Description
హజ్జ్ అంటే ఏమిటి, ఆ పవిత్ర చేయటం గురించిన ధర్మాజ్ఞలు, దాని శుభాలు మరియు లాభాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.
పవిత్ర హజ్జ్ యాత్ర
శుభాలు మరియు లాభాలు
అల్ హమ్దులిల్లాహ్ (సకల ప్రశంసలు, స్తోత్రములు అల్లాహ్ కే చెందును). ముహమ్మదుర్రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే అల్లాహ్ యొక్క అంతిమ సందేశహరుని పై శాంతి, దీవెనలు కురుయుగాక.
ఇది పవిత్ర హజ్జ్ యాత్ర – దాని యొక్క శుభాలు, ప్రయోజనాలు మరియు కొన్ని నియమ నిబంధనల గురించిన ఒక క్లుప్తమైన చర్చ.
1. హజ్జ్ యాత్ర ఎప్పుడు ఆజ్ఞాపించబడినది
హజ్జ్ యాత్ర దౌత్యబృందాల (అల్ ఉఫూద్) సంవత్సరంగా ప్రసిద్ధి గాంచిన హిజ్రీ 9వ సంవత్సరంలో అవతరించిన క్రింది దివ్యఖుర్ఆన్ వచనం ఆధారంగా ఆజ్ఞాపించబడినదని ఒక సరైన అభిప్రాయం. ఈ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు (కాబా) గృహానికి హజ్జ్ యాత్ర (మక్కా నగరపు పవిత్ర యాత్ర) అనేది తమ (ప్రయాణ) ఖర్చులు భరించ గలిగే స్థోమతు గల మానవులు తప్పక పూర్తి చేయవలసి ఉన్న అల్లాహ్ యొక్క హక్కు” [ఖుర్ఆన్ 3:97]
2. హజ్జ్ గురించిన ఆదేశం
హజ్జ్ అనేది ఒక ఫరీదా అంటే తప్పని సరిగా (విధిగా) నెరవర్చవలసి ఉన్న ఆచరణ. ఇది ఇస్లాం ధర్మపు మూలస్థంభాలలో ఒకటి. దీనికి ఆధారం పైన ఉదహరించిన దివ్యఖుర్ఆన్ యొక్క వచనం. అంతే కాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలలో (సున్నహ్ లో) కూడా ఈ వచనాన్నే సమర్థిస్తున్న అనేక ఆధారాలు ఉన్నాయి. ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా ఉపదేశించారు: “ఇస్లాం ఐదింటిపై (మూలస్థంభాలపై) నిర్మించబడి ఉన్నది: అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యమివ్వటం,నమాజు స్థాపించటం, జకాహ్ (తప్పని సరి విధి దానం) చెల్లించటం, హజ్జ్ యాత్ర చేయటం మరియు రమదాన్ నెల ఉపవాసం ఉండటం.” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు).
3. హజ్జ్ యాత్ర తప్పని సరి అనే ఆజ్ఞ స్పష్టమైనదేనా?
అవును, ఇది తప్పని సరిగా పూర్తి చేయవలసిన యాత్ర. దీనికి ఆధారం పైన ఉదహరించబడిన వచనం. ఇది షరిఅహ్ (ఇస్లామీయ జీవన విధానానికి) కు సంబంధించిన ఒక స్పష్టమైన మార్గదర్శకత్వపు నియమం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలలో దీని ఆధారాలు క్రింద ఇవ్వబడినవి:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన హజ్జ్ ను 10వ హిజ్రీ సంవత్సరం వరకు వాయిదా వేసిన సంఘటన ఆధారంగా, హజ్జ్ ను ఆలస్యం చేయ వచ్చని షాఫయీ అభిప్రాయపడుతున్నారు. కాని ఈ అభిప్రాయానికి సమాధానం ఇలా ఉన్నది:
(షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రచించిన అల్ షరహ్ అల్ ముమ్తి, 7/17, 18 చూడండి)
4. తమ జీవిత కాలంలో ఒక్కసారి హజ్జ్ చేయటం తప్పని సరి విధి.
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రసంగంలో (ఖుత్బాలో) ఇలా ఉపదేశించారు: “ఓ ప్రజలారా, అల్లాహ్ మీ పై హజ్జ్ ను తప్పని సరి చేసినాడు, కాబట్టి మీరు హజ్జ్ చేయండి.” ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించెను - ప్రతి సంవత్సరమా, ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా? వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ వ్యక్తి ఇదే ప్రశ్నను మరల మరల మూడు సార్లు అడుగగా, వారు ఇలా సమాధానమిచ్చినారు “ఒకవేళ నేను అవును అంటే, అది తప్పని సరి అయిపోతుంది మరియు మీరు దానిని ఆచరించ లేక పోతారు.” ఆ తర్వాత వారు ఇలా పలికారు, “మీకు తెలిపిన విషయాలు తప్ప మరిన్ని అదనపు విషయాలు తెలుపమని నా పై వత్తిడి చేయవద్దు, మీ కంటే పూర్వం వచ్చిన ప్రజలు ఇదే కారణంగా నాశనమైపోయారు ఎందుకంటే వారు తమ ప్రవక్తలను చాలా ఎక్కువగా ప్రశ్నించేవారు మరియు వాదించేవారు. ఒకవేళ నేను మిమ్ముల్ని ఏదైనా ఆచరణ చేయమని ఆదేశించినచో, దానిని మీరు సాధ్యమైనంత అధికంగా ఆచరించండి మరియు ఒకవేళ నేను మిమ్మల్ని ఏదైనా ఆచరణ చేయవద్దని నిరోధించినచో, దానిని మీరు బహిష్కరించండి.” (ముస్లిం హదీథ్ గ్రంథం)
5. హజ్జ్ యొక్క శుభాలు
హజ్జ్ యొక్క శుభాల గురించి వివరించే హదీథ్ లు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని:
స్వీకరించబడిన హజ్జ్ అంటే:
1. న్యాయంగా సంపాదించిన ధనం నుండి హజ్జ్ ఖర్చులు చెల్లింపబడ వలెను.
2. హజ్జ్ సమయంలో చెడు, పాపకార్యాలు, దుష్టత్వం మరియు అన్యాయమైన తగాదాల నుండి దూరంగా ఉండవలెను.
3. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల అంటే సున్నహ్ ప్రకారం మాత్రమే హజ్జ్ లోని ఆరాధనలు ఆచరించ వలెను.
4. ఇతరులకు చూపటానికి (పేరు కోసం, కీర్తిప్రతిష్టల కోసం) హజ్జ్ చేయరాదు; హజ్జ్ అనేది చిత్తశుద్ధితో మరియు పవిత్రతతో కేవలం అల్లాహ్ యొక్క స్వీకరణ కోసం మాత్రమే చేయవలెను.
5. అల్లాహ్ కు అవిధేయత చూపే పనులు మరియు పాపకార్యాలు చేయరాదు.
a. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా ఉపదేశించినారు: “ఎవరైతే అల్లాహ్ కోసమే హజ్జ్ చేస్తారో మరియు (తన భార్యతో) సంభోగం చేయరో, పాపకార్యాలు చేయరో, అన్యాయపు తగాదాలలో పాల్గొనరో అటువంటి వారు తల్లి జన్మినిచ్చిన దినం నాటి స్థితిలో (అంతటి పవిత్రతో) మరలి వస్తారు.” (సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథాలు)
b. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరో ఉపదేశాన్ని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఒక ఉల్లేఖనలో ఇలా తెలిపినారు: “‘ఉమ్రా (హజ్జ్ దినాలలో కాక వేరే దినాలలో మక్కా యాత్ర) యాత్ర, దానికి మరియు క్రితం ఉమ్రా కు మధ్య కాలంలో జరిగిన పాపాలను ప్రక్షాళణ చేయును. మరియు స్వీకరించబడిన హజ్జ్ కు లభించే ప్రతిఫలం స్వర్గం కంటే తక్కువగా ఉండదు (అంటే స్వర్గం ప్రాప్తమగును).” (సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథాలు).
c. ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: ఒకసారి ఆయెషా రదియల్లాహు అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా ప్రశ్నించారు, “ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా! మేము కూడా సైనిక చర్యల పరంపరలలో పాల్గొనటానికి మీతో పాటు బయలు దేరి, జిహాద్ యుద్ధాలలో పోరాడవచ్చునా? ” వారు ఇలా సమాధానమిచ్చినారు, “కాని హజ్జ్ అంటే స్వీకరించబడిన మక్కా పవిత్ర యాత్ర అనేది అత్యంత ఉత్తమమైన మరియు సౌందర్యవంతమైన ధర్మయుద్ధమే (జిహాద్).” ఆ తర్వాత ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా తెలిపారు, అల్లాహ్ యొక్క సందేశహరుని (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఈ ఉపదేశం విన్ననాటి నుండి నేను ఏనాడూ హజ్జ్ యాత్రకు వెళ్ళకుండా ఉండలేదు. (సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం).
d. అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఇంకో హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “హజ్జ్ తనకు పూర్వం జరిగిన వాటినన్నింటినీ (పాపాలన్నింటినీ) తుడిచి వేయును.” (సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథం).
e. అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు:“హజ్జ్ మరియు ఉమ్రా చేస్తూ ఉండండి, ఎందుకంటే అవి బీదరికాన్ని మరియు పాపాల్ని తొలగించును ఎలాగైతే కొలిమితిత్తులు ఇనుము, బంగారం, వెండి నుండి మలినాలను తొలగించునో.” (అత్తిర్మిథీ హదీథ్ గ్రంథం; అన్నిసాయీ హదీథ్ గ్రంథం. సిల్సిలాహ్ అల్ సహీహాహ్ అనే గ్రంథంలో షేఖ్ అల్ బానీ ఈ హదీథ్ ను సహీహ్ హదీథ్ గా వర్గీకరించారు).
f. ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఇంకో హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “అల్లాహ్ కోసం ధర్మయుద్ధం చేసేవారు మరియు హజ్జ్ లేక ఉమ్రా చేయటానికి బయలు దేరిన ప్రయాణికులు అల్లాహ్ యొక్క అతిథులే. అల్లాహ్ వారిని ఆహ్వానించెను మరియు వారు ఆ ఆహ్వానాన్ని స్వీకరించినారు; వారు అల్లాహ్ ను వేడుకుంటారు మరియు అల్లాహ్ వాటిని ప్రసాదిస్తాడు” (ఇబ్నె మాజా హదీథ్ గ్రంథం. సిల్సిలాహ్ అల్ సహీహాహ్ అనే గ్రంథంలో షేఖ్ అల్ బానీ ఈ హదీథ్ ను సహీహ్ హదీథ్ గా వర్గీకరించారు).
6. హజ్జ్ యొక్క ప్రయోజనాలు
దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ భావం యొక్క అనువాదం): “వారికి ప్రయోజనం కలిగించే విషయాలను వారు చూస్తారు” [అల్ హజ్జ్ అధ్యాయం 22:28]
హజ్జ్ వలన కలిగే రెండు విధాలా ప్రయోజనం కలుగును – ప్రాపంచిక ప్రయోజనం మరియు ధార్మిక అంటే అధ్యాత్మిక ప్రయోజనం.
ధార్మిక ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే హజ్జ్ యాత్రకు వెళతారో, వారు అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందుతారు మరియు తమ పాపాలన్నింటినీ క్షమింపజేసుకుని మరలి వస్తారు. మరెక్కడా లభించనంతటి పుణ్యాలను కూడా పొందుతారు. మస్జిద్ అల్ హరామ్ లో ప్రతి నమాజుకు లభించే పుణ్యాలు వేరే ఇతర ప్రాంతాలలోని నమాజు కంటే లక్ష రెట్లు ఎక్కువ. అంతేకాక కాబాగృహపు తవాఫ్ మరియు సయీ మరెక్కడా చేయలేరు.
ఇతర ప్రయోజనాలలో ఇతర దేశాలలో నివసించే తోటి ముస్లింలను కలుసుకోవటం మరియు వారి ప్రాంతాలలోని విషయాలను తెలుసుకోవటం, ఇస్లామీయ పండితులను కలుసుకుని మంచి మంచి విషయాలు నేర్చుకోవటం మరియు తమ సమస్యలకు వారి నుండి సమాధానాలు పొందటం మొదలైనవి.
ప్రాపంచిక ప్రయోజనాలలో వ్యాపారం మరియు లావాదేవీలు, ఇంకా హజ్జ్ ద్వారా లభించే ఇతర ప్రయోజనాలు.
7. హజ్జ్ గురించిన నియమనిబంధనలు మరియు ప్రజలపై వాటి అధ్యాత్మిక ప్రభావం.
హజ్జ్ ఆచరణల వెనుక అనేక శుభాలు మరియు చాలా వివేకం దాగి ఉన్నది. ఎవరికైతే ఆ ఆచరణల సరైన జ్ఞానం ప్రసాదించబడినదో, వారికి అనేక శుభాలు ప్రసాదించబడినట్లే. ఉదాహరణకు:
కాబాగృహపు ఒక మూలలోని గోడలో ఉన్న నల్లటి రాయిని ముద్దు పెట్టుకోవటమనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని (సున్నహ్ ను) గౌరవించమని మరియు అల్లాహ్ యొక్క ఆదేశాలను అవివేకమైన బలహీన తర్కములతో వ్యతిరేకించవద్దని బోధిస్తున్నది. అతను మానవజాతి కోసం అల్లాహ్ అవతరింపజేసిన ధర్మచట్టం మరియు ధర్మారాధనల వెనుక ఉన్న వివేకం మరియు శుభం కనిపెడతాడు. ఇంకా అతను స్వయంగా తనకు తానుగా అల్లాహ్ కు సంపూర్ణంగా సమర్పించుకునేందుకు శిక్షణ ఇచ్చుకుంటాడు. ఒకసారి ఉమర్ రదియల్లాహు అన్హు కాబాగృహపు నల్లరాతిని ముద్దు పెట్టుకుని, ఇలా పలుకినారు: “నాకు తెలుసు నీవు మంచి గాని, చెడు గాని కలిగించలేని కేవలం ఒక రాయివి మాత్రమే. నేను గనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దు పెట్టుకోవటం చూసి ఉండకపోతే, నేను నిన్ను ముద్దు పెట్టుకునేవాడిని కాను.” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు).
అల్లాహ్ ఆజ్ఞలను విధేయతతో పాటించటానికి, అల్లాహ్ పవిత్ర గృహానికి చేరుకునేందుకు, మనకు ఆదేశించిన పనులన్నింటినీ ఆచరించటానికి సహాయపడమని మరియు మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక దీవెనలు పంపమని అల్లాహ్ ను వేడుకుందాము.