష్టించానో, ఇది వారి కోసం”

    మరియు ఖుర్ఆన్ లో మరో చోట అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “అల్లాహ్ చేయి, వారి చేతుల పై ఉన్నది.” (V.48:10).

    అల్లాహ్ కు రెండు చేతులు ఉన్నాయని ఈ పవిత్ర ఆయత్ లు ధృవీకరిస్తున్నాయి. కాని, ఆ దివ్యచేతులను పోలిన చేతులను మానవుడి పరిమిత జ్ఞానం ఊహించలేదు. అలాగే ఖుర్ఆన్ (V.20:5) లో తెలిపిన “అల్లాహ్ తన సింహాసనం పై అధివేష్టించి ఉన్నాడు” అనే దాన్ని మనకు తెలిసిన ప్రాపంచిక సింహాసనంతో పోల్చటం గాని, కూర్చోవటం అనే పనిని భూలోక జీవులు కూర్చునే విధంగా ఊహించటం గాని చేయకూడదు.

    అమిత దయాళువు అయిన అల్లాహ్ సప్తాకాశాలపైన ఉన్న తన సింహాసనం పై తనకు శోభనిచ్చే విధంగా అధివేష్టించినాడు. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బానిస స్త్రీని ‘అల్లాహ్ ఎక్కడు ఉన్నాడు?’ అని ప్రశ్నించగా, ఆవిడ ఆకాశం వైపునకు వేలెత్తి చూపినది. దిల్ హజ్ నెల 9వ తేదీన వచ్చే అరాఫాత్ దినమున మరియు ప్రతి రాత్రి మూడవ ఝాములో ఆయన భూలోకానికి అతి దగ్గరలోని మొదటి ఆకాశానికి వస్తాడు. కాని ఆయన అపరిమితమైన దివ్యజ్ఞానం సర్వలోకాలలో వ్యాపించియున్నది, అనంత విశ్వాన్ని పరివేష్టించి ఉన్నది. అంతేకాని భౌతికంగా ఆయనే స్వయంగా లోకమంతా వ్యాపించిలేడు. (బై-ధాతిహి) అల్లాహ్ ఇక్కడ, అక్కడ, ప్రతి చోటా, ఇంకా మనుషుల హృదయాలలో వ్యాపించి ఉన్నాడనే భావన ఎంత మాత్రమూ వాస్తవం కాదు. మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తాడు మరియు పలికే ప్రతి పలుకును ఆయన వింటాడు. దీనినే శుభమైన పేర్లలో మరియు విశిష్ఠ సుగుణాలలో, మహోన్నత లక్షణాలలో అల్లాహ్ యొక్క ఏకైకత్వం; తౌహీద్ అస్మా వశ్శిఫాత్: అంటారు. ఇదే మొత్తం దైవవిశ్వాసుల స్వచ్ఛమైన విశ్వాసం, ఇంకా నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహీస్సలాం, మూసా అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం నుండి చిట్టచివరి దైవప్రక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు అల్లాహ్ యొక్క ప్రవక్తలందరి సత్యమైన, స్వచ్ఛమైన దైవవిశ్వాసం.

    నాలుగవ నియమం: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ యొక్క సందేశహరుడని” హృదయపూర్వకంగా సాక్ష్యమిచ్చుట: “ఓ అల్లాహ్! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను.” అల్లాహ్ తర్వాత అనుసరించ టానికి అవసరమైన అర్హతలు, యోగ్యతలు ఇంకెవ్వరికీ లేవు, కాని ఒక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తప్ప. ఎందుకంటే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరులలో చిట్టచివరి వారు. ఖుర్ఆన్ (V.33:40) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ముహమ్మద్, మీ పురుషుల్లో ఎవ్వరికీ తండ్రి కారు. కాని అతడు అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం కలవాడు.”

    “మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి.” (V.59:7).

    (ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు, ‘మీకు అల్లాహ్ పట్ల (నిజంగా) ప్రేమ ఉంటే, మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్ముల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు మరియు అల్లాహ్ అమితమైన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత’”(V.3:31)

    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాకుండా ఇతరుల పలుకులను అల్లాహ్ యొక్క అంతిమ సందేశం (ఖుర్ఆన్ మరియు సున్నహ్) మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లామీయ ధర్మశాస్త్రంతో ఏకీభవిస్తున్నాయా లేదా అనే ప్రామాణికత ఆధారంగా స్వీకరించవచ్చును లేదా తిరస్కరించ వచ్చును. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత దివ్యవాణి అవతరణ ఆగిపోయినది. మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా జీసస్ అలైహిస్సలాం ఈ భూలోకానికి తిరిగి వచ్చే వరకు ఇది మరల ప్రారంభం కాదు. ఇంకా సహీహ్ బుఖారీ సంకలనపు మూడో గ్రంథంలోని 425వ హదీథ్ లో తెలుపబడినట్లుగా - ఈ ప్రపంచపు అంతిమ కాలంలో, ఈసా-జీసస్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇస్లామీయ ధర్మోపదేశాలను అనుసరించే పరిపాలిస్తారు.

    అష్హదు అన్ - లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ అంటే “అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అనే పలుకులను తప్పనిసరిగా ఉచ్ఛరించ వలెను. దీనికి ఆధారం తన పినతండ్రి అయిన అబు తాలిబ్ మరణశయ్య పై, చివరి ఘడియలలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పలికిన పలుకులు: “ఓ బాబాయి, నీవు గనుక అష్హదు అన్ - లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్ష్యమిచ్చినట్లయితే, తీర్పు దినమున నేను అల్లాహ్ దగ్గర నీ కోసం ప్రార్థించగలను.” అలాగే, అబు ధర్ గఫ్ఫారీ రదిఅల్లాహుఅన్హు అనే అతను ఇస్లాం స్వీకరించిన తర్వాత మస్జిద్ అల్ హరాం దగ్గరకు వెళ్ళి, ఖురైషీయుల ఎదుట బిగ్గరగా షహాదా పవిత్ర వచనాన్ని ప్రకటించగా, వారు అతడిని విపరీతంగా కొట్టి, గాయపరచినారు.

    పెదవులతో పాటు శరీరాంగములన్నీ ఆ పవిత్ర వచనానికి సాక్ష్యం పలికి, ధృవీకరించటం తప్పని సరి. దాని భావాన్ని (“అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను, ధృవీకరిస్తున్నాను”) మొత్తం శరీరాంగాలు పూర్తిగా అర్ధం చేసుకోవటం చాలా ఆవశ్యకమైన ముఖ్యవిషయం. కాబట్టి దీనికి సమ్మతించిన వారెవరైనా సరే దోపిడి, దొంగతనం, హత్య, వ్యభిచారం, అక్రమసంబంధం, పంది మాంసం తినటం, మత్తుపానీయాలు సేవించటం, అక్రమ పద్ధతులలో సంపాదించటం, అనాధల ఆస్తిపాస్తులను అన్యాయం గా ఆక్రమించటం, వ్యాపార లావాదేవీ లలో మోసం చేయటం, లంచాలు ఇవ్వటం, అబద్ధాలు చెప్పటం వంటివి చేయకూడదు. ఒకవేళ పవిత్ర వచనం పై సాక్ష్యం పలికీ, అటువంటి పాపపు పనులు చేసినట్లయితే, తీర్పు దినమున స్వంత శరీరావయవములే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. అంటే పవిత్ర వచనం పలకటం ద్వారా ఏదైతే అల్లాహ్ కు ప్రమాణం చేసాడో దానికి వ్యతిరేకంగా చేసేవాడని సాక్ష్యమిస్తాయి. ఒకవేళ అతడు పైన తెలిపిన పాపపు పనులలో ఏదైనా చేసినట్లయితే, అతడు దానిని పాపపు పనిగా గ్రహించి, వెంటనే అల్లాహ్ దగ్గర పశ్చాత్తాప పడి, మన్నింపమని వేడుకోవలెను. చేసిన పాపపు పనులకు తన స్వంత శరీరావయలైన చర్మం, రహస్యాంగాలు, చేతులు, నాలుక, చేవులు తీర్పుదినాన స్వయంగా తనకే వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయనే విషయం తెలుసుకో వలెను. ఎవరైనా సరే, ఈ పవిత్ర వచనాన్ని ధృవీకరించటంతోనే ఇస్లాం ధర్మంలో ప్రవేశిస్తారు. అప్పుడు అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ విశ్వసించటం మరియు వారి మధ్య ఎటువంటి భేదాలు చూపకపోవటం అతడి పై తప్పని సరి అయిపోతుంది. ఖుర్ఆన్ (V.18:102-110) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదిలి, నా దాసులను (అంటే దైవదూతలను, అల్లాహ్ యొక్క సందేశహరులను, మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా అలైహిస్సలాం, పుణ్యపురుషులు..) తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకోగలరని భావించారా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంచాము.”

    “ప్రకటించు: ‘కర్మలను బట్టి అందరి కంటే ఎక్కువగా నష్టపడేవారు ఎవరో మీకు తెలుపాలా?’ “ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా, తాము చేసేవన్నీ సత్కార్యాలే అని భావిస్తారో!” “వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి ఉన్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున వారి కర్మలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి మేము పునరుత్థాన దినమున వారి కర్మలకు ఎలాంటి విలువ (తూకము) నివ్వము. “అదే వారి ప్రతిఫలం నరకం; ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు. “నిశ్చయంగా! ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారి ఆతిథ్యం కొరకు ఫిర్దౌస్ స్వర్గవనాలు (అత్యున్నత స్వర్గపు తోటలు) ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు. వారు అక్కడి నుండి వేరగుటకు ఇష్టపడరు. వారితో అను: “నా ప్రభువు మాటలు వ్రాయటానికి సముద్రమంతా సిరాగా మారిపోయినా – నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే – దానికి తోడుగా దాని వంటి మరొక సముద్రాన్ని తెచ్చినా అది కూడా తరిగి పోతుంది.” (ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలాఅను: నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడినే.నాపై దివ్యజ్ఞానం అవతరింపజేయబడినది. నిశ్చయంగా మీ ఆరాథ్యుడు ఆ ఏకైక ఆరాధ్య దైవం (అల్లాహ్) మాత్రమే. కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములు (షరీక్) గా కల్పించుకోరాదు.”

    ఎవరైనా ఇస్లాం స్వీకరించాలనుకుంటే, క్లుప్తంగా పైన తెలిపిన కనీస ఇస్లాం పరిచయ విషయాలు తప్పక చదవుకోవలెను. షహాదా పవిత్ర వచనాలపై సాక్ష్యం పలికిన తర్వాత, ఇస్లామీయ పద్ధతిలో సంపూర్ణ తలస్నానం – గుసుల్ చేసి, రెండు రకాతుల నమాజు చేసి, ఆ తర్వాత ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాల ఆధారంగా జీవించటం మొదలు పెట్టవలెను. ఇంకా సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనం లోని మొదటి హదీథ్ గ్రంథం 7వ హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన బోధనను ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు – ఇస్లాం ఐదింటిపై ఆధారపడి ఉన్నది:

    1) లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ అంటే “అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని నేను సాక్ష్యమివ్వటం, ధృవీకరించటం. 2) నమాజు స్థాపించటం. 3) జకాతు– తప్పని సరి విధిదానం చెల్లించటం. 4) రమదాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండటం. 5) హజ్ చేయటం (i.e.మక్కా యాత్ర).

    ఇంకా అర్కాన్ అల్ ఈమాన్ అంటే విశ్వాసపు ఆరు సిద్ధాంతాలను కూడా నమ్మవలసి ఉంటుంది. అవి:

    1. అల్లాహ్ పై విశ్వాసం

    2. అల్లాహ్ యొక్క దైవదూతలపై విశ్వాసం

    3. అల్లాహ్ యొక్క సందేశహరులపై విశ్వాసం

    4. అల్లాహ్ యొక్క గ్రంథాలపై విశ్వాసం

    5. పునరుత్థాన దినం పై విశ్వాసం

    6. అల్ ఖదర్ – జీవితంలో జరగబోయే మంచిచెడులను అల్లాహ్ ముందు గానే లిఖించి ఉంచాడనే నమ్మకం పై విశ్వాసం.

    ముఖ్యగమనిక :-

    మనం చేసే మంచి పనులు, పుణ్యకార్యాలు క్రింద తెలిపిన రెండు షరతుల ప్రకారం ఉంటేనే అల్లాహ్ దగ్గర స్వీకరించబడతాయి.:

    1. అటువంటి మంచి పనులు, పుణ్యకార్యాలు కేవలం అల్లాహ్ స్వీకరణ కొరకు మాత్రమే చేస్తున్నట్లు దృఢసంకల్పం చేసుకోవలెను. అందులో ఎటువంటి ప్రదర్శనాబుద్ధి, కీర్తి ప్రఖ్యాతుల తాపత్రయం, ఎవరినైనా మెప్పించటం కోసం చేసే ప్రయత్నం, స్వార్థం వంటివి ఉండకూడదు.

    2. అటువంటి మంచి పనులు, పుణ్యకార్యాలు అల్లాహ్ యొక్క అంతిమ సందేశహరుడు మరియు దాసుడు అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నహ్ (ఇస్లామీయ ధర్మాదేశాలు, ఆచరణలు, అనుమతులు) ప్రకారం ఉండవలెను.

    معلومات المادة باللغة الأصلية