Description
త్రిసూత్రాలు మరియు వాటి ఆధారాలు
Other Translations 56
Topics
త్రిసూత్రాలు మరియు వాటి ఆధారాలు
రచన : షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం.
సర్వస్తోత్రాలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే చెందుతాయి. మరియు అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పై,ఆయన కుటుంబముపై,ఆయన సహచరులపై మరియు ప్రతిఫల దినం వరకు ఆయన మార్గమును అనుసరించే వారిపై అల్లాహ్ శుభాలను మరియు శాంతిని కురిపించు గాక. అమ్మా బాద్ :
ఒక ముస్లిం యొక్క అత్యధిక దృష్టి అఖీద మరియు ఆరాధన నియమ నిబంధనలకు సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవడంపై ఉండాలి. ఎందుకంటే కర్మలు స్వీకరించబడటం మరియు దాసునికి వాటి ప్రయోజనం విశ్వాసం యొక్క సుగుణాల నుండి ప్రక్షాళన చేయబడటం మరియు పుస్తకం మరియు సున్నాను అనుసరించడంపై ఆధారపడి ఉంటుంది.
మరియు అల్లాహ్ సన్మార్గమును చూపే,చికీటిలో వెలుగునిచ్చే దీపాలైన ఇమాములను అందుబాటులో ఉంచి ఈ ఉమ్మత్ పై ఎంతో దయ చూపాడు మరియు అనుగ్రహించాడు. వారు మార్గములో వెలుగును నింపారు. ఏది అనివార్యమో,ఏది అనివార్యం కాదో మరియు ఏది నష్టదాయకమో,ఏది లాభదాయకమో,చిన్న విషయాలను,పెద్ద విషయాలను తెలియజేశారు. అల్లాహ్ వారందరికి ఇస్లాం,ముస్లింల తరపున ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించాలి.
షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ ఈ గొప్ప ఇమామ్లలో గొప్ప మరియు అత్యంత ప్రసిద్ధ ఇమామ్లలో ఒకరు. అల్లాహ్ వారికి పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదించి లెక్కతీసుకోకుండా స్వర్గంలోకి ప్రవేశాన్ని కల్పించాలి. సత్యాన్ని సమతుల్యంగా వ్యక్తీకరించే విలువైన పని చేసి, ఈ విషయంలో తన కలం, నాలుక, ఆయుధంతో పోరాడారు. తత్ఫలితంగా అల్లాహ్ అనేక మందిని అపనమ్మకం, అజ్ఞానం అనే చీకటి నుంచి వారి ద్వారా జ్ఞానం, విశ్వాసం వెలుగులోకి తీసుకువచ్చాడు.
మన ముందు ఉన్న ఈ పుస్తకం ఈ ఇమామ్ గారి మూడు పత్రికలు అయిన : ఉసూలుస్సలాస వఅదిల్లతుహా,షురూతుస్సలా వవాజిబాతుహా వఅర్కానుహా మరియు ఖవాయిదుల్ అర్బఅ యొక్క సమాహారం.
ఆరాధనా సూత్రాలను, నియమాలను వివరించే ఈ పత్రికలు ఆయన అత్యంత ముఖ్యమైన, సమగ్రమైన పత్రికలు. ప్రతి ముస్లిం తెలుసుకోవాల్సిన, ఆచరించాల్సిన అన్ని మతపరమైన విషయాలను వీటిలో వారు ఏకం చేశారు.
అల్లాహ్ తో భాగస్వామ్యం అనేది రుబూబియత్ లో భాగస్వామ్యానికి మాత్రమే పరిమితం అనే భ్రమలో వారిని ఉంచడానికి ప్రయత్నించే వారి సందేహాలను కూడా ముస్లింలకు తెలియజేశారు. షేఖుల్ ఇస్లాం రహిమహుల్లాహ్ వారి తప్పును ఎత్తిచూపడమే కాకుండా అల్లాహ్ గ్రంధం మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ వెలుగులో వారి సందేహాలను నివృత్తి చేశారు.
సామాన్య ప్రజల కోసం ఈ పత్రికలు వ్రాసి, కథన శైలి సులభంగా, క్లుప్తత చేతికి అందకుండా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేశారు. అందువలన, చాలా అందమైన మరియు ఉపయోగకరమైన పత్రికలు వెలువడ్డాయి, ఇవి చిన్నవారికి మరియు పెద్దలకు సమానంగా ఉపయోగపడతాయి మరియు వాటి విషయం మరియు కంటెంట్ యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా చాలా మేలు,శుభాలు కలవి.
ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు దావా మరియు ఇర్షాద్ యొక్క ముద్రణ మరియు ప్రసారాల విభాగం ఈ పత్రికల యొక్క గొప్ప ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పత్రికలను ప్రత్యేక శ్రద్ధ మరియు ప్రచురణకు అర్హమైనవిగా పరిగణించాల్సిన అవసరం ఉందని భావించాయి, ఇది వస్తువు మరియు కంటెంట్ యొక్క సులభమైన శైలి మరియు విలువలో ఉంది, తద్వారా అల్లాహ్ యొక్క ధర్మం వైపు పిలుపును వివేకంతో మరియు సరైన మరియు సముచితమైన పద్ధతిలో నిర్వహించవచ్చు. ఇంకా అల్లాహ్, ఆయన పుస్తకం, ఆయన ప్రవక్త,సామాన్య ముస్లింల సద్భావన కూడా పూర్తి అవ్వాలి.
అల్లాహ్ సుబహానహు వతఆలా తో ముస్లింలందరికి ఆయన ధర్మమును అర్ధం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించమని మరియు ఆయన గ్రంధము ప్రకారం,ఆయన ప్రవక్త సున్నత్ ప్రకారం ఆచరించే సౌభాగ్యమును ప్రసాదించమని మేము వేడుకుంటున్నాము. నిశ్చయంగా వినేవాడును మరియు సమీపంగా ఉన్నాడు. మరియు అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై,ఆయన కుటంబము పై మరియు ఆయన సహచరులపై శుభాలను ప్రసాదించుగాక.
మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్, ఎండోమెంట్స్, దావా, ప్రెస్ అండ్ పబ్లిషింగ్ అఫైర్స్ గైడెన్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ.
డాక్టర్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ అజ్జైద్
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం.
తెలుసుకోండి అల్లాహ్ మీపై కరుణించుగాక. నాలుగు విషయాల గురించి తెలుసుకోవటం మనపై విధి అవుతుంది.
(మొదటి విషయం) జ్ఞానము. అది అల్లాహ్ అవగాహన,ఆయన ప్రవక్త అవగాహన మరియు ఇస్లాం ధర్మం అవగాహన ఆధారాలతో చేసుకొనుట.
(రెండవ విషయం) దాని పై ఆచరణ.
(మూడవ విషయం) దాని వైపు ఆహ్వానించటం.
(నాల్గవ విషయం) అందులో (ధర్మప్రచారంలో) కలిగే బాధలపై సహనం చూపటం. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం : అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం.{وَالْعَصْرِ (1) కాలం సాక్షిగా (1)إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ (2) నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు! (2)إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ (3)}. కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప! (3)
ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు :ఒక వేళ అల్లాహ్ తన సృష్టిపై ఆధారంగా ఈ ఒక్క సూరాని అవతరింపజేసి ఉంటే వారికి సరిపోయేది.
బుఖారీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు (మొదటి సంపుటం 45వ పేజీ) :
(అధ్యాయం) "మాటకు,ఆచరణకు ముందు జ్ఞానముండాలి. అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే దీనికి ఆధారం :{فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ}తెలుసుకోండి అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేడు. మరియు మీ పాపాల పట్ల క్షమాపణ కోరుతూ ఉండండి.కనుక (అల్లాహ్) మాటకు,ఆచరణకు ముందు జ్ఞానముతో ఆరంభించాడు".
(తెలుసుకోండి) అల్లాహ్ మీపై కరుణించుగాక. ఈ మూడు విషయముల జ్ఞానం పొంది వాటిని ఆచరించటం ప్రతి ముస్లిం స్త్రీ,పురుషునిపై విధించబడిన విధి.
(మొదటి విషయం) అల్లాహ్ యే మమ్మల్ని సృష్టించాడు మరియు మాకు ఉపాధిని ప్రసాదించాడు. మమ్మల్ని అనవసరంగా ఇలాగే వదిలిపెట్టలేదు. అంతే కాక మా వైపు ఒక ప్రవక్తను పంపించాడు. కావున ఆయనపై విధేయత చూపినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఆయనపై అవిధేయత చూపినవాడు నరకంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ యొక్క ఈ వాక్యమే దీనికి ఆధారం :{إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا (15) మేము ఫిర్ఔన్ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకు సాక్షిగా ఉండటానికి పంపాము. (15)فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا (16)}కాని ఫిర్ఔన్ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతనిని కఠినంగా శిక్షించాము. (16)సూరతుల్ ముజ్జమ్మిల్ 15,16 ఆయతులు.
(రెెండవ విషయం) అల్లాహ్ తన ఆరాధనలో తనతో పాటు మరెవరినీ సాటి కల్పించడాన్ని ముమ్మాటికి ఇష్టపడడు. దగ్గరి దైవదూత అయినా,పంపించబడ్డ ప్రవక్త అయినా సరే. అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం :{وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا}మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి.సూరతుల్ జిన్న్ :18
(మూడవ విషయం) ఎవరైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించి విధేయత చూపి, అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెబుతారో వారికి అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల శతృత్వం వహించే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం సమ్మతం కాదు. ఒకవేళ వారు ఇహలోకపరంగా అతి సమీప బంధువులైన సరె. ఇందుకు ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వాక్యము :{لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَٰئِكَ حِزْبُ اللَّهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْمُفْلِحُونَ}{అల్లాహ్ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించేవారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు! ఆ వ్యతిరేకించేవారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుటుంబం వారైనా సరే! అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి (రూహ్) ఇచ్చి బలపరిచాడు. మరియు వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్నులవుతారు. ఇలాంటి వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. గుర్తుంచుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ పక్షం వారే సాఫల్యం పొందేవారు.}సూరతుల్ ముజాదల 22 వ ఆయతు
(తెలుసుకోండి) అల్లాహ్ మీకు తనకు విధేయత చూపే సన్మార్గం చూపుగాక. హనీఫియ్య ఇబ్రాహీం మిల్లత్ అంటే మీరు ఏకైక అల్లాహ్ ని ఆయన కొరకు ధర్మమును ప్రత్యేకిస్తూ ఆరాధించాలి. ఈ కార్యము గురించే అల్లాహ్ ప్రజలందరికి ఆదేశించాడు. మరియు వారిని దాని కొరకే సృష్టించాడు. అల్లాహ్ తఆలా ఇలా సెలవిస్తున్నాడు :{وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ}{మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.}యాబుదూన్ అనే పదానికి అర్ధం నా ఏకత్వాన్ని అంగీకరించటానికి.
అల్లాహ్ ఆదేశించిన వాటిలో ప్రధానమైన,ఉన్నతమైన ఆదేశం తౌహీద్. అది ఆరాధనను అల్లాహ్ ఒక్కడికే చేయడం.
మరియు అల్లాహ్ వారించిన వాటిలో ప్రధానమైనది షిర్క్. మరియు అది అల్లాహేతరులను ఆయనతో పాటు పిలవటం. అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం :{وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا}. అల్లాహ్ నే ఆరాధించండి మరియు దేనినీ ఆయనకు భాగస్వామిగా చేర్చకండి.
(మీకు ఇలా ప్రశ్నించినప్పుడు) : మనిషి అవగాహన చేసుకోవటం అవశ్యకమైన త్రిసూత్రాలు ఏమిటి?.
మీరు సమాధానమివ్వండి : దాసుడు తన ప్రభువు గురించి,తన ధర్మం గురించి మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అవగాహన పొందడం.
(మీకు ఇలా ప్రశ్నించినప్పుడు) : మీ ప్రభువు ఎవరు?
మీరు సమాధానమివ్వండి : నా ప్రభువు అల్లాహ్ ఆయనే తన అనుగ్రహాలతో నన్ను పోషిస్తున్నాడు మరియు సర్వలోకాలను పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దైవం, నా కొరకు ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం :{الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ}స్తుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.(8)అల్లాహ్ తప్ప అన్నీ లోకము. ఆ లోకములో నుంచి నేను ఒకణ్ణి.
(మీకు ఇలా ప్రశ్నించినప్పుడు) : మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు?
మీరు ఇలా సమాధానం ఇవ్వండి : ఆయన చిహ్నాలతో మరియు ఆయన సృష్టితాలతో (నా ప్రభువును గుర్తించాను). ఆయన చిహ్నాల్లో రాత్రి,పగలు,సూర్యుడు మరియు చంద్రుడు. అయన సృష్టితాల్లో సప్తాకాశములు,సప్త భూములు వాటిలో ఉన్న,వాటి మధ్యలో ఉన్నవి. అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం :{وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ}{మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి - నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే.} (9)సూరతు ఫుస్సిలత్ 37వ ఆయతు.
అల్లాహ్ సెలవిచ్చాడు:-{إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ}{నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు!}(10)సూరతుల్ ఆరాఫ్ 54వ ఆయతు.
మరియు ప్రభువు ఆయనే ఆరాధ్యుడు. అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం :{يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ (21) {ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!}(21).الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ (22)}ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా,మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.}(22).సూరతుల్ బఖర 21,22 ఆయతులు
ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు : వీటన్నిటి సృష్టికర్తే ఆరాధనకు అర్హుడు.
(ఆరాధన రకాలు) అల్లాహ్ ఆదేశించినవి ఉదాహరణకి ఇస్లాం,ఈమాన్ మరియు ఇహ్సాన్. మరియు వాటిలో నుంచి దుఆ,భయము,ఆశ,నమ్మకం,భక్తి,భయము,అనుకువ,భీతి,మరలటం,సహాయం అర్థించటం,శరణు కోరటం,ఆపదలో సహాయం వేడుకోవటం,వదించటం,మొక్కుబడి మరియు అల్లాహ్ ఆదేశించనటువంటి ఇతర ఆరాధనలన్ని అల్లాహ్ కొరకే చెందుతాయి. దీనికి ఆధారం అల్లాహ్ వాక్కు :{وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا}మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి.సూరతుల్ జిన్న్ :18
ఎవరైనా వాటిలో నుంచి దేనినైనా అల్లాహ్ ను కాకుండా ఇతరుల కొరకు చేస్తే అతను ముష్రిక్ మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు :{وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ}ఇక ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే - ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు.సూరతుల్ మూమినూన్ : 117
మరియు హదీసులో ఇలా ఉందిదుఆ ఆరాధన యొక్క అసలైన పౌష్టికం.మరియు అల్లాహ్ యొక్క వాక్కు నుండి ఆధారం :{وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ}మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు".సూరతు గాఫిర్ : 60 ఆయతు
భయభీతి యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ}మీరు వారితో భయపడకండి. మీరు విశ్వాసులైతే నాకు మాత్రమే భయపడండి.సూర ఆలే ఇమ్రాన్ : 175 ఆయతు.
ఆశ (రజా) యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا}{కాబట్టి ఎవడైతే అల్లాహ్'యొక్క కలయిక'ను ఆశిస్తాడో అతను సత్కార్యాలను ఆచరించాలి మరియు తన ప్రభువు ఆరాధనతో ఎవ్వరికీ సాటి కల్పించకూడదు}.సూరతుల్ కహఫ్ : 110 ఆయతు.
నమ్మకం (తవక్కుల్) యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ}మరియు అల్లాహ్ పై నమ్మకం కలిగి ఉండండి ఒకవేళ మీరు విశ్వాసులే అయితే.సూరతుల్ మాయిదా'ఆయతు 23{وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ}అల్లాహ్ పై నమ్మకమును ఉంచినవాడికి ఆయన అతనికి చాలు.సూరతు తలాఖ్ : 3
ఇష్టత,భయభీతి మరియు అనుకువ యొక్క ఆధారం అల్లాహ్ వాక్కు నుండి :{إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ}. ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు,ఆశతోనూ భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు,మా ముందు ఆశక్తతను అనుకువను కనబర్చేవారు.
భయ భక్తుల యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ}الآية، మీరు వారితో భయపడకండి, నా తోనే భయపడండి.సూరతుల్ మాయిదా'ఆయతు 3
మరలటం (ఇనాబత్) యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ}الآية، మరియు మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. మరియు ఆయనకు విధేయులవ్వండి.సూరతు జుమర్ 54వ ఆయతు.
సహాయం అర్థించటం యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.ఫాతిహా : 5
మరియు హదీసులో ఇలా ఉందిమీరు సహాయమును కోరినప్పుడు అల్లాహ్ తో సహాయమును అర్థించండి.
శరణం కోరటం యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ (1) ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!(1)مَلِكِ النَّاسِ (2)}. మానవుల చక్రవర్తి. (2)
ఆపదలో సహాయం అర్థించటం యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ}الآية، ఆసందర్భమును జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు మీరు మీ ప్రభువును మొరపెడుతూ వేడుకుంటారు. అప్పుడు ఆయన మీ మొరను ఆలకించాడు.అన్ఫాల్ : 9
వదించటం (జిబాహ్) యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (162) (ఇంకా) ఇలా అను : "నిశ్చయంగా నా నమాజ్ నా బలి (ఖుర్బానీ), నా జీవితం మరియు నా మరణం, సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే! (162)لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ (163)}"ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు. మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను మరియు నేను అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారిలో మొట్టమొదటి వాడను!" (163)సూరతుల్ అన్ఆమ్ 162,163 ఆయతులు
సున్నత్ నుండి ఆధారం :అల్లాహేతరుల కొరకు బలి ఇచ్చిన వాడిపై అల్లాహ్ శాపం ఉండును.
మొక్కుబడి (ఇనాబత్) యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا}వారు తమ మొక్కుబడులను పూర్తి చేసుకున్నవారై ఉంటారు. మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకునే, ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు.సూరతు దహర్ : 7
ఏకత్వాన్ని సహృదయముతో అంగీకరిస్తూ తమకు తాము అల్లాహ్ కు విధేయులుగా సమర్పించుకోవాలి.విధేయత మరియు షిర్కు నుండి విముక్తి ద్వారా ఆయనకు లొంగిపోవడం. దానికి మూడు స్థానాలు కలవు:
ఇస్లాం,ఈమాన్ మరియు ఇహ్సాన్. ప్రతీ స్థానమునకు మూలాలున్నాయి.
ఇస్లాంనకు ఐదు మూలాలున్నాయి. 1) అల్లాహ్ తప్ప మరెవ్వరూ వాస్తవ ఆరాధ్యదైవం కాదని,ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలకటం,2) నమాజును నెలకొల్పటం,3) జకాత్ ఇవ్వటం,4) రంజాను మాసపు ఉపవాసాలు ఉండటం,5) అల్లాహ్ పరిశుద్ధగృహ హజ్ చేయటం.
సాక్ష్యమునకు ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు :{شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ}నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దైవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.సూర ఆలే ఇమ్రాన్ : 18 ఆయతు.దాని (సాక్ష్యానికి) అర్ధం ఏమిటంటే ఏకైక అల్లాహ్ తప్ప మరెవ్వరూ వాస్తవ ఆరాధ్య దైవం కారు.లా ఇలాహ లో అల్లాహ్ కాకుండా ఆరాధించబడే వారందరి నిరాకరణ కలదు. ఇల్లల్లాహ లో తన ఆరాధనలో ఎవరూ సాటి లేని, ఏవిధంగానైతే తన సామ్రాజ్యంలో సాటిలేరో అలాగ సాటి లేని ఏకైక అల్లాహ్ కొరకు ఆరాధన నిరూపణ కలదు.అల్లాహ్ యొక్క ఈ వాక్కు దాని వ్యఖ్యానమును వివరిస్తుంది :{وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ (26) إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ (27) ఇబ్రాహీము తన తండ్రితోనూ,తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను (26),నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు (27)وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ}మరియు అతను (ఇబ్రాహీమ్) ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు. వారు దాని వైపుకు మరలుతారని! (28)జుక్రుఫ్ 26,27,28.
అల్లాహ్ సెలవిచ్చాడు:-{قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ}{ఇలా అను: " ఓ గ్రంధ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు."వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి"}.ఆలే ఇమ్రాన్ : 64
ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమునకు ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు :{لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ}(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు.తౌబా 128 ఆయతు.ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమివ్వటం యొక్క అర్ధం : ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనను అనుసరించటం మరియు ఆయన తెలియపరచిన వాటి విషయంలో ఆయనను నమ్మటం మరియు ఆయన వారించిన,మందలించిన వాటి నుండి దూరంగా ఉండటం మరియు ఆయన ధర్మశాసనం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించటం అనివార్యము.
నమాజు,జకాతు మరియు తౌహీదు వివరణ గురించి ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు :{وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ}మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము".బయ్యిన 5వ ఆయతు
ఉపవాసాలుండటం యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ}ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!బఖరా : 183 ఆయతు
హజ్ యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ}మరియు అల్లాహ్ కొరకు ప్రజలపై అల్లాహ్ గృహ సందర్శన హజ్జ్ స్తోమత కలిగి ఉన్నవారు చేయవసల్సి ఉంది;మరియు ఎవరైతే తిరస్కరించాడో నిశ్చయంగా అల్లాహ్ సర్వలోకాల కంటే చాలా సుసంపన్నుడు.ఆలే ఇమ్రాన్ : 97
విశ్వాసానికి డెబ్బైలేక అరవై కు మించి శాఖలు ఉన్నాయి అందులో"లా ఇలాహ ఇల్లల్లాహు"వాక్యం పలకడం (విశ్వసించడం) అత్యున్నతమైనది అయితే"మార్గం మద్య నుండి హానికరమైన దాన్నితొలగించడం'అల్పమైనది,సిగ్గు (బిడియం) కూడా విశ్వాసానికి సంబంధించిన శాఖల్లో ఒకటి.
దానికి ఆరు కోణాలు కలవు : నీవు అల్లాహ్ పై,ఆయన దూతలపై,ఆయన గ్రంధములపై,ఆయన ప్రవక్తలపై మరియు అంతిమ దినంపై విశ్వాసమును చూపటం మరియు నీవు విధివ్రాతపై దాని మంచి,చెడుపై విశ్వాసము చూపటం.
ఈ ఆరు కోణాలకు ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు :{لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ}الآية، మీరు మీ ముఖములను తూర్పు దిక్కుకో,పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే అల్లాహ్ ను,అంతిమ దినాన్నీ,దైవదూతలనూ,దైవగ్రంధాన్ని,దైవప్రవక్తలనూ విశ్వసించటం.బఖరా : 177 ఆయతు
విధివ్రాత యొక్క ఆధారం అల్లాహ్ యొక్క వాక్కు నుండి :{إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ}నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము.ఖమర్ 49 ఆయతు
ఇహ్సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లు ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూడకపోయిన ఆయన నిన్ను చూస్తున్నాడు. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు :{إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ}నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు.నహల్ 128వ ఆయతు.
అల్లాహ్ సెలవిచ్చాడు:-{وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ (217) మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో! (217)الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ (218) ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు. (218)وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ (219) మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా! (219)إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ}నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. (220)షూరా 217 నుండి 220 వరకు ఆయతులు.
అల్లాహ్ సెలవిచ్చాడు:-{وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِن قُرْآنٍ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ}ఓ ప్రవక్తా మీరు ఏ పరిస్థితిలో ఉన్నానూ,ఖుర్ఆన్ గ్రంధములో ఏది చదివి వినిపిస్తున్నానూ,మీరు ఏ పని చేసినా,మీరు మీ కర్యక్రమాల్లో తలమనకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము.యూనుస్ : 61
సున్నత్ నుంచి ఆధారం : ప్రసిద్ధ హదీసు జిబ్రయీలు ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజయల్లాహు అన్హు ఉల్లేఖనం ఆయన ఇలా సెలవిచ్చారు :
మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమక్షంలో కూర్చుని ఉన్నాము. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని దుస్తులు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి. జుట్టు నల్లగా ఉంది. మరి అతనిలో ప్రయాణ బడలిక కూడా కనిపించలేదు. మాలో ఎవరూ అతన్ని ఎరుగరు. ఆ వ్యక్తి దైవవ్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ఎదుటకూర్చున్నాడు.తన మోకాళ్లను ఆయన మోకాళ్లకు ఆనించి మరీ కూర్చున్నాడు. తన అరచేతులను ఆయన తొడలపై ఉంచి, 'ఓ ముహమ్మద్! నాకు ఇస్లాం గురించి తెలియజేయండి' అని అన్నాడు. "నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని సాక్ష్యమివ్వాలి.ముహమ్మద్ అల్లాహ్ సందేశహరుడని కూడా నీవు సాక్ష్యమివ్వాలి.నమాజ్ను స్థాపించాలి. జకాత్ ఇవ్వాలి.రమజాన్ నెలలో ఉపవాసాలుండాలి. స్థోమత ఉంటే దైవ గృహాన్ని సందర్శించి హజ్ చేయాలి' అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించారు.'తమరు చెప్పింది నిజం' అన్నాడా వ్యక్తి.మాకు ఆశ్చర్యం కలిగించింది అతని ప్రవర్తన. ప్రశ్నించేవాడూ అతనే, సమాధానాన్ని సత్యమని ధృవీకరించేవాడూ అతనే.
"నాకు ఈమాన్ గురించి వివరించండి' అని తిరిగి ప్రశ్నించాడు ఆ పృచ్చకుడు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), "నీవు అల్లాహ్ను,ఆయన దూతలను, ఆయన (గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని, మంచి జరిగినా చెడు జరిగినా అంతా దైవం తరపుననే జరుగుతుందన్న విధివ్రాతను విశ్వసించు.ఇదే ఈమాన్' అని వివరించారు. "నాకు ఇహ్సాన్ గురించి చెప్పండి' అని మళ్లీ ప్రశ్నించాడు ఆ అపరిచితుడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా విడమరచి చెప్పారు: "నీవు అల్లాహ్ను చూస్తున్నానన్న (అల్లాహ్ ఎదుట ఉన్నాడన్న) భావంతో ఆయన్ని ఆరాధించు.ఒకవేళ నీవు ఆయన్ని చూడ లేకపోయినా, ఆయన నిన్ను చూస్తున్నాడన్న తలంపు నీలో ఉండాలి." "నాకు ప్రళయదినం గురించి చెప్పండి" అని అడిగాడు ఆ అపరిచిత వ్యక్తి. 'దాని గురించి ప్రశ్నించబడే వానికి ప్రశ్నించేవానికన్నా ఎక్కువేమీ తెలీదు" అన్నారాయన (సల్లలాహు అలైహి వ సల్లం) . "పోనీ నాకు దాని సూచనలయినా తెలుపగలరా?!' అని ఇంకో ప్రశ్న వేశాడు అతను. దానికాయన ఇలా చెప్పారు: "దాసీ (బానిసరాలు, పని మనిషి) తన యజమానురాలికి జన్మనిస్తుంది. కాళ్లకు చెప్పులు, శరీరంపై చొక్కా లేకుండానే గొర్రెల్ని కాచే గొర్రెల కాపరులు బ్రహ్మాండమైన కట్టడాలు కట్టడం నీవు చూస్తావు. మరి ఆ వ్యక్తి అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. మేము కాస్సేపు మౌనం వహించాము. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) "ఓ ఉమర్! ప్రశ్నలు వేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?!'అని అడిగారు. 'దైవానికి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే తెలిసి ఉండాలి అని మేము విన్నవించుకున్నాము. "ఆయన జిబ్రయీల్. మీకు మీ ధర్మాన్ని బోధించే నిమిత్తం ఆయన మీ వద్దకు విచ్చేశారు" అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు.
ఆయన ముహమ్మద్ బిన్ అబ్దుల్హాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ తెగకు చెందిన వారు. ఖురైష్ అరేబియా వాసుల్లోని ఒక తెగ. అరబ్ వాసులు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ బిన్ ఇస్మాయీల్ సంతానం. ఆయనపై మరియు మన ప్రవక్త పై అల్లాహ్ శుభశాంతులు కురియుగాక.
ఆయన పూర్తి వయస్సు 63సంవత్సరములు. వాటిలో నుంచి 40 సంవత్సరములు నుబువ్వత్ కన్న ముందువి మరియు 23 సంవత్సరములు ప్రవక్తగా,సందేశహరునిగా గడిపారు.ఇఖ్రా ద్వారా ప్రవక్త అయ్యారు మరియు ముద్దస్సిర్ ద్వారా సందేశహరులయ్యారు.ఆయనది మక్కా నగరం. అల్లాహ్ ఆయనను షిర్క్ నుండి హెచ్చరించమని మరియు ఏకదైవోపాసన వైపు పిలవమని పంపించాడు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం :{يَا أَيُّهَا الْمُدَّثِّرُ (1) ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా! (1)قُمْ فَأَنذِرْ (2) లే. హెచ్చరించు. (2)وَرَبَّكَ فَكَبِّرْ (3) నీ ప్రభువు గొప్పతనాన్ని చాటిచెప్పు. (3)وَثِيَابَكَ فَطَهِّرْ (4) మరియు నీ దుస్తులను నువ్వు శుభ్రపర్చుకో. (4)وَالرُّجْزَ فَاهْجُرْ (5) మరియు అశుద్ధతను నీవు తొలగించుకో. (5)وَلَا تَمْنُن تَسْتَكْثِرُ (6) మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!(6)وَلِرَبِّكَ فَاصْبِرْ (7)}నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు. (7)ముద్దస్సిర్ 1 - 7
ఖుమ్ ఫ అన్జిర్ : షిర్క్ నుండి హెచ్చరించండి మరియు తౌహీద్ వైపు పిలవండి.రబ్బక ఫకబ్బిర్ అంటే తౌహీద్ ద్వారా ఆయన గొప్పతనమును కొనియాడండి.సియాబక ఫతహ్హిర్ అంటే మీ కర్మలను షిర్క్ తో కల్పితం చేయకుండా శుభ్రముగా ఉంచండి.వర్రుజ్'జ ఫహ్జుర్, రుజ్'జ అంటే విగ్రహాలు. హజ్రుహా అంటే వాటిని మరియు వాటిని పూజించే వారిని విడనాడండి. వాటి నుండి మరియు వాటిని పూజించే వారి నుండి సంబంధం వదులుకోండి.ఈ ఒక్క మాటపైనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది సంవత్సరముల వరకు తౌహీద్ వైపు పిలుస్తూ ఉండిపోయారు. పది సంవత్సరముల తర్వాత ఆయనకు ఆకాశం వైపునకు మేరాజ్ (గగన యాత్ర) చేయించబడినది. మరియు ఆయనపై ఐదు పూటల నమాజులు విధిగావించబడినవి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సంవత్సరముల వరకు మక్కా నగరంలో నమాజు చేస్తూ వున్నారు. దాని తర్వాత మదీనా వైపు హిజ్రత్ (వలసవెళ్ళమని) చేయమని ఆయనకు ఆదేశించబడినది.హిజ్రత్ అంటే షిర్క్ జరిగే ప్రదేశం నుండి ఇస్లాం ప్రకారం ఆచరణ జరిగే ప్రదేశం వైపునకు వలసపోవుట అని అర్ధం. షిర్క్ జరిగే ప్రదేశం నుండి ఇస్లాం ప్రకారం ఆచరణ జరిగే ప్రదేశమునకు హిజ్రత్ చేయటం ఈ ఉమ్మత్ పై విధి. ఇది ప్రళయం ఏర్పడే వరకు ఉండే విధి.మరియు అల్లాహ్ యొక్క వాక్కు నుండి ఆధారం :{إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا (97) నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దైవదూతలు వారితో: "మీరు ఏ స్థితిలో ఉండేవారు?" అని అడిగితే, వారు: "మేము భూమిలో బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము!" అని జవాబిస్తారు. దానికి (దైవదూతలు): "ఏమీ? మీరు వలస పోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేకుండెనా?" అని అడుగుతారు. ఇలాంటి వారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం! (97)إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا (98) కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గం లేని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తప్ప! (98)فَأُولَٰئِكَ عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّهُ عَفُوًّا غَفُورًا (99)}కావున ఇటు వంటి వారిని, అల్లాహ్ మన్నించవచ్చు! ఎందుకంటే, అల్లాహ్ మన్నించే వాడు, క్షమాశీలుడు. (99)నిసా 97 - 99 ఆయతులు
అల్లాహ్ సెలవిచ్చాడు:-{يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبُدُونِ}ఓ విశ్వసించిన నా దాసులారా! నిశ్చయంగా, నా భూమి ఎంతో విశాలమైనది. కావున మీరు కేవలం నన్నే ఆరాధించండి.అన్కబూత్ 56వ ఆయతు.
ఇమామ్ బగవీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు :ఈ ఆయతు ఎవరైతే హిజ్రత్ చేయకుండా మక్కా ప్రదేశములో ఉన్నారో ఆ ముస్లింల గురించి అవతరించబడినది. అల్లాహ్ వారిని ఈమాన్ పేరుతో పిలిచాడు.హిజ్రత్ గురించి సున్నత్ నుండి ఆధారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాక్కు :తౌబా అంతమయ్యే వరకు హిజ్రత్ అంతమవ్వదు. సూర్యుడు పడమర నుండి ఉదయించేంత వరకు తౌబా అంతమవ్వదు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో స్థిరపడిన తర్వాత మిగితా ఇస్లాం ధర్మోపదేశాలు ఇవ్వబడ్డాయి. ఉదా : జకాత్,ఉపవాసాలు,హజ్,అజాన్,జిహాద్,మంచి గురించి ఆశించటం,చెడు నుండి వారించటం మరియు మొదలైన ఇస్లాం ధర్మోపదేశాలు ఇవ్వబడ్డాయి. వీటికి కట్టుబడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది సంవత్సరముల వరకు జీవించారు.
మరియు ఆయన మరణించారు. ఆయనపై అల్లాహ్ శుభాలు మరియు శాంతి కురియుగాక. ఆయన ధర్మం ప్రళయం వరకు ఉండిపోయేది. మరియు ఇది ఆయన ధర్మం. ప్రతీ మంచి గురించి ఆయన ఉమ్మత్ ను ఆదేశించారు. మరియు ప్రతీ చెడు నుండి వారించారు.ఆయన సూచించిన మేలు తౌహీదు మరియు అల్లాహ్ ఇష్టపడేవన్ని మరియు సంతుష్టపడేవి. ఆయన వారించిన చెడు షిర్కు మరియు అల్లాహ్ అసహ్యించుకున్నవి మరియు నిరాకరించినవి.ఆయనను అల్లాహ్ సర్వమానవాళి కొరకు సందేశహరుడుగా పంపించాడు. మానవులు,జిన్నాతులందరు ఆయనకు విధేయత చూపాలని విధిగావించాడు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దానికి ఆధారం :{قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا}(ప్రవక్త) చెప్పండి! ఓ ప్రజలారా నిశ్చయంగా నేను మీ అందరివైపుకు ప్రభవింపబడిన అల్లాహ్ సందేశహరుడను.ఆరాఫ్ 158 ఆయతు.అల్లాహ్ ఆయనపై ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు.
మరియు అల్లాహ్ యొక్క వాక్కు నుండి ఆధారం :{الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا}ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను,మీ పై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సంతృప్తిసమ్మతితో ఇష్టపడ్డాను.సూరతుల్ మాయిదా'ఆయతు 3
దైవప్రవక్త మరణిస్తారని అల్లాహ్ యొక్క వాక్కు ఆధారం :{إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ (30) నిశ్చయంగా నీవు మరణిస్తావు,మరియు వారు మరణిస్తారు.(30)ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ}ఆ తరువాత నిశ్చయంగా, పునరుత్థాన దినమున మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వివాదాలను విన్నవించుకుంటారు.జుమర్ 30,31 ఆయతులు.మరియు ప్రజలందరు మరణించిన తర్వాత ఫలితాలను పొందటానికి లేపబడుతారు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దానికి ఆధారం :{مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ}దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేపుతాము.తాహా 55వ ఆయతు.
అల్లాహ్ సెలవిచ్చాడు:-{وَاللَّهُ أَنبَتَكُم مِّنَ الْأَرْضِ نَبَاتًا (17) మరియు అల్లాహ్ యే మిమ్మల్ని భూమి (మట్టి) నుండి ఉత్పత్తి చేశాడు! (17)ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا (18)}తరువాత ఆయన మిమ్మల్ని అందులోకే తీసుకొని పోతాడు మరియు మిమ్మల్ని దాని నుండి (బ్రతికించి) బయటికి తీస్తాడు!(18)నూహ్ 17,18 ఆయతులుమరణాంతరం లేపబడిన తర్వాత వారు లెక్క తీసుకోబడుతారు మరియు పాపపుణ్య కర్మల ప్రతిఫలం ప్రసాదించబడుతారు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం :{وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاءُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ الَّذِينَ أَحْسَنُوا بِالْحُسْنَى}మరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది, అంతా అల్లాహ్ కే చెందుతుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి.నజ్మ్ 31వ ఆయతు.
ఎవరైన మరణాంతర జీవితాన్ని నిరాకరిస్తే అతను అవిశ్వాసి. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం :{زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ}సత్యాన్ని తిరస్కరించిన వారు (చనిపోయిన తరువాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను: "అది కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత మీరు (ప్రపంచంలో) చేసిందంతా మీకు తెలుపబడుతుంది. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం".తగాబున్ 7వ ఆయతు.అల్లాహ్ తఆలా ప్రవక్తలందరిని శుభవార్తనిచ్చేవారిగా,హెచ్చరించే వారిగా చేసి పంపించాడు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం :{رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ}(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని!నిసా 165వ ఆయతువారిలో నూహ్ అలైహిస్సలాం మొదటివారు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో చివరివారు. మరియు ఆయన ప్రవక్తల పరిసమాప్తి.
వారిలో నూహ్ అలైహిస్సలాం మొదటివారు అనటానికి ఆధారం అలాహ్ యొక్క ఈ వాక్కు :{إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ}ఓ ప్రవక్తా మేము మీ వైపు అలాగే దైవవాణి పంపాము,ఎలాగైతే మేము నూహ్ వైపు మరియు వారి తర్వాత ప్రవక్తలవైపు పంపామో.నిసా 163వ ఆయతునూహ్ అలైహిస్సలాం మొదలుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రతి జాతిలోను అల్లాహ్ సందేశహరులను పంపించాడు. వారు ప్రజలను ఒక్క అల్లాహ్ ఆరాధన చేయమని ఆదేశించేవారు. మరియు తాగూత్ ఆరాధన నుండి వారించేవారు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం :{وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ}{నిశ్చయంగా మేము ప్రతీ సముదాయంలో ప్రవక్తను ప్రభవింపచేసాము,[ప్రజలారా ]కేవలం అల్లాహ్'ను ఆరాధించండి మరియు తాగూత్ (మిథ్యాదైవాలు) కు దూరంగా ఉండండి'నహల్ 36వ ఆయతు.అల్లాహ్ దాసులందరిపై తాగూత్ ను తిరస్కరించటమును మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటమును అనివార్యం చేశాడు.
ఇబ్నుల్ ఖయ్యిమ్' రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు :తాగూత్ అర్ధం ఏమిటంటే వేటి వలన దాసుడు తన పరిమితులను అదిగమిస్తాడు వీటిలో ఆరాధించబడేవి,అనుసరించబడేవి మరియు విధేయత చూపబడేవి. తాగూత్ లు చాలా ఉన్నవి. వాటిలో ప్రధమ స్థానంలో అయిదుగురున్నారు. 1) అల్లాహ్ శపించిన ఇబ్లీస్,2) తన పూజ జరుగుతున్నప్పుడు దానిని మెచ్చుకునేవాడు,3) ప్రజలను తనను పూజించమని ఆహ్వానించే వ్యక్తి,4) తనకు అగోచర జ్ఞానం ఉన్నదని చాటింపు చేసుకునే వ్యక్తి,5) అల్లాహ్ అవతరింపజేసిన ధర్మానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పేవాడు.మరియు అల్లాహ్ యొక్క వాక్కు నుండి ఆధారం :{لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ}ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.బఖరా : 256వ ఆయతుఇదియే లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్ధము.
మరియు హదీసులో ఇలా ఉందిధర్మానికి అసలు మూలం ఇస్లాం,నమాజు దాని మూల స్థంభం,దాని శిఖరము యొక్క ఎత్తు అల్లాహ్ మార్గంలో చేసే ధర్మపోరాటం.అల్లాహ్ యే ఎరుగును.
ప్రతీ ముస్లిం తప్పనిసరిగా నేర్చుకోవలసినది
హనీఫియ్య ఇబ్రాహీం మిల్లత్ అది ఒక్కడైన అల్లాహ్ ఆరాధన.
అల్లాహ్ ఆదేశించిన ఆరాధన రకాలు.
ద్వితీయ సూత్రం : ఇస్లాం ధర్మాన్ని ఆధారాలతో తెలుసుకోవటం
మూడవ స్థానం ఇహ్సాన్ దీనికి ఒకేఒక మూలం ఉంది.
తృతియ సూత్రం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అవగాహన -