×
New!

Bayan Al Islam Encyclopedia Mobile Application

Get it now!

దివ్యఖుర్ఆన్ పరిచయం (తెలుగు)

Preparation: ముహమ్మద్ తఖీయుద్దీన్

Description

క్లుప్తంగా దివ్యఖుర్ఆన్ పరిచయం

Download Book

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో
మానవాళికి విశ్వప్రభువు లెక్కించలేనన్నిశుభాలను ప్రసాదించాడు. ఆయన మనిషి జీవితానికి అవసరమయ్యే అన్న పానీయాలను ఇవ్వటమే గాక, మనోభావాల్ని ప్రకటించే శక్తియుక్తులను కూడా ప్రసాదించాడు. జీవించే ఉపాయాలను ప్రసాదించాడు. ఇంకా మనిషి సంస్కృతీ నాగరికతలకు దోహదపడే సామగ్రిని భూమండలంలో పుష్కలంగా పొందుపరచాడు.
సృష్టికర్త ఇచ్చిన ఈ భౌతికానుగ్రహాలన్నీ ఒక ఎత్తయితే, అధ్యాత్మికంగా మానవాళికి మార్గదర్శకత్వం వహించటం ఇంకో ఎత్తు. సర్వవిధాల మానవత్వం పై దయదలచిన సృష్టికర్త, మానవులకు సన్మార్గం చూపే ఏర్పాటు కూడా చేశాడు. దాని ద్వారా ప్రపంచంలో శాంతి స్థాపన, అల్లకల్లోల నిర్మాలన, మంచి, మానవత్వం, నీతి నియమాలతో కూడిన సమాజ నిర్మాణ ప్రయత్నాలు యుగయుగాలుగా జరుగుతున్నవి. మానవ సమాజాల్లో అశాంతి, అరాచకం ప్రబలిపోవడాన్ని సృష్టికర్త ఎంతమాత్రం ఇష్టపడడు. వాస్తవమేమిటంటే తన దాసులయిన మానవులంటే ఆయనకు అమితమైన ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించడంతో పాటు వారి ఇహపర సాఫల్యాల కోసం మార్గదర్శక ఏర్పాటు కూడా చేశాడు. తన ప్రవక్తల ద్వారా సమస్త మానవజాతికి మార్గ దర్శక నియమావళిని ప్రసాదించాడు. దైవ ప్రవక్తలందరికీ ఆయా కాలాలను, అవసరాలను బట్టి దివ్యగ్రంథాలను, ప్రవర్తనా నియమావళుల (సహీఫాల) ను ఇచ్చాడు. వాటి ఆధారంగా ప్రవక్తలు మానవ సంస్కరణా కార్యానికి పూనుకునేవారు. ప్రజల జీవితాలను తీర్చిదిద్దేవారు. దైవభీతి, పరలోక చింతన ప్రాతిపదికగా మానవసమాజాల్లో నైతిక విప్లవం తెచ్చేవారు.
ఈ మార్గదర్శక గ్రంథాలలో చిట్టచివరిదే దివ్యఖుర్ఆన్. దీనికి పూర్వం దివ్యగ్రంథాలెన్నో అవతరించాయి. ఉదాహరణకు తౌరాత్, జబూర్, ఇంజీల్ కూడా మానవాళి మార్గదర్శకత్వం కోసం సృష్టికర్త పంపిన దివ్యగ్రంథాలే. కాని ఆ పవిత్ర గ్రంథాల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం, ఆయా మతాధిపతులు, స్వప్రయోజనాల కోసం చేసిన మార్పుల వల్ల, అవి తమ స్వచ్ఛతను, ప్రామీణికతను, అసలు స్థితిని కోల్పోయి కలుషితమైపోయాయి. క్రమంగా దివ్యసందేశంలో మానవ కల్పితాలు చోటు చేసుకున్నాయి. సత్యమార్గాన్ని పెడత్రోవ పట్టించారు. మానవజాతి ఇలా అపమార్గానికి లోనైనప్పుడల్లా సృష్టికర్త మరో ప్రవక్తను, మరో జీవన విధానాన్ని పంపి, మరచిపోయిన దైవాజ్ఞలను తిరిగి జ్ఞాపకం చేసుకునేటట్లు ఏర్పాటు చేశాడు. ఆటువంటి దివ్యమైన మార్గదర్శక పరంపరలో చిట్టచివరి దైవగ్రంథమే, ఈ దివ్యఖుర్ఆన్.
దివ్యఖుర్ఆన్ మానవజాతి పట్ల ఓ గొప్ప అనుగ్రహం. ప్రపంచంలోని మరే అనుగ్రహమూ దీనితో సరితూగలేదు. మనిషి ఇహపర సాఫల్యాలు, సభ్యతా సంస్కారాలు, గౌరవోన్నతులు, నీతి నడవడికలు - అన్నీ ఈ దివ్యగ్రంథంలో ఇమిడి ఉన్నాయి. ఇది ఒక మహా సాగరం. దీనిని ఎంత శోధించినా తనివి తీరదు. దీని లోతుల్లోకి పోయిన కొద్దీ విలువైన ముత్యాలు దొరుకుతూనే ఉంటాయి. క్రొత్త క్రొత్త విషయాలు ముందుకు వస్తూనే ఉంటాయి. దీని అధ్యయనం వలన హృదయం జ్యోతిర్మయమవుతుంది అంటే జ్ఞానకాంతితో నిండిపోతుంది.
విజ్ఞానం పేరుతో నేడు ఆకాశాలలో స్వైరవిహారం చేస్తున్న మనిషికి నేలపై నిలిచి సాటి మనిషులతో సహజీవనం చేయడం చేతకావడం లేదు. కమ్యూనికేషన్ల ప్రగతి వలన వివిధ దేశాల మధ్య దూరం తరిగిపోయి ప్రపంచం కుంచించుకు పోతున్నా, మనుషుల మనసులు మాత్రం ఒక్కటి కావటం లేదు. జాతి, రంగు పేరిట నేటికీ ప్రపంచంలో విద్వేషం పెరిగి రక్తం చిందుతూనే ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే నేడు ప్రపంచమంతా రోగగ్రస్తమై ఉన్నది. దానికి చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖుర్ఆన్ ఒక దివ్య ఔషధం! అది సర్వరోగ నివారిణి! అది మానవులందరికీ మార్గదర్శిని! హృదయానికి హత్తుకుని, దానిని అనుసరించేవారికి అది మోక్షం పొందే మార్గాన్ని సూచిస్తుంది. మొత్తం మానవజాతి కోసం పంపబడిన అటువంటి దివ్యఔషధాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? మనకు తెలిసిన భాషలో అందుబాటులో ఉన్న దాని భావాన్ని కనీసం ఒక్కసారైనా చదవటానికి, అర్థం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించటం లేదు? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలనే సామెతను మరచిపోయారా? ఈ జీవితకాలంలో దానిని చదవక, మరణించగానే ఎదురయ్యే కఠినాతి కఠినమైన నరకశిక్ష అనుభవిస్తూ, పశ్చాత్తాపం పడటంలో ఏమైనా వివకమున్నదా? సృష్టికర్త ప్రసాదించిన అద్భుతమైన, అపూర్వమైన మన తెలివితేటలను ప్రపంచ మాయాజాలం నుండి కనీసం ఒక్కసారైనా తప్పించి, ఇహపరలోకాల సాఫల్యానికి దారి చూపించగలిగే ఏకైక, స్వచ్ఛమైన, సత్యమైన అంతిమ దివ్యగ్రంథాన్ని నేటి నుండే చదవటానికి దయచేసి ప్రయత్నించండి. మరణం ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు. లేదా హఠాత్తుగా మన పంచేంద్రియాలు పనిచేయటం మానివేయవచ్చు. లేదా కోలుకోలేని దీర్ఘకాల అనారోగ్యానికి గురికావచ్చు. 'ఇన్నేళ్ళపాటు మనం సురక్షితంగా, క్షేమంగా జీవిస్తామని' చెప్పగలిగే స్థితికి సైన్సు పరిజ్ఞానం ఏనాడూ చేరలేదు. ఆ జ్ఞానం కేవలం సర్వలోక సృష్టికర్త వద్దనే ఉన్నది. కాబట్టి మన తెలివితేటలు సరిగ్గా పనిచేస్తున్నప్పుడే, మన పంచేంద్రియాలు సరైన స్థితిలో ఉన్నప్పుడే అంటే సరిగ్గా గ్రహిస్తున్నప్పుడే మరియు ఆరోగ్యంగా ఉన్న ఈ వయస్సులోనే ప్రతిరోజు దివ్యఖుర్ఆన్ లోని కొంతభాగాన్నైనా చదివి, అర్థం చేసుకోవటానకి ప్రయత్నించవలెను. ఈ ప్రయత్నంలోని నిజాయితీ పైనే సృష్టికర్త తోడ్పాడు ఆధారపడి ఉంటుందనేది మరచిపోవవద్దు. ఖుర్ఆన్ ద్వారా సరైన మార్గదర్శకత్వం పొందగలిగితే లాభపడేది మీరే. అలాగే ఖుర్ఆన్ ను నిర్లక్ష్యం చేసి, ఇహపరలోకాల సాఫల్యపు స్వచ్ఛమైన, సత్యమైన మార్గాన్ని తెలుసుకోలేకపోతే నష్టపోయేది కూడా మీరే. ఇది మరణించగానే ప్రతి ఒక్కరి ముందుకు రాబోయే ఒక నగ్నసత్యం. అన్ని మతాలు, ధర్మాలు మంచివైపుకే పిలుస్తున్నాయని, దైవాన్ని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చని, తాము అనుసరిస్తున్న అంధవిశ్వాసాల, ప్రాచీన గ్రంథాల ద్వారా కూడా ముక్తి పొందవచ్చని చాలా మంది అపోహలు పడుతున్నారు. కొంతకాలం ఆ భ్రమలను ప్రక్కన పెట్టి, అంతిమ దైవసందేశమైన దివ్య ఖుర్ఆన్ చదివితే కలిగే నష్టమేమిటి? వారు భ్రష్టపడిపోతారా? తమ మతం, ధర్మం నుండి వెలివేయబడతారా? ప్రతి ధర్మం సత్యాన్వేషణను ప్రోత్సహిస్తుందే తప్ప నిరుత్సాహపరచదు. కాబట్టి నిజాయితీగా చూసినట్లయితే, కేవలం మనలోని అహంభావం, నిర్లక్ష్యం, ప్రస్తుత జీవన విధానం పై హద్దుమీరిన విశ్వాసం, ఇతర ధర్మాలపై ముఖ్యంగా ఇస్లాం ధర్మం పై అపనమ్మకం మొదలైన కారణాల వలన మాత్రమే మన ముందున్న అత్యున్నతమైన అంతిమ దివ్యగ్రంథం పట్ల మనకు ఆసక్తి, కుతూహలం కలగటం లేదు.
ఓ మనిషీ! ప్రతి వైద్యుడూ నీ రోగాన్ని మరింత తీవ్రతరమే చేశాడు. నువ్వు నా వైపుకు రా! నీ రోగాన్ని నేను నయం చేస్తాను" అని పిలుస్తోంది ఖుర్ఆన్. కనుక మనం ఖుర్ఆన్ వైపుకు మరలాలి. దాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. మనకు అత్యవసరమైన మోక్షానికి, ఇహపర సాఫల్యాలకు ఈ గ్రంథమార్గదర్శకత్వం తప్పని సరి.

معلومات المادة باللغة العربية